పది లక్షల అగ్రిమెంట్: 'మల్లెమాల' పై నాగబాబు సూటిగా సెటైర్స్
జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకుని అదిరింది అనే పేరుతో మరో కామెడీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర,ధనరాజ్ వంటి మరికొందరు జబర్దస్త్ ని వదిలేశారు. అప్పట్లో మల్లెమాల తొందరపాటు నాగబాబుని దూరం జరిపిందని వార్తలు వచ్చాయి. ఈటీవీ లో జబర్దస్త్ ని మించిన కార్యక్రమం మరోటి లేదంటే అతిశయోక్తి కాబోదు. ఎందుకంటే జబర్దస్త్ ప్రారంభం అయ్యాక ఈటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. దీనిని తట్టుకోవడం మిగిలిన చానెల్స్ కు సాధ్యం కాలేదు. జబర్దస్త్ విజయం తొ ఎగస్ట్రా జబర్దస్త్ ప్రారంభించి మరింత గా దూసుకుపోయింది ఈ టీవీ. దీంతో ప్రత్యర్థి ఛానెల్స్ జబర్దాస్త్ లాంటి షో చేయాలని విశ్వప్రయత్నాలు చేశాయి. కానీ, ఏవీ నిలబడలేదు.
కానీ జీ వారు ఓ అడుగు ముందుకేసి.. బంపర్ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి ఈ షో డైరక్టర్స్ నితిన్-భరత్ జోడీని లాగేసుకుంది. అయితే, ఈ దర్శక జోడీకి తాము ఇద్దరే ఏమీ చేయలేమని తెలుసు. అందుకే తమతో పాటూ జబర్దస్త్ కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ లని లాక్కురావడానికి ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా ముందు జబర్దస్త్ ను వదలడానికి సిద్ధమయ్యాడు చమ్మక్ చంద్ర.
తమ టీమ్ లీడర్లు, షో డైరక్టర్స్ జారిపోవడం చూసిన మల్లెమాల టీం మిగిలిన వారిని కాపాడుకునేందుకు ఎగ్రిమెంట్ చేయించుకునే పనిలో పడింది. ఇక్కడ అసలు కథ మొదలై..నాగబాబు బయటకు వెళ్ళడానికి దారితీసిందనేది చెప్తారు. టీం లీడర్ల తొ పాటు ఆ అగ్రిమెంట్ పై నాగబాబు కూడా సంతకం చేయాలని మల్లెమాల కోరిందని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన నాగబాబు దీనిని అవమానంగా భావించి జబర్దస్త్ వదిలేయడానికి సిద్ధం అయిపోయారు.
అందుకు కారణం లేకపోలేదు.. గతంలో నాగబాబుకు వేరే చానెల్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా అయన మల్లెమాలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకు వేల్లలేదట. అయితే, అంత నమ్మకంగా నిలబడ్డ తనను అగ్రిమెంట్ కోరేసరికి ఆయనకు కోపం వచ్చిందని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ ఎగ్రిమెంట్ విధానంపై అవకాసం దొరికిన ప్రతీసారి మల్లెమాల, జబర్దస్త్ షోలపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. తాజాగా నాగబాబు బొమ్మ అదిరింది షోలో చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. చమ్మక్ చంద్ర వేసిన స్కిట్‌లో భాగంగా నాగబాబు వేసిన పంచ్ లు పరోక్షంగా మల్లెమాల, జబర్దస్త్ షోను టార్గెట్ చేసేలా ఉన్నాయి.
ఈ వారం ప్రసారమైన ఓ ఎపిసోడ్ లో చమ్మక్ చంద్ర ఓ కాంట్రాక్ట్ మీద ఓ ఇంట్లో పని మనిషిగా చేరుతాడు. అయితే ఆ ఇంటి యజమాని ముందుగా రాయించుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. సంవత్సరం లోపు పని మనిషి తనంతట తాను మానేస్తే పది లక్షలు ఇవ్వాలని, తాము గెంటేస్తే పని మనిషికి పది లక్షలు ఇస్తామని ఉంటుంది.
ఇక ఈ కాంట్రాక్ట్‌లో ఉన్న లొసుగులను బట్టి ఆ పని మనిషిగా ఉన్న చంద్ర యజమానులను ముప్పు తిప్పలు పెడతాడు. నీది న్యాయమైన అగ్రిమెంట్.. యజమాని చమ్మక్ చంద్ర రాసుకున్న అగ్రిమెంట్ న్యాయమైంది అని.. కొందరైతే ఒకవైపే రాసుకుంటారని నాగబాబు కౌంటర్లు వేశాడు. వారు గెంటేసినా, మనం మానేసినా మనం చేతే పది లక్షలు కట్టించుకుంటారని మల్లెమాలనుద్దేశించి అన్నట్టు తెలుస్తోంది.
ఇలా ఈ స్కిట్ జరిగినంత సేపు ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు. పది లక్షలు కట్టి వచ్చిన వారున్నారు.. స్కిట్‌లోనే భాగంగా పని మనిషిగా ఉన్న చమ్మక్ చంద్ర పెట్టే బాధలు భరించలేక పది లక్షలు ఇచ్చి వదిలించుకుందామా? అని యజమానులు అనుకుంటారు. అలా మాట్లాడుతుండగా స్కిట్ మధ్యలో నాగబాబు కౌంటర్లు వేస్తూ.. అలా అగ్రిమెంట్‌ను వదిలేసి పది లక్షలు కట్టి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారంటూ పగలబడి నవ్వేశాడు.
ఇదే సమయంలో జనం ..అవినాష్ విషయంలో జరిగింది గుర్తు చేసుకుంటున్నారు.అవినాష్ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈ ఎగ్రిమెంట్ అడ్డంకులు దాటాల్సి వచ్చింది. మల్లెమాల అగ్రిమెంట్ పేరుతో అవినాష్‌ను అడ్డుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. పది లక్షలు చెల్లించి మరీ అవినాష్ ఆ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేయించుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నాగబాబు చేసిన కామెంట్లతో అది నిజమని తేలింది.
బొమ్మ అదిరింది తొలి ఎపిసోడ్‌పై వివాదం రేగింది. తొలి ఎపిసోడ్ కావడంతో హరి టీమ్ లీడర్‌గా ఉన్న రౌడీ బోయ్స్, సద్దాం లీడ్ చేస్తోన్న గల్లీ బోయ్స్ టీంలు కలిసి స్కిట్ చేశాయి. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ అని కాన్సెప్ట్ తీసుకొని సినీ, రాజకీయ ప్రముఖుల పేరడీలతో క్రికెట్ ఆడించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరగుజ్జు రియాజ్ ఇమిటేట్ చేస్తూ.. అన్నవచ్చాడు అంటూ హేళన చేశాడు. అయితే వీళ్ల ఇమిటేషన్స్ పరిధి దాటి హేళనగా మారింది.