- Home
- Entertainment
- 400 ఎకరాల్లో ధ్వంసం, మన ఖర్మ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగ్ అశ్విన్ బోల్డ్ కామెంట్స్
400 ఎకరాల్లో ధ్వంసం, మన ఖర్మ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగ్ అశ్విన్ బోల్డ్ కామెంట్స్
కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

Nag Ashwin
కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కల్కి చిత్రం గురించి కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కల్కి సెకండ్ పార్ట్ లో ఎక్కువగా భైరవ, కర్ణ పాత్రల గురించే ఉంటుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు.
ఇటీవల నాగ్ అశ్విన్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు. 400 ఎకరాల్లో ఐటి పార్క్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానిని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ మన ఖర్మ అని పోస్ట్ చేశారు. ఎందుకు అలా పోస్ట్ చేశారు అని అడగగా నాగ్ అశ్విన్ బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం తనకి నచ్చలేదు అని అన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న 400 ఎకరాలు చాలా పచ్చగా చెట్లతో ఉండే ప్రాంతం.
Kalki 2829 AD
ఐటి పార్క్ డెవలప్ చేయాలి అనుకుంటే ఖాళీగా చాలా ఐటి పార్క్ లు పడివున్నాయి. వాటిని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా మరో 400 ఎకరాల్లో చెట్లని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఇది తన అభిప్రాయం అని నాగ్ అశ్విన్ తెలిపారు. నాగ్ అశ్విన్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.