MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Na Wife Missing Review: నా వైఫ్‌ మిస్సింగ్‌ మూవీ రివ్యూ.. కొత్తబంగారు లోకం జంట మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?

Na Wife Missing Review: నా వైఫ్‌ మిస్సింగ్‌ మూవీ రివ్యూ.. కొత్తబంగారు లోకం జంట మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?

Na Wife Missing Review: 18ఏళ్ల తర్వాత `కొత్త బంగారు లోకం` జంట వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ కలిసి నటించిన చిత్రం `నా వైఫ్‌ మిస్సింగ్‌`. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

4 Min read
Author : Aithagoni Raju
Published : Oct 23 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నా వైఫ్‌ మిస్సింగ్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

నా వైఫ్‌ మిస్సింగ్‌ మూవీ రివ్యూ

`కొత్తబంగారు లోకం` మూవీతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఈ జంట కలిసి నటించింది. `నా వైఫ్‌ మిస్సింగ్‌` అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలో నటించడం విశేషం. దీనికి స్వాతి ప్రకాష్‌ మంత్రి ప్రగడ దర్శకత్వం వహించారు. కథ ఉమర్జీ అనురాధ. లైట్‌ హౌజ్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై శివ కంఠమనేని నిర్మించారు. ఇది ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. గురువారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ ఓటీటీ మూవీ ఎలా ఉంది? మరోసారి వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ మ్యాజిక్‌ వెండితెరపై వర్కౌట్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా వైఫ్ మిస్సింగ్‌ కథ
Image Credit : Asianet News

నా వైఫ్ మిస్సింగ్‌ కథ

బాలు సుబ్రమణ్యం (వరుణ్ సందేశ్‌) ఓ గ్రామీణ ప్రాంతంలోని బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతడికి స్వప్న (శ్వేతా బసు ప్రసాద్‌)తో వివాహం జరుగుతుంది. పెళ్లికి ముందే స్వప్న తన గత ప్రేమ గురించి, తాను కన్యను కాదనే విషయాన్ని బాలు ముందు వెల్లడిస్తుంది. అయినప్పటికీ బాలు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. స్వప్నకు గతంలో అబాన్‌ (మోహిత్‌ పెద్దాడ)తో ప్రేమ వ్యవహారం ఉంటుంది. వయసు తేడా, వేరే మతం కారణంగా వారి ప్రేమకు స్వప్న కుటుంబం అంగీకరించదు. దీంతో ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు కొత్త సమస్యలకు దారితీస్తాయి.

పెళ్లి తర్వాత కూడా బాలు, స్వప్నల మధ్య బంధం గొప్పగా ఏం ఉండదు. కానీ అనూహ్యంగా ఆమెలో మార్పు వస్తుంది. ఆ విషయాన్ని బాలుకి చెప్పాలనుకుంటుంది. దీంతో ఇద్దరు కలిసి టెంపుల్‌కి వెళ్తారు. అనంతరం స్వప్న మిస్‌ అవుతుంది. ఆమె కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? స్వప్న బాలుకి ఏం చెప్పాలనుకుంది. ఆమెలో వచ్చిన మార్పేంటి? స్వప్న మిస్‌ అయ్యిందా? కిడ్నాప్‌ అయ్యిందా? ఈ కేసుని విచారించే ఎస్‌ఐ రవి(ప్రవీణ్‌) విచారణలో ఏం తేలింది? ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటి? ఇంతకి స్వప్న దొరికిందా లేదా? ఇందులో బ్లాక్‌ మ్యాజిక్‌కి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.

35
నా వైఫ్‌ మిస్సింగ్‌ విశ్లేషణ
Image Credit : Asianet News

నా వైఫ్‌ మిస్సింగ్‌ విశ్లేషణ

మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలకు ప్రధాన బలం కథలోని అనుమానాలు, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు, చివర్లో వచ్చే ఊహించని మలుపులు. ‘నా వైఫ్ మిస్సింగ్‌’ కూడా ఇదే ఫార్ములాలో సాగుతుంది. భార్య కనిపించకుండా పోయిన ఘటనను కేంద్రంగా తీసుకుని, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను, గత ప్రేమ వ్యవహారాన్ని, పోలీసుల దర్యాప్తును మేళవింపుగా ఈ కథ నడుస్తుంది.

ఫస్టాఫ్‌లో బాలు, స్వప్నల వైవాహిక జీవితాన్ని పరిచయం చేస్తూ వారి మధ్య ఉన్న విభేదాలను చూపించారు. స్వప్న కనిపించకుండా పోయిన తర్వాత కథలో అసలు ఉత్కంఠ మొదలవుతుంది. బాలు చెప్పే విషయాలు నిజమేనా? అతడికి తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలను ప్రేక్షకుల్లో కలిగించడంలో కొన్ని సన్నివేశాలు పనిచేస్తాయి. ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే మలుపు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

సెకండాఫ్‌లో స్వప్న ఆచూకీ కోసం జరిగే ప్రయత్నాలు, పోలీసుల విచారణ, అనుమానితుల చుట్టూ తిరిగే కథనం ఇంట్రెస్టింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠని పెంచుతుంది. అదే సమయంలో ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుండటంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా కథలోని రెండు కీలక ట్విస్టులు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే, వాటిని ప్రేక్షకులకు మరింత ప్రభావవంతంగా అందించడంలో దర్శకురాలు పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయారు.

కథలో భావోద్వేగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేది. భార్యాభర్తల మధ్య విభేదాలు, వారి మనసుల్లోని సంఘర్షణలు ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాల్సింది. కొన్ని పాత్రల ప్రవర్తనలో వచ్చే మార్పులు కూడా సహజంగా అనిపించవు. కొంత్త స్లోగా సాగుతుంది. క్లైమాక్స్‌ వేగంగా ముగియడంతో సస్పెన్స్‌ అంశాల్లోని కిక్‌ మిస్‌ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ, తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తితో సినిమాను చివరి వరకు చూడవచ్చు. 18 ఏళ్ల తర్వాత వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ కలిసి నటించడం తెరపై ఒక కనువిందు ఫీలింగ్ కలుగుతుంది. మళ్లీ అప్పటి రోజులను గుర్తు చేస్తుంది. తెరపై కూడా ఈ జంట అంతే బాగుంది.

45
నటీనటుల నటన
Image Credit : Asianet News

నటీనటుల నటన

వరుణ్ సందేశ్‌ తనకు అలవాటైన సహజమైన నటనతో బాలు పాత్రను పోషించారు. భార్యపై ప్రేమ చూపించే భర్తగా, అదే సమయంలో పోలీసుల అనుమానాల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా ఆయన నటన సందర్భానుసారంగా సాగుతుంది. తన పాత్రపై అనుమానాలు కలిగేలా కొన్ని సన్నివేశాల్లో చూపించిన హావభావాలు బాగున్నాయి.

శ్వేతా బసు ప్రసాద్‌ స్వప్న పాత్రలో విభిన్న కోణాలను చూపించే ప్రయత్నం చేశారు. ఆమె పాత్ర చుట్టూ ఉన్న రహస్యాలు కథకు అవసరమైన ఆసక్తిని అందిస్తాయి. వరుణ్‌, శ్వేతా మళ్లీ జంటగా కనిపించడం పాత అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ. అయితే, ఇద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు మరింత బలంగా ఉండాల్సింది. వీరిమధ్య బలమైన కెమిస్ట్రీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ప్రవీణ్‌ ఎస్‌ఐ రవి పాత్రలో కథకు కీలకమైన మలుపులను అందించారు. ఆయన పాత్రలోని మరో కోణం సినిమా ఉత్కంఠకు ఉపయోగపడుతుంది. పోలీస్‌ కానిస్టేబుల్‌గా సత్యశ్రీ కనిపించింది. ఆమె ఉన్నంత సేపు మెప్పించింది. హైలైట్‌ అయ్యింది. మిగిలిన పాత్రధారులు ఫర్వాలేదనిపించారు.

55
టెక్నీషియన్ల ప్రతిభ
Image Credit : Asianet News

టెక్నీషియన్ల ప్రతిభ

దర్శకురాలు స్వాతి ప్రకాష్‌ మంత్రిప్రగడ సాధారణ వైవాహిక సమస్యలకు మిస్టరీ థ్రిల్లర్‌ అంశాలను జోడించారు. నాన్‌లీనియర్‌ కథనంతో కొన్ని విషయాలను ఒకేసారి వెల్లడించకుండా ఉత్కంఠను కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే, స్క్రీన్‌ప్లేలో వేగం, భావోద్వేగాల మధ్య సమతుల్యత మరింత మెరుగ్గా ఉండాల్సింది.

సాయి కార్తీక్‌ సంగీతం, నేపథ్య సంగీతం సస్పెన్స్‌ సన్నివేశాలకు తోడ్పడ్డాయి. ఎన్‌.ఎస్‌. సతీష్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ కథకు తగినట్లుగా సాగింది. సాయిబాబు తలారి ఎడిటింగ్‌ కారణంగా సినిమా రన్‌టైమ్‌ సుమారు 99 నిమిషాలకే పరిమితమైంది. అయితే, కొన్ని సన్నివేశాలకు మరింత సమయం కేటాయించి ఉంటే కథలోని భావోద్వేగాలు బాగా పండేవి.

ఫైనల్‌ నోట్‌

‘నా వైఫ్ మిస్సింగ్‌’లో ఆసక్తికరమైన కథా పాయింట్‌, రెండు కీలక మలుపులు, వరుణ్ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ నటన ప్రధాన బలాలు. అంచనాలు లేకుండా ఓటీటీలో ఒక మోస్తరు మిస్టరీ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

రేటింగ్‌ : 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Simbu Marriage Prediction: శింబు పెళ్లిపై జ్యోతిష్యురాలు సంచలన కామెంట్స్.. అభిమానుల్లో ఆందోళన
Recommended image2
Fauzi Teaser: ప్రభాస్ వింటేజ్ లుక్ అదిరింది.. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్పైగా డార్లింగ్!
Recommended image3
Garividi Lakshmi 7 Days Collections: గరివిడి లక్ష్మి మూవీకి హిట్‌ టాక్‌, కలెక్షన్లు మాత్రం రివర్స్.. కారణం ఇదే
Related Stories
Recommended image1
Haiku Movie Review: హైకూ మూవీ రివ్యూ.. ఉమెన్స్ కాలేజీలో ఒక్కడే కుర్రాడు, సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Top 10 Heroes: దుమ్మురేపిన అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి మళ్లీ దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved