- Home
- Entertainment
- Krishna Mukunda Murari: భర్తకు మాటిచ్చిన కృష్ణ.. తనలో ఉన్న ప్రేమ బయట పెట్టాలనుకుంటున్న మురారి?
Krishna Mukunda Murari: భర్తకు మాటిచ్చిన కృష్ణ.. తనలో ఉన్న ప్రేమ బయట పెట్టాలనుకుంటున్న మురారి?
Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్తని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటుంది ముకుంద. పాత్ర కాదు నువ్వు మారిపోయావు అంటుంది. నాకు భయం బాధ వస్తున్నాయి అంటుంది ముకుంద. ఎందుకు అంటుంది ఆమె మనసు. మురారి నన్ను దూరం పెడుతున్నాడు అందుకు బాధపడుతున్నాను కృష్ణకి దగ్గర అవుతున్నాడు అందుకే భయంగా ఉంది అంటుంది ముకుంద.
ప్రకృతిలో పుట్టిన ప్రతిదీ పరమపదిస్తుంది కానీ అజరామరమై నిలిచేది ప్రేమ మాత్రమే. నువ్వు మురారిని అందంతో ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు కానీ మనసుతో ఆకట్టుకోవాలని చూడు నీ కళ్ళ ముందు బృందావనం కనిపిస్తుంది. ఇప్పటివరకు పోరాడి అలసిపోయిన నీ మనసు మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని చూసి సేద తీరుతుంది అంటుంది మనసు.
ఆ మాటలు విన్న ముకుంద ఇన్నాళ్లు స్వార్థంతో ఆలోచించాను ఇన్ని రోజులు ప్రేమని హక్కుగా భావించాను. ఇకనుంచి నా చర్యలు నా ఆత్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే విధంగా ఉంటాయి అనుకుంటుంది ముకుంద. మురారితో సంతోషంగా గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటుంది ముకుంద. మన త్యాగం మన ప్రేమని ఒక చట్రంలో బంధించేసింది.
మనమిద్దరం ఆ చట్రం నుంచి బయటపడాలి అనుకుంటుంది. మరోవైపు దిగులుగా కూర్చున్న రేవతి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అలా ఉన్నారు ఎందుకు పని అడుగుతుంది కృష్ణ. నా దురదృష్టానికి బాధపడుతున్నాను అంటుంది రేవతి. మీరు దురదృష్టవంతులు ఏంటి చెట్టంత పడుకున్నాడు అంటుంది కృష్ణ. అయితే మాత్రం ఏం లాభం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అపరిచితుల్లాగా ఉండవలసి వస్తుంది.
అసలే రేపు వాడి బర్త్డే ఎలా విషెస్ చెప్పాలో అర్థం కావటం లేదు అంటుంది రేవతి. రేపు ఆయన బర్త్డే నా నాకు చెప్పనేలేదు మీకెందుకు దిగులు నేనున్నాను కదా అన్ని నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతుంది కృష్ణ. నాకు రేపు మీ బర్త్ డే అని చెప్పరా ఉండండి మీ పని చెప్తాను అంటూ డాబా మీదకి వెళ్తుంది. ఎవరి బాధ వారిది సరిపోయింది అనుకుంటుంది రేవతి.
మరోవైపు డాబా మీదకి వస్తూనే భర్త మీద చిటపటలాడుతుంది కృష్ణ. కిందకి వెళ్లి వచ్చేసరికి ఇంత రెబల్గా తయారయ్యావేంటి అంటాడు మురారి. అలాంటిదేమీ లేదు నా దగ్గర ఒక నిజం రాయబడింది అదేంటో చెప్పండి అంటుంది కృష్ణ. ఏమో ఎవరికి తెలుసు అంటాడు మురారి. రేపు ఏంటి అని అడుగుతుంది కృష్ణ. రేపు మంగళవారం వర్కింగ్ డే అంటూ తెలివిగా తప్పించుకుంటాడు మురారి.
నీ నోటి నుంచి వినాలని ఆశ పడుతున్నాను మీరు చాలా తెలివైన వారు కావాలనే ఏడిపిస్తున్నారు అంటుంది కృష్ణ. ఏడిపించడం కాదు కావాలనే మాట దాట వేస్తున్నాను. నా బర్త్ డే అని తెలిస్తే నువ్వు హడావుడి చేస్తావు అది మా పెద్దమ్మకు నచ్చదు అంటాడు మురారి. ఈ టైంలో మీ బర్త్డే రావడం మీ అదృష్టం. మీ ఇద్దరి మధ్య అలకలే తప్పించి అపార్ధాలు లేవని నేను నిరూపిస్తాను అంటుంది కృష్ణ.
మీలాంటి మంచి మనిషికి జీవితంలో సంతోషం తప్పితే విచారం లేకుండా చేస్తాను ఈస్ మై ప్రామిస్ అంటూ చేతిలో చేయి వేస్తుంది కృష్ణ. మరోవైపు తన పరిస్థితికి తానే జాలి పడుతుంది ముకుంద బర్త్డే గిఫ్ట్ ఇవ్వటానికి కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది సమాజపు విలువల్ని దాటుకొని నైతిక విలువలని జయిస్తేనే మనసుకి నచ్చినది దొరుకుతుంది. కళ్ళ ముందే మనసైనవాడు ఉండి కూడా ఎలాంటి ప్రేమకి నోచుకోలేకపోతున్నాను.
ఎలా అయినా సరే ఈ గిఫ్ట్ మురారికి ఇచ్చి మా ప్రేమ బంధాన్ని ఒక మెట్టు పైకెక్కిస్తాను అనుకుంటూ మురారి దగ్గరికి బయలుదేరుతుంది ముకుంద. మరోవైపు భర్తతో ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటుంది కృష్ణ. పెద్ద పోలీసు ఆఫీసర్ అయినప్పటికీ కొంచెం కూడా తల పొగరు ఉండదు అనుకుంటుంది. త్రేత యుగంలో శ్రీరాముడు గురించి రామాయణంలో చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా దేవుడు లాంటి మనిషిని చూస్తున్నాను.
నాకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డారు అలాంటి మనిషికి పుట్టినరోజు కానుకగా ఏమివ్వాలి అనుకుంటుంది కృష్ణ. తరువాయి భాగంలో రేపు నా పుట్టినరోజు కదా నా లవ్ కృష్ణ కి తెలియజేస్తాను అనుకుంటాడు మురారి. అప్పుడే ముకుందా వచ్చి అడ్వాన్స్ విషెస్ చెప్పి రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేస్తాను అంటుంది. కృష్ణ కూడా అదే మాట చెప్తుంది.