- Home
- Entertainment
- Krishna Mukunda Murari: తండ్రిని ఆ కోరిక కోరిన ముకుంద.. అసలు విషయం తెలుసుకున్న మురారి?
Krishna Mukunda Murari: తండ్రిని ఆ కోరిక కోరిన ముకుంద.. అసలు విషయం తెలుసుకున్న మురారి?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి అవ్వడంతో ఆ వ్యక్తిని మరిచిపోలేక అవస్థ పడుతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తండ్రికి ఫోన్ చేసి నేను ఈ నరకంలో ఉండలేకపోతున్నాను కళ్ళ ముందే ప్రేమించిన వ్యక్తి తన భార్యతో కలిసి తిరుగుతుంటే ఎంత నరకం తెలుసా నాన్న అంటూ బాధపడుతుంది ముకుంద. ఆ నరకంలో ఉండవలసిన అవసరం నీకు లేదు మీ పెద్దత్త ఏదో మాట్లాడు నేను నిన్ను తీసుకొని వచ్చేస్తాను అంటాడు శ్రీనివాస్.
వద్దు నాన్న మురారి, కృష్ణ ని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు నేను ఇక్కడ లేకపోతే కృష్ణకి మరింత దగ్గరవుతాడు అంటుంది ముకుంద. మరి ఏం చేద్దాం అని నీ ఉద్దేశం అంటాడు శ్రీనివాస్. నేను చేయవలసిన పని చేశాను ఇప్పుడే చేయవలసింది నువ్వే అంటుంది ముకుంద. నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం అంటాడు శ్రీనివాస్.
నువ్వు మురారితో మాట్లాడు నాన్న కృష్ణ వెళ్లిపోయిన తర్వాత మురారిని నాతో పెళ్లికి ఒప్పించు అని అడుగుతుంది ముకుంద. ఏం మొహం పెట్టుకొని అడగమంటావు ఇది న్యాయం కాదు అంటాడు శ్రీనివాస్. అయితే నా కర్మానికి నన్ను వదిలేయ్ అంటూ చిరాగ్గా ఫోన్ పెట్టేస్తుంది ముకుంద. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర కృష్ణ మురారి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
టైం అయింది అని కృష్ణ వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన శ్రీనివాస్ మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ముకుంద చెప్పింది కానీ మీ ఇద్దరిని చూస్తే అలా అనిపించడం లేదు నాలుగు రోజుల్లో వెళ్ళిపోయే అమ్మాయి మీద అంత ప్రేమ అవసరమా అంటాడు శ్రీనివాస్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు మురారి.
కృష్ణ వెళ్లిపోయిన తర్వాత నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని నా కూతురు ఎదురుచూస్తుంది ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటి అని అడుగుతాడు శ్రీనివాస్. అది మీరు మీ కూతురు మా పెద్దమ్మ కలిసి కూర్చొని ఆలోచించండి దానికి నేనేం చేస్తాను అంటాడు మురారి. మరి నా కూతుర్ని ఆదర్శ్ కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేసావు అంటాడు శ్రీనివాస్.
పెళ్లి చేసింది మీరు.. సమయానికి నేను వచ్చాను కాబట్టి ఆదర్స్ ఏమైపోతాడో పరువు ఏమైపోతుందో అని ముకుందని ఒప్పించాను లేకపోతే దోషి మీరే అయ్యేవారు అయినా పరాయి వ్యక్తి భార్యని పెళ్లి చేసుకుంటాను అని మీరు ఎలా అనుకున్నారు. అయినా ముకుంద ఇప్పుడు ఒక ఉన్మాద స్థితిలో ఉంది కనిపెట్టే టార్చర్ ని రోజు అనుభవిస్తున్నాను.
అందరూ తనని అసహ్యించుకుంటారని ఏమి మాట్లాడటం లేదు. మీకైనా ఇలా అడగటానికి మనసు ఎలా వచ్చింది నావల్ల నా భార్య తండ్రి చనిపోయాడు తనని వదిలేస్తానని ఎలా అనుకున్నారు అంటూ నిలదీస్తాడు మురారి. నాకు వేరే దారి లేకపోయింది నా బిడ్డ గురించి నిన్ను నిలదీద్దామని వచ్చాను కానీ పరాయి వ్యక్తి భార్య మీద నువ్వు చూపించే గౌరవానికి ముగ్గుడిని అవుతున్నాను.
నా బిడ్డకి తండ్రిగా ఆలోచించాను కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యమనేటంత మూర్ఖుడిని కాదు అంటాడు శ్రీనివాస్. ఒక పెద్ద మనిషిగా నిన్ను ఒక కోరిక కోరుతాను దయచేసి తీర్చు ముకుంద కి నీ మీద విరక్తి కలిగేలాగా చేయు, తనే విసిగిపోయి పుట్టింటికి వచ్చేస్తే తలకి వేరే పెళ్లి చేస్తాను అంటూ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాడు శ్రీనివాస్. ఆలోచనలో పడిపోతాడు మురారి. మరోవైపు మురారి ధ్యాసలో ఉన్న కృష్ణకి పేషంట్లందరూ మురారి లాగానే కనిపిస్తూ ఉంటారు.
మరోవైపు తాగి పడుకున్న ప్రసాద్, మధులను లేపుతుంది ప్రసాద్ భార్య. ఎంతకీ లేవకపోవడంతో మందు వాసన చూపించి నిద్ర లేపుతుంది. లేస్తూనే మందు కావాలని అంటారు తండ్రి కొడుకులు. మిమ్మల్ని రేవతి అక్కయ్య ఇలా చూసిందంటే పెద్దక్కకి ఫోన్ చేస్తుంది అని బెదిరించడంతో బుద్ధిగా ఫ్రెష్ అప్ అవటానికి వెళ్తారు తండ్రి కొడుకులు. మరోవైపు శ్రీనివాస్ అన్న మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు మురారి. ఎలా అయినా ముకుంద కి నా మీద విరక్తి కలిగేలాగా చేయాలి అనుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.