పెళ్లి తరువాత నాగచైతన్య ఏం చేయబోతున్నారో తెలుసా..? కెరీర్ పై పక్కా ప్లాన్ తో అక్కినేని హీరో.
హీరోయిన్ శోభిత దూళిపాళతో రెండో పెళ్ళికి రెడీ అయ్యాడు నాగచైతన్య. సింపుల్ గా పెల్లాడబోతున్నాడు అక్కినేని హీరో. ఇక పెళ్ళి తరువాత తన కెరీర్ కు సంబంధించి పక్కాగా ఓ ప్లాన్ తో రెడీగా ఉన్నాడట యంగ్ స్టార్. ఇంతకీ నాగచైతన్య ఏం చేయబోతున్నాడు.
అక్కినేనివారింట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. డిసెంబర్ 5న నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ మొడలో మూడు ముళ్లు వేశారు. సమంతను ప్రేమించి పెళ్ళాడిన చైతన్య.. మూడేళ్లు కలుసున్నారు. ఆతరువాత మనస్పర్ధలు రావడంతో మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత చైతూ శోభితతో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.
Also Read: అల్లు అర్జున్ ఫిట్నెస్ రహస్యం, సీక్రేట్ డైట్ ఏమైనా తీసుకుంటారా..?
ఇక చాలా కాలం సీక్రేట్ గా ప్రేమించుకున్న ఈ జంట తాజాగా పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకున్నారు. వీరి పెళ్ళికి సబంధించి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా నాగచైతన్య కెరీర్ లో మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. సినిమా కోసం సిన్సియర్ గా పనిచేస్తాడు చైతూ. చాలా కష్టపడ్డా కాని ఈ కుర్ర హీరోకి అదృష్టం కలిసి రావడంలేదు.
దాంతో మరిన్ని ప్రయోగాలకు రెడీ అయ్యాడు నాగచైతన్య. అందులో భాగంగానే చైతూ తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా కోసం ఏడాదికిపైగా కష్టపడుతున్నాడు చైతూ. గ్రౌంట్ రియాల్టీ తెలుసుకోవడం కోసం నిజంగా చేపలు పట్టేవారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలిసుకోవడం కోసం వారితో కలిసి ఉండటం. వారి దగ్గరకు వెళ్ళి వారి లైఫ్ స్టేన్ ను అలవాటు చేసుకున్నాడు.
మరి ఈసినిమా అయినా చైతూను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే తండేల్ సినిమాను సెట్స్ మీద ఉంచినప్పటికి ఆయన తన నెక్ట్స్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి కూడా భారీ సక్సెస్ పై కన్నేశాడు. ఇప్పటికీ కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన తండేల్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Naga Cahitanya starrer Thandel film song out
నాగచైతన్య తండేల్ తో పాటు విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా మరో రెండు సినిలకు కూడా ఆయన కమిట్ అయ్యాడంట. ఇక ఏది ఏమైనా కూడా నాగచైతన్య తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు సక్సెస్ ని సాధిస్తున్నాడనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ మొత్తం నాగచైతన్య పెళ్లి సంబరంలో మునిగితేలుతున్నారు. ఇక ఈ పెళ్లి తర్వాత కొద్ది రోజుల సమయాన్ని తీసుకొని నాగచైతన్య తన షూటింగ్ పనుల్లో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది. మరి పెళ్ళితరువాత అయినా అదృష్టం కలిసి వచ్చి చైతూ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.