MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా ఫ్యామిలీ అంతా దూరం పెట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నాం.. షాకింగ్‌ విషయాలు చెప్పిన నటి యమున..

మా ఫ్యామిలీ అంతా దూరం పెట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నాం.. షాకింగ్‌ విషయాలు చెప్పిన నటి యమున..

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆ తర్వాత సీరియల్స్ వైపు టర్న్ తీసుకుని ఫుల్‌ బిజీగా రాణించింది నటి యమున. ఆ మధ్య పలు వివాదాల్లో సంచలనంగా మారింది. తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేసింది. 
 

Aithagoni Raju | Published : Nov 20 2023, 11:41 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

నటి యమున ప్రారంభంలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌ నుంచి ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారింది. సీరియల్స్ తో పాపులర్‌ అయ్యింది. ప్రముఖ సీరియల్స్ లో భాగమవుతూ మెప్పించింది. అయితే చాలా రోజుల క్రితం ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. ఓ వ్యభిచార కేసులో ఆమె పట్టుబడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే దీనిపై ఆమె న్యాయ పోరాటం చేసి గెలిచింది. తన తప్పు ఏం లేదని నిరూపితమయ్యింది.కోర్ట్ నుంచి క్లీన్‌ చీట్‌ వచ్చింది. 
 

25
Asianet Image

కానీ దానికి సంబంధించిన వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియా,యూట్యూబ్‌లో ఆమె గతాన్ని ప్రస్తావిస్తూ వార్తలు ప్రసారం చేయడం జరిగింది. దీనిపై ఆ మధ్య సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది నటి యమున. తమని చచ్చేంత వరకు వదిలేలా లేరంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. దీంతో ఓ రకంగా ఆ వార్తలకు ఫుల్‌ స్టాప్‌పడినట్టయింది. కానీ ఇప్పుడు మరోసారి వాటిని తెరపైకి తీసుకొచ్చింది యమున. 
 

35
Asianet Image

నటి యమున ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగాఉంది. అందులో భాగంగా ప్రస్తుతం `మౌనపోరాటం` అనే సీరియల్‌లో ఆమె నటిస్తుంది. ఈ సీరియల్‌ టీమ్‌ సుమ యాంకర్‌గా చేస్తే `సుమ అడ్డా`షోకి వచ్చారు. ఇందులో నవ్వులు పూయించారు. కానీ చివరికి తన లైఫ్‌లోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. సుమ ముందు తన గోడు వెల్లబోసుకుంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. అప్పుడు ఏం జరిగిందో తెలిపింది. ఆ ఘటనతో తన ఫ్యామిలీ చోటు చేసుకున్న సంఘటనలను, తర్వాత పరిణామాలను ఆమె వెల్లడించింది. 
 

45
Asianet Image

ఇందులో యమున చెబుతూ, సోషల్‌ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల తన ఫ్యామిలీ చాలా మంది తమని దూరం పెట్టారని వాపోయింది. అంతేకాదు తాము ఇలాంటి వార్తల నేపథ్యంలో, ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నామని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది నటి యమున. ఆమె ఈ సందర్భంగా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. అది వింటూ యాంకర్‌ సుమతోపాటు మిగిలిన సీరియల్‌ ఆర్టిస్టులు, ఆడియెన్స్ సైతం షాక్‌కి గురి కావడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. 
 

55
Asianet Image

ఇదిలా ఉంటే తనపై సోషల్‌ మీడియాలో థంబ్‌ నెయిల్‌ పెట్టి తప్పుగా చిత్రీకరిస్తూ వీడియోలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో యమున ఆ మధ్య రియాక్ట్ అయ్యింది.  ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ, `న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ ఇప్ప‌టికీ కొంద‌రు సోష‌ల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెడుతున్నారు. అవి బాధ‌ను క‌లిగిస్తున్నాయి. నాకు నేనుగా మోటివేట్ చేసుకుందామ‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ కుద‌ర‌టం లేదు. ఎందుకంటే నేనూ మ‌నిషినే. అయితే వీళ్లు మాత్రం నేను చ‌చ్చిపోయినా వ‌దిలేలా లేరు. అప్పుడు కూడా థంబ్‌ నెయిల్స్ పెట్టుకుని డ‌బ్బులు సంపాదిస్తారేమో. నా గురించి ఇండస్ట్రీలో నా మిత్రులంద‌రికీ నేనేంటో తెలుసు. దాంతో వాళ్లు విష‌యాన్ని అర్థం చేసుకున్నారు. కానీ సోష‌ల్ మీడియా వాళ్లు మాత్రం వ‌ద‌ల‌టం లేదు. నా అభిమానుల‌కు, స‌న్నిహితులు అర్థం చేసుకోవాల‌ని కోరుతున్నా` ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories