- Home
- Entertainment
- Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ సోఫాలో విరహ వేదన.. క్లీవేజ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న నభా నటేష్..
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ సోఫాలో విరహ వేదన.. క్లీవేజ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న నభా నటేష్..
`ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ కెరీర్ పరంగా స్ట్రగులింగ్‌లో ఉంది. తోటి హీరోయిన్ పెద్ద పెద్ద ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకపోతుంటే, ఆ స్థాయిలో సత్తాని చాటలేకపోతుందీ ఈ హాట్ బాంబ్.

నభా నటేష్ తాజాగా తన నయా అందాల ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది నభా. ఇందులో ఆమె మైండ్ బ్లాకింగ్ పోజులివ్వడం విశేషం. హాట్ లుక్‌లో, మైండ్ బ్లాక్ చేసేలా నభా నటేష్ గ్లామర్ ట్రీట్ ఉండటం విశేషం.
ఇందులో సోఫాలో కూర్చొని విరహ వేదన చెందుతుంది నభా నటేష్. బిగువైన డ్రెస్‌లో క్లీవేజ్ అందాలు పోటెత్తగా, తల్లడిల్లిపోతుంది. ఆమె కుదురుగా ఉండలేక పోజులిస్తూ, ఇప్పుడు ఇంటర్నెట్‌లో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే ఈ బ్యూటీ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో షేక్ చేస్తున్నాయి.
సినిమాల జోరు తగ్గడంతో అడపాదడపా గ్లామర్ షో చేస్తుంది నభా నటేష్. కానీ లేట్‌గా, గ్యాపిచ్చి అందాల విందు చేసినా, అది ఆ గ్యాప్‌పి భర్తీ చేసేలా ఉండటం విశేషం. ఇప్పుడు పంచుకున్న ఫోటోలు సైతం అదే స్థాయిలో హాటెస్ట్ గా ఉన్నాయి.
ఈ సందర్భంగా నభా నటేష్ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `ఎల్లప్పుడు నా తలలో మ్యూజిక్ చేస్తూనే, నా సొంత స్వరాలకు నృత్యం చేస్తూ, నా సొంత రాజ్యంలో జీవిస్తున్నాను. నన్ను విజిట్ చేసిన మీ అందరికి స్వాగతం` అంటూ క్రేజీ పోస్ట్ పెట్టింది నభా. ఇది అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఎప్పటికీ లాగా ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతూ, ఆమె అందాన్ని పొగుడుతున్నారు.
`నభా నటేష్` ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసింది. కన్నడలో మూడు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ `నన్ను దోచుకుందువటే` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `అదుగో` సినిమాలో మెరిసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన `ఇస్మార్ట్ శంకర్` తో బ్లాక్ బస్టర్ అందుకుంది. తొలి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి ఎన్నాళ్లు నిలవలేదు. రవితేజతో `డిస్కో రాజా`లో మెరిసింది. మరోవైపు సాయి ధరమ్ తేజ్‌తో `సోలో బ్రతుకే సో బెటర్`, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో `అల్లుడు అదుర్స్` సినిమాల్లో నటించింది. కానీ ఇవి సక్సెస్ కాలేదు. నితిన్‌తో చేసిన `మ్యాస్ట్రో` మూవీ మాత్రం ఫర్వాలేదనిపించుకుంది. కానీ నభాని మాత్రం మేకర్స్ పట్టించుకోవడం మనేశారు. దీంతో ఇప్పుడు గ్లామర్ షో చేస్తూ మేకర్స్ కంట్లో పడేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఈ అమ్మడి అందాల విందుకైనా టెంప్ట్ అయి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.