MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చైతు -సమంత విడాకులు : కాంప్రమైజ్ చేసే ప్రయత్నాల్లో రెండు కుటుంబాలు ?

చైతు -సమంత విడాకులు : కాంప్రమైజ్ చేసే ప్రయత్నాల్లో రెండు కుటుంబాలు ?

ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని అంశం. విభేదాల కారణంగా ఎంతో వేదన నడుమ చైతు సమంత విడిపోయారు.

2 Min read
Author : pratap reddy
Published : Oct 16 2021, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంఘటన నాగ చైతన్య, సమంత విడాకులు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని అంశం. విభేదాల కారణంగా ఎంతో వేదన నడుమ చైతు సమంత విడిపోయారు. దాదాపు దశాబ్దానికి పైగా పరిచయం వీళ్ళిద్దరిది. నాలుగేళ్లపాటు దంపతులుగా కాపురం చేశారు. ఏమైందో తెలియదు కానీ ఊహించని విధంగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీనితో ఇటీవల తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏమాయ చేసావే చిత్రంతో చైతు, Samantha తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో జంటగా నటించారు. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2017లో చైసామ్ వివాహం ఘనంగా జరిగింది. 

 

36

ఇద్దరూ టాలీవుడ్ లో బిజీ నటులు. ఎవరి చిత్రాలు వారు చేసుకుంటూ.. అవసరమైనప్పుడు కలసి నటిస్తూ.. రీల్ లైఫ్, రియల్ లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయారు. భార్య భర్తలుగా అన్యోన్యంగా జీవించారు. కానీ కొన్ని నెలల క్రితం వీరి రిలేషన్ షిప్ లో ముసలం మొదలైంది. అయితే దానికి గల కారణాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు. 

 

46

సోషల్ మీడియాలో మాత్రమే అనేక ఊహాగానాలు ఉన్నాయి. సమంతని నిందిస్తూ అనేక వార్తలు వచ్చాయి. తనపై వస్తున్న ఆరోపణలకు సమంత ఎమోషనల్ గా సమాధానం ఇచ్చింది. చివరకు తన స్టైలిస్ట్ తో సంబంధం ఉన్నట్లు కూడా ఆరోపణలు రావడంతో సమంత కుంగిపోయింది. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోవడం అటు వారి కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కి కూడా హార్ట్ బ్రేకింగ్. 

 

56

వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడే ఇద్దరి కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారట. అటు సమంత ఫ్యామిలీ ఇటు Nagarjuna చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ChaySam వీడిపోవడానికే డిసైడ్ అయ్యారు. తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ఇది జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

66

ఇంతకీ ఆ సంగతి ఏంటంటే.. మరోసారి అక్కినేని.. సమంత కుటుంబ సభ్యులు చర్చలకు కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. Naga Chaitanya, సమంతని తిరిగి కలపాలని ప్రయత్నిస్తున్నారట. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే విడిపోవడం అనేది అంత సులువైన విషయం కాదు. నిండు జీవితానికి సంబంధించిన విషయం.. ఎన్నో ఎమోషన్స్ ఇవాల్వ్ అయి ఉంటాయి. ఆ బాధని స్వీకరించడం అంత సులువు కాదు. ఈ అంశాలని పరిగణలోకి తీసుకునే ఇరు కుటుంబ సభ్యులు కంప్రమైజ్ ప్రయత్నాల్లో ఉన్నారని వినికిడి. 

 

About the Author

PR
pratap reddy
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image3
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved