క్రిస్టమస్ కి బాక్సాఫీస్ యుద్ధమే.. షారుఖ్, వెంకీకి పోటీగా నితిన్, నాని, సుధీర్ బాబు..ఆ చిత్రాల లిస్ట్ ఇదే
సంక్రాంతికి వరుస చిత్రాలతో థియేటర్లు కిటకిటలాడడం సహజమే. కానీ అంతకంటే ముందుగా వచ్చే క్రిస్టమస్ కి కూడా ఈ సారి బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. కింగ్ ఖాన్ షారుఖ్, విక్టరీ వెంకటేష్ ల చిత్రాలు ఇప్పటికే క్రిస్టమస్ బెర్తు ఫిక్స్ చేసుకున్నాయి.
సంక్రాంతికి వరుస చిత్రాలతో థియేటర్లు కిటకిటలాడడం సహజమే. కానీ అంతకంటే ముందుగా వచ్చే క్రిస్టమస్ కి కూడా ఈ సారి బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. కింగ్ ఖాన్ షారుఖ్, విక్టరీ వెంకటేష్ ల చిత్రాలు ఇప్పటికే క్రిస్టమస్ బెర్తు ఫిక్స్ చేసుకున్నాయి. వీరితో పోటీ పడేందుకు నేచురల్ స్టార్ నాని, నితిన్, సుధీర్ బాబు కూడా సిద్ధం అవుతున్నారు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్, హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్న'. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్. ఎమోషనల్ డ్రామాగా తెరక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
లేటెస్ట్ గా క్రిస్టమస్ రేసులోకి వచ్చిన మరో హీరో నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ఎక్స్ట్రా- ఆర్డినరీ మ్యాన్ అనే చిత్ర ఫస్ట్ లుక్ సండే రోజు రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
అలాగే వీరందరితో పాటు క్రిస్టమస్ రేసులో ఉన్న మరో హీరో సుధీర్ బాబు. సుధీర్ బాబు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'హరోం హర'. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.
క్రిస్టమస్ కి బాక్సాఫీస్ వద్ద పేలనున్న పెద్ద బాంబ్ 'డుంకి' కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22నే బాక్సాఫీస్ దండయాత్రకి రెడీ అవుతోంది. క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పఠాన్ తర్వాత షారుఖ్ పూర్వవైభవాన్ని పొందాడు. సో తెలుగులో కూడా షారుఖ్ ప్రభావం గట్టిగా ఉండబోతోంది.