- Home
- Entertainment
- Krishna Mukunda Murari: కూతురి మాటలకు శ్రీనివాస్ ఫ్యుజులు అవుట్.. ముకుంద వ్యవహారం ఇంట్లో తెలిసిపోతుందా?
Krishna Mukunda Murari: కూతురి మాటలకు శ్రీనివాస్ ఫ్యుజులు అవుట్.. ముకుంద వ్యవహారం ఇంట్లో తెలిసిపోతుందా?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. అనుకోకుండా విడిపోయిన ఇద్దరి ప్రేమికుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తనని ఆట పట్టిస్తున్న కృష్ణని చిన్నగా మందలిస్తాడు మురారి. ఇంట్లో ఉన్న పరిస్థితులకి నువ్వు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అంటాడు. ఇంట్లో పరిస్థితులకి మనం కారణం కాదు కదా మనం ఎందుకు మన మనసులు పాడు చేసుకోవాలి అంటుంది కృష్ణ. ముకుంద వాళ్ళ నాన్నగారు అలా వచ్చి మాట్లాడటం తప్పు కదా అంటాడు మురారి.
ఆదర్శ్ తప్పకుండా వస్తాడు అంటాడు మురారి. ఏ నమ్మకంతో చెబుతున్నారు ఒక్క అవకాశం కూడా కనిపించడం లేదు నాకు తెలిసి ఆదర్శ్ ని వెతకడం కూడా మానేసి ఉంటారు అందుకే ముకుందకి ఇంకొక పెళ్లి చేయటమే కరెక్ట్ అంటుంది కృష్ణ. పిచ్చి కృష్ణ తన మనసులో ఉన్న ఆలోచన నీకు తెలియదు నువ్వు వెళ్ళిపోతే నన్ను చేసుకోవటానికి చూస్తుంది అందుకే తనను ఈ ఇంట్లో ఉంటుంది అనుకుంటాడు మురారి.
ఇంతలో ఇద్దరికీ ఆఫీసులకి వెళ్ళటానికి టైం అయిపోతుంది అని గుర్తించి కంగారు పడతారు. కృష్ణని మాయ చేసి బాత్రూంలో దూరిపోతాడు మురారి. కృష్ణ బుంగమూతి పెట్టుకుంటుంది. మరోవైపు తన ఇంట్లో వున్న కూతుర్ని చూసి ఆశ్చర్యపోతాడు శ్రీనివాస్. ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. నీ కన్నా ముందే వచ్చాను అమ్మేది అని అడుగుతుంది ముకుంద.
పుట్టింటికి వెళ్ళింది అంటాడు శ్రీనివాస్. అలా అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లడం గౌరవమా నిత్యము పుట్టింట్లో ఉండిపోవటం గౌరవమా అని తండ్రిని నిలదీస్తుంది ముకుంద. అక్కడ మాట్లాడకుండా అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు తప్పంతా నామీదకి తోసేస్తున్నావా అంటాడు శ్రీనివాస్. నిజంగా తప్పంతా నీదే మురారిని ప్రేమిస్తున్నానని మీకు తెలియదా అయినా మెడలు వంచి ఆదర్శ పెళ్లి చేశారు.
ఇప్పుడు విడాకులు ఇప్పించి మరొక వ్యక్తితో పెళ్లి చేస్తానంటున్నారు అప్పుడు నా జీవితంలో ముగ్గురు మగవాళ్ళు ఉంటారు ఇంతకంటే చండాలం ఇంకేమైనా ఉంటుందా అంటుంది ముకుంద. అయితే నీ మనసులో ఉద్దేశం చెప్పు అంటాడు శ్రీనివాస్. అయితే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే పెళ్లి చేసుకున్న వాడితోనే అడ్జస్ట్ అయిపోయి బ్రతకాలి అంటుంది ముకుంద.
అయితే నీ మనసులో ఎవరున్నారు అంటాడు శ్రీనివాస్. మురారి తప్పితే నా మనసులో ఎవరూ లేరు అంటుంది ముకుంద. ఆ మాటలకి శ్రీనివాస్ తల తిరిగిపోతుంది. అది మహా పాపం పెళ్లయిన ఆడవాళ్లు భర్తని తప్పితే మరొక మగవాడు జోలికి వెళ్ళకూడదు అంటాడు శ్రీనివాస్. అయితే జీవితాంతం నన్ను ఇలా మోడుగానే మిగిలిపోమంటారా అంటుంది ముకుంద.
అయితే నన్ను ఏం చేయమంటావు అంటాడు శ్రీనివాస్. మురారితో మాట్లాడి నాతో పెళ్లికి ఒప్పించు అని తండ్రికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు భవాని ప్రసాద్ కి ఫోన్ చేసి ముకుంద తండ్రి పోయిన తర్వాత మళ్లీ ఏమైనా అన్నాడా..ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ జరగలేదు నాకు తెలిసి మీరు వచ్చిన వరకు అతను మళ్లీ రాడు అంటాడు ప్రసాద్.
రేవతికి ఫోన్ ఇమ్మని చెప్పి ముకుంద మనసులో ఏముందో మెల్లగా కనుక్కో అని తోటి కోడలికి పురమాయిస్తుంది భవాని. తన మనసులో మురారి తప్పితే ఇంకెవరు ఉంటారు అని మనసులో అనుకుంటుంది రేవతి. బయటికి మాత్రం అలాగే అక్క అంటుంది. మరోవైపు మురారికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది కృష్ణ. అది చూసిన ప్రసాద్ కొడుకు ఫోన్ లో షూట్ చేస్తాడు. పని పాటు లేదా అని తిడతాడు మురారి.
మీ ఇద్దరివి రిల్స్ చేసి పెడతాను మంచి వ్యూస్ వస్తాయి అంటాడు ప్రసాద్ కొడుకు. అంటే ఏం చేయాలి అంటుంది కృష్ణ. మీ లవ్ మీ ప్రపోజ్ చేయండి అంటూ దగ్గరుండి మురారికి ఫ్లవర్ ఇచ్చి ఎలా ప్రపోజ్ చేయాలో చెప్తాడు ప్రసాద్ కొడుకు. ఇదంతా చూస్తున్న ముకుంద అసూయతో రగిలిపోతుంది.
తరువాయి భాగంలో ముకుంద మురారి కి ఐ లవ్ యు చెప్పటాన్ని విని షాక్ అవుతాడు ప్రసాద్ కొడుకు. నేను నిన్ను ప్రేమించడం లేదు అంటాడు మురారి. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది ముకుంద. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే రేవతిని తీసుకొచ్చి చూపిస్తాడు ప్రసాద్ కొడుకు.