- Home
- Entertainment
- కీరవాణి, సునీత లని ఇంత అసభ్యకరంగా తిడతారా.. దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి కౌంటర్
కీరవాణి, సునీత లని ఇంత అసభ్యకరంగా తిడతారా.. దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి కౌంటర్
ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ కీరవాణిపై అసభ్యకర ఆరోపణలతో రెచ్చిపోయారు. కీరవాణి లాంటి దిగ్గజ సంగీత దర్శకుడిపై ఆరోపణలు చేస్తుండడంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటి రంగంలోకి దిగారు.

Keeravani
పాడుతా తీయగా షో వ్యవహారంలో గాయని ప్రవస్తి చేసిన ఆరోపణల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సునీత, కీరవాణి, చంద్రబోస్ తనని కావాలనే ఎలిమినేట్ చేశారని ప్రవస్తి ఆరోపించింది. పాడుతా తీయగా షో వెనుక జరుగుతున్న రాజకీయాలు, వేధింపులని కూడా ప్రవస్తి బయటపెట్టింది. దీనితో పాడుతా తీయగా షో గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
Sunitha
సింగర్ సునీత, జ్ఞాపిక సంస్థ నిర్మాత కూడా స్పందించి ప్రవస్తికి కౌంటర్ ఇచ్చారు. ప్రవస్తి ఆరోపణల తర్వాత కొందరు కీరవాణి, సునీత లని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ అయితే కీరవాణిపై అసభ్యకర ఆరోపణలతో రెచ్చిపోయారు. కీరవాణి వ్యభిచారి అని అతడిపై పోక్సో కేసు పెట్టాలని గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.
Singer Sunitha, Pravasthi
కీరవాణి లాంటి దిగ్గజ సంగీత దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుండడంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటి రంగంలోకి దిగారు. గీతా కృష్ణకి కౌంటర్ ఇచ్చారు. గీతా కృష్ణ గారు ఒకప్పుడు మీరు చాలా మంచి డైరెక్టర్. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీలో మీకు మంచి పేరు ఉంది. కె విశ్వనాథ్ గారి దగ్గర మీరు శిష్యరికం చేశారు. కానీ ఈ మధ్య మీరు చేస్తున్న కామెంట్స్ కాస్త పరిధి దాటుతున్నాయి.
కీరవాణి, సునీత, చంద్రబోస్ గురించి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లంతా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. ఇక్కడ ఏదో తప్పు జరిగిపోలేదు. కానీ మీరు పర్సనల్ గా అటాక్ చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. దయచేసి ఇలా హద్దులు దాటి పర్సనల్ గా మాట్లాడొద్దు అని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు.
singer pravasthi aradhya
ప్రతి కార్యక్రమంలో చిన్న లోటుపాట్లు ఉంటాయి. అవన్నీ అధికమించి ఇన్నేళ్ళుగా ఆ షో చక్కగా జరుగుతోంది. దీనిని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. కీరవాణి ఎన్ని కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చారో తెలుసా.. సునీత ఎంతలా కష్టపడిందో నాకు తెలుసు. వాళ్ళ గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడొద్దు. వాళ్ళ గురించి మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది అని కోటి అన్నారు.