- Home
- Entertainment
- 75 ఏళ్ల నాటి ప్రేమ కథ, 10 ఏళ్ల బంధం, ఆ స్టార్ హీరో హీరోయిన్ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
75 ఏళ్ల నాటి ప్రేమ కథ, 10 ఏళ్ల బంధం, ఆ స్టార్ హీరో హీరోయిన్ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
ఆ కాలంలో స్టార్ హీరో, హీరోయిన్ గా వెలుగు వెలిగిన తారలు ప్రేమలో పడ్డారు. దాాదాపు 10 ఏళ్ళు ప్రేమించుకున్న ఈ స్టార్స్.. సడెన్ గా విడిపోయారు. దానికి కారణం ఎవరు. ? ఇన్నేళ్ళ తరువాత బయటపడ్డ నిజం ఏంటి?

అలనాటి తార, సీనియర్ నటి ముంతాజ్ తన సన్నిహిత స్నేహితురాలు దివంగత స్టార్ హీరోయని్ మధుబాల, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సంబంధం గురించి పెద్ద రహస్యం బయటపెట్టారు. వారి ప్రేమ వ్యవహారం గురించి అసలేు నిజాలు ఆమె వెల్లడించారు.
మధుబాల గురించి ముంతాజ్ వెల్లడి
విక్కీ లాల్వానీతో ఇంటర్వ్యూలో ముంతాజ్ తన మరణించిన స్నేహితురాలు మధుబాల గురించి పెద్ద రహస్యం బయటపెట్టారు.
మధుబాల పెళ్లి రహస్యం
మధుబాల ఒకసారి దిలీప్ కుమార్‌తో తన సంబంధం గురించి ముంతాజ్‌తో మాట్లాడుతూ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని చెప్పారని ముంతాజ్ అన్నారు.
దశాబ్దపు ప్రేమ విఫలం
మధుబాల, దిలీప్ మధ్య ప్రేమ దాదాపు 10 ఏళ్ళు నడిచింది. ఇంతలా ఘాడంగా ప్రేమించుకున్న వీరు ఎందుకు విడిపోయారు. ఆతరువాత వారి ప్రనేమకు బ్రేక్ పడటానికి కారణం ఏంటి?
చోప్రా కేసు ప్రభావం
మధుబాల చెల్లెలు మధుర్ భూషణ్ గత ఇంటర్వ్యూలో, మధుబాల దర్శకుడు బి.ఆర్. చోప్రాపై కోర్టు కేసు వేయకపోతే, తన అక్క, దిలీప్ పెళ్లి చేసుకునేవారని, దీని వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగిందని చెప్పారు.
పిల్లలు కలిగించుకోలేకపోవడమే కారణం
విక్కీ లాల్వానీ షోలో ముంతాజ్ మాట్లాడుతూ, మధుబాల దిలీప్ కుమార్‌ను ప్రేమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని వీరు విడిపోవడానికి కారణం బి.ఆర్. చోప్రా కాదని అన్నారు. దిలీప్‌కు పిల్లలు కావాలని, మధుబాలకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. దాంతో చాలా సంఘర్షణ తరువాత దిలీప్ ఆమెతో సంబంధం తెంచుకున్నారని, ఈ విషయం మధుబాలే తనకు చెప్పారని వెల్లడించారు.
మధుబాల గుండె జబ్బు
ముంతాజ్ ఇలా అన్నారు: "ఆమె ఆయనతో విడిపోలేదు, కానీ ఆమె పిల్లల్ని కనలేకపోయింది. డాక్టర్లు ఇంతకు ముందే మధుబాల గుండె బలహీనంగా ఉందని చెప్పారు. ఆమె ప్రసవ వేదనను భరించలేదు. ఆమె గుండె ఆగిపోవచ్చు. అని వెల్లడించారు.
దిలీప్ కుమార్ పిల్లల కోరికతో మధుబాలను విడిచిపెట్టి సైరా బానును పెళ్లి చేసుకున్నారు... ఈ జంట చివరి వరకు కలిసి ఉన్నారు. సైరా, దిలీప్ సాబ్ ప్రేమ చివరి వరకు అలా నిలిచి ఉంది అన్నారు.
దిలీప్ కుమార్, మధుబాల మొదటిసారి 1951లో విడుదలైన "తరానా" సినిమా సెట్‌లో కలుసుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం తర్వాత ప్రేమగా మారింది.