ఇస్మార్ట్ బ్యూటీ ఘాటు అందాల షో.. ఫోటోస్ వైరల్
`ఇస్మార్ట్ శంకర్`తో క్రేజీ యంగ్ హీరోయిన్గా మారిన నభా నటేష్ తన చురుకుతనం, చలాకీ తనం అందరిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో తెరపైనే కాదు, బయట అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసింది.
సెక్సీ బ్యూటీ నభా నటేష్ తాజాగా నితిన్‌తో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్లో విజయం సాధించిన `అంధాధున్` చిత్రానికి రీమేక్. మేర్లాపాక గాంధీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నభా నటేష్ ఎంపికైంది. ఆమెతోపాటు మిల్కీ బ్యూటీ తమన్నా సైతం మరో హీరోయిన్గా ఎంపికైంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నభా ఘాటైన అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేసింది.
తాజాగా ఆమె పంచుకున్న కొత్త హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లలో హీటు పుట్టిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అందాల బొమ్మ `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్ ` చిత్రాల్లో వరుసగా సాయితేజ్‌తో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రొమాన్స్ చేస్తుంది.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజా రవితేజతో నటించిన `డిస్కోరాజా`లో నటించింది. కానీ ఈ సినిమా ఈ బ్యూటీకి షాక్ ఇచ్చింది.