ధనుష్ తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్
ఈమధ్య స్టార్స్ హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈక్రమంలోనే స్టార్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ పై రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ ఈ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే?

ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్
ఫిల్మ్ ఇండస్ట్రీ రూమర్స్ చాలా కామన్. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ ఎనో వార్తలు వైరల్ అవతుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే నిజం అవుతుంటాయి. ఆ స్టార్స్ తరువాతి రోజుల్లో పెళ్లిల్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈక్రమంలో కొన్ని రూమర్స్ మాత్రం తలతోక లేకుండా ఉంటాయి. వైరల్ న్యూస్ కోసమే క్రియేట్ చేయబడతాయి. ఈక్రమంలో తాజాగా స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య కూడా ఏదో నడుస్తుందన్న వార్తలు తమిళ మీడియాను కుదిపేశాయి.
KNOW
భార్యతో విడాకులు తీసుకున్న ధనుష్
తమిళంలోనే కాకుండా సౌత్ అంతా స్టార్ హీరో ఇమేజ్ ను సాధించాడు ధనుష్. విభిన్నమైన పాత్రలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్ గానే ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమాతో సందడి చేశాడు. ఈసినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. హీరోగా అత్యున్నత స్థాయిలో ఉన్న ధనుష్, వ్యక్తిగతంగా మాత్రం కొన్ని వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈమధ్య కాలంలోనే ఆయన తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
మృణాల్ తో ధనుష్ డేటింగ్ రూమర్స్
ఈక్రమంలో ధనుష్ పై డేటింగ్ రూమర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సీతారామ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ధనుష్ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు తమిళనాడు మీడియాలో వైరల్ అయ్యాయి. మృణాల్ ఠాకూర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రమోషన్ ఈవెంట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో, “ఈ మూవీ లో ధనుష్ నటించారా?”, “వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా?” అనే సందేహాలు అభిమానుల్లో కలిగాయి. ఇదే కాకుండా, మృణాల్ నటించిన మరో సినిమా ‘మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ధనుష్ హాజరయ్యారని సమాచారం. ఇలా ధనుష్ ఎక్కువగా మృణాల్ ఈవెంట్స్ లో కనిపిస్తుండటంతో అందరికి డౌట్ వచ్చింది. డేటింగ్ రూమర్స్ కు బలం చేకూర్చినట్టు అయ్యింది.
స్పందించిన మృణాల్ ఠాకూర్
ఈ వార్తలు మరింతగా వైరల్ అవుతుండటంతో, మీడియా ప్రచారాలపై మృణాల్ ఠాకూర్ తాజాగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ “ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. ఆ మధ్య మా గురించి కొన్ని రూమర్స్ వచ్చాయని తెలిసింది. అవి నన్ను నవ్వించాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ధనుష్ హాజరైన విషయం పట్ల తప్పుదారిలో వెళ్లొద్దు. ఆయనకు అజయ్ దేవగన్ మంచి సన్నిహితుడు. ఆయనే ఈవెంట్ కు ధనుష్ ను ఆహ్వానించారు. ఆ ఈవెంట్‌కి వచ్చినందుకే మమ్మల్ని ఇలా కలిపేశారు,” అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.మృణాల్ ఇచ్చిన క్లారిటీతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ కు తెరపడినట్టు అయ్యింది. అయితే ఇప్పటికైనా సోషల్ మీడియాలో కామెంట్లు ఆగుతాయా లేక, ఇంకేమైన పాయింట్లు బయటకు తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో చూడాలి.