- Home
- Entertainment
- ఎమ్ ఎస్ ధోని 'యానిమల్' మూవీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, సందీప్ వంగా విజిల్ కొట్టాడుగా
ఎమ్ ఎస్ ధోని 'యానిమల్' మూవీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, సందీప్ వంగా విజిల్ కొట్టాడుగా
క్రికెట్ లో ఎమ్ ఎస్ ధోని వైల్డ్ బ్యాటింగ్ చేస్తే ఎవ్వరూ అడ్డుకోలేరు. అదే వైల్డ్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుందో ధోని శాంపిల్ చూపించారు.

MS Dhoni and Sandeep Reddy Vanga
క్రికెట్ లో ఎమ్ ఎస్ ధోని వైల్డ్ బ్యాటింగ్ చేస్తే ఎవ్వరూ అడ్డుకోలేరు. అదే వైల్డ్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుందో ధోని శాంపిల్ చూపించారు. ధోని వైల్డ్ హీరోగా కనిపించడంతో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విజిల్ కొట్టాడు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ఎమ్ ఎస్ ధోని, సందీప్ రెడ్డి వంగా కలసి ఒక యాడ్ లో నటించారు. ఆ యాడ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎలెక్ట్రిక్ సైకిల్ యాడ్ కోసం ధోని, సందీప్ రెడ్డి వంగా కలసి నటించారు. E Motorad అనే సంస్థ ఈ యాడ్ ని రూపొందించింది. తమ ఎలెక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ప్రచారం కోసం ధోనిని, సందీప్ వంగాని రంగంలోకి దించింది. ఈ యాడ్ మొత్తం యానిమల్ చిత్రానికి స్పూఫ్ లాగా అనిపిస్తోంది. రణబీర్ కపూర్ తరహాలో ధోని లాంగ్ హెయిర్ తో మ్యానరిజమ్స్ ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారు.
MS Dhoni
బ్లాక్ కార్ కాన్వాయ్ లోనుంచి హీరో దిగే సన్నివేశం, హీరోయిన్ ఇంటికి వెళ్లే సన్నివేశం, చేతితో సైగ చేస్తూ చూపించే సన్నివేశాన్ని ఈ యాడ్ లో ఉపయోగించారు. ధోని కారులో నుంచి దిగి రోడ్డు క్రాస్ చేస్తూ వెళుతుంటే సందీప్ కట్ చెబుతారు. మైండ్ బ్లోయింగ్ సర్, జనాలు ఇలా మిమ్మల్ని చూస్తే విజిల్స్ కొడతారు అంటూ సందీప్ కూడానా విజిల్ కొట్టడం చూడొచ్చు.
MS Dhoni
అప్పుడే ధోని ఫ్యాన్స్ ఫ్యూచర్ లో.. ధోని సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. యానిమల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టారు.