- Home
- Entertainment
- Krishna Mukunda Murari: భయంతో స్పృహ తప్పిన కృష్ణ.. నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మురారి!
Krishna Mukunda Murari: భయంతో స్పృహ తప్పిన కృష్ణ.. నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మురారి!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. కుటుంబ గౌరవం కోసం కూతురు ప్రాణాన్ని ఫణంగా పెట్టిన ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ఎపిసోడ్ ప్రారంభంలో ముకుంద చెప్పింది అంతా విని నా కొడుకుని నామీద ప్రయోగించాలని చూస్తుందా అంటూ కోపంగా మాట్లాడుతుంది భవాని. మళ్లీ ముకుంద ఎక్కడ వింటుందో అని నేను నీతో తర్వాత మాట్లాడుతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. నేను వినకూడదా అంటుంది ముకుంద. ఈశ్వర్ కూడా ముకుంద మన మనిషే ఉండనివ్వండి అంటాడు.కృష్ణ నందిని గురించి చెప్పడానికే మురారి ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉంటుంది. నందిని హెల్త్ అప్సెట్ అవడం అంతా మురారి ట్రైనింగ్ లో ఉండగా జరిగింది వాడికి ఏమీ తెలియదు ఇప్పుడు ఈ కృష్ణ వచ్చి అంతా గంగలో కలపాలని చూస్తుంది అంటుంది భవాని.
ఎందుకు కృష్ణకి అంత భయపడుతున్నారు అంటూ అయోమయంలో పడుతుంది ముకుంద. ఏం జరిగినప్పటికీ పరిస్థితిని ఎదుర్కోవటానికి మనం అందరినీ సిద్ధంగా ఉండాలి. నా కొడుకు దృష్టిలో నేను దోషిగా మిగిలిపోవటానికి సిద్ధంగా లేను అంటుంది భవాని. మరోవైపు గెస్ట్ హౌస్ ని చూసిన కృష్ణ చాలా బాగుంది అంటూ ఆనందపడుతుంది. నేను సెలవు పెట్టాను కదా ఇక్కడే ఉండి పోదామా అంటాడు మురారి. మనకి వేరే పనులు ఏమీ ఉండవా అంటుంది కృష్ణ. శ్రీరామనానికి స్టాఫ్ అందరు ఊరు వెళ్ళారని నేనొక్కడినే ఉన్నాను అని అక్కడ ఉన్న వ్యక్తి చెప్తాడు.
నేను టీ పెడతాను అని మురారి అంటే అతన్ని వేళాకోళం ఆడుతుంది కృష్ణ. మరి డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు అని మురారి అంటే మీ ఆవేశాన్ని నేనెందుకు కాదనాలి వెళ్లి పెట్టండి అంటుంది కృష్ణ. మురారి అటు వెళ్ళగానే గౌతమ్ సర్ గురించి చెప్పటానికి ఇదే మంచి టైం ఎలా అయినా ఏసీపి సర్ కి చెప్పాలి అనుకుంటుంది కృష్ణ. మరోవైపు మీరు చెప్పినట్లే చేశాము అన్ని అనుకున్నట్లే అవుతాయి మీరు రిలాక్స్ అవ్వండి అని భవానితో చెప్తారు ఈశ్వర్, ప్రసాద్. మరోవైపు టీ తాగుతున్న కృష్ణ ఏదో సౌండ్ విని భయపడుతుంది.
నేను చూస్తాను అంటూ వెళ్లిన మురారి ఆ సౌండ్ పిల్లి రావటం వల్ల అని గమనిస్తాడు. ఈ సౌండ్ కి ఇంత భయపడింది అనుకుంటూ ఆమెని ఏడిపించడానికి ఏవో సెట్టింగ్లు చేస్తాడు. ముందు ఇక్కడ ఒక బైరాగి ఉండేవాడు ఆ గదిలోనే చచ్చిపోయాడు ఇప్పుడు దయమైనట్టున్నాడు అంటూ కృష్ణ ని భయపెడతాడు. భయంతో మురారిని పట్టుకుంటుంది కృష్ణ. ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాడు మురారి. దెయ్యం పట్టినట్లుగా నటిస్తాడు మురారి. నిజంగానే అనుకొని భయంతో స్పృహ తప్పి పడిపోతుంది కృష్ణ. మొహం మీద నీళ్లు చిలకరించి లేపుతాడు మురారి. ఏం జరిగింది అంటుంది కృష్ణ.
బాగా నిద్రపోయి ఏవేవో కలవరిస్తున్నావు నేను టీ తెచ్చేటప్పటికే పడుకున్నావు అందుకే నేను కూడా టీ తాగకుండా వెయిట్ చేస్తున్నాను అంటాడు మురారి. ఇదంతా భ్రమ అనుకుంటుంది కృష్ణ. ఏదో ఆట పట్టిద్దామనుకున్నాను కానీ ఇలా అయింది సారీ అని మనసులోనే అనుకుంటాడు మురారి. మళ్లీ తనే నాతో ఏదో చెప్తానన్నావు ఏంటది అని కృష్ణని అడుగుతాడు.మీరు నాకు ఇద్దరు మేజర్ లకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు అని ప్రశ్న ఏదో మాట్లాడుతూ ఉండగా భవాని ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు కృష్ణ కూడా నీతోనే ఉందా అంటూ ఆరాతీస్తుంది.
అర్జంటుగా నువ్వు ఒక్కడివే రా అంటూ ఫోన్ పెట్టేస్తుంది భవాని. మురారి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణ అంత అర్జెంటు ఏంటో అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. మరోవైపు భవాని ఇంటికి పెళ్ళివారు వస్తారు. కుశల ప్రశ్నలు అయిన తరువాత మా అమ్మాయి గురించి మీకు ఈశ్వర్ పూర్తిగా చెప్పాడు కదా అంటుంది భవాని. తెలుసు, అన్ని తెలుసుకునే పెళ్లికి ఒప్పుకున్నాను అంటాడు పెళ్లి కొడుకు. ఎందుకు ఇంత అర్జెంటుగా ఈ పెళ్లిచూపులు అసలు ఏం జరుగుతుంది అంటూ కన్ఫ్యూజ్ అవుతుంది ముకుంద. ఇంతలోనే మురారి కూడా వస్తాడు. అక్కడ జరుగుతున్న పెళ్లిచూపుల్ని,ముకుందని అందర్నీ కన్ఫ్యూజ్డ్ గా చూస్తాడు మురారి.
నీకేమీ అర్థం కావటం లేదు కదా మన నందు గురించి అన్ని తెలుసుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఈ అబ్బాయి అంటుంది భవాని. నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని నా కోరిక అంటుంది భవాని. నేను అబ్బాయి అభిప్రాయం విడిగా కనుక్కోవాలి అనుకుంటున్నాను అంటాడు మురారి. అందుకు పెళ్లి కొడుకు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వేరే గదిలోకి వెళ్తారు.అబ్బాయి చదువు గురించి కనుక్కున్నాక మా నందిని కి మతిస్థిమితం లేదని తెలిసి కూడా ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు.
ఎవరైనా ఫోర్స్ చేసి ఒప్పించారా అని అడుగుతాడు మురారి. తరువాయి భాగంలో బయటికి వెళ్తున్న మురారిని ఆపి నీవల్ల అవుతుందా అవ్వదా చెప్పుఅని నిలదీస్తుంది భవాని. కృష్ణకి చిన్న పని ఉందంట అది అయిపోయాక వచ్చేస్తాను అంటూ కృష్ణ ని తీసుకుని బయటికి వస్తాడు మురారి. బయటికి వచ్చిన తరువాత మీ పెద్దమ్మ ఎందుకు అంత అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నారు అని భర్తని అడుగుతుంది కృష్ణ.