MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి.. స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి.. స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్లు అన్నాక హీరోల పక్కనే ఉండాలి.. హీరోలకి జోడీలుగా మాత్రమే నటించాలి అనేది పాత పద్ధతి. నటించాల్సి వస్తే హీరోలకు చెల్లెలుగా  కూడా చేస్తామని నిరూపించారు కొంత మంది . స్టార్ హీరోలకు చెల్లెలుగా, అక్కగా నటించిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2025, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : instagram / kushboo

చిరంజీవి అక్కగా కుష్బు..

హీరోలకు చెల్లెలు అంటే గతంలో ఓ కేటగిరి స్టార్స్ మాత్రమే ఉండేవారు. వారి కేవలం స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలో మాత్రమే నటించేవారు ఆ పద్దతి తరువాత కాలంలో మారిపోయింది. హీరోలకు చెల్లెల్లు, అక్కలుగా స్టార్ హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎక్కువ మంది హీరోయిన్లు చెల్లెలుపాత్రల్లో కనిపించారు. ఇప్పటికీ కొంత మంది హీరోయిన్లు మెగాస్టార్ కు చెల్లెలుగా నటించడానికి రెడీగా ఉన్నారు. ముందు నుంచి చూసుకుంటే.. 90 దశకంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు మెగాస్టార్ తో ఆడిపాడారు కాని తమిళ స్టార్ హీరోయిన్ కుష్బుకు మాత్రమే ఆ అవకాశం రాలేదు. ఆమె చిరంజీవితో హీరోయిన్ గా నటించలేదు కాని.. మెగాస్టార్ అక్కగా మాత్ర స్టాలిన్ సినిమాలో నటించి మెప్పించింది. అక్కాతమ్ముడిగా ఈసినిమాలో వీరి నటనకు 100 శాతం మార్కులు పడ్డాయి.

DID YOU
KNOW
?
చిరంజీవి చెల్లెళ్లుగా హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి చెలెల్లుగా ఎక్కువ మంది హీరోయిన్లు నటించారు. నయనతార, కీర్తి సురేష్ చెలెల్లుగా నటించగా, కుష్బు, సుజాత అక్కగా నటించారు. మీరా జాస్మిన్ కూడా మెగాస్టార్ చెల్లెలిగా నటించనున్నట్టు సమాచారం
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

చిరంజీవి భార్యగా,చెల్లిగా నటించిన నయనతార

ఇక చిరంజీవి సరసన చెల్లెలిగా నటించి మరో స్టార్ హీరోయిన్ నయనతార. సైరా సినిమాలో మెగాస్టార్ భార్యగా నటించిన నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే ఈసినిమాలో చిరంజీవి పాత్రకు సవతి సోదరిగా నయన్ కనిపించింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో నయనతార చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి సినిమా ప్రస్తావన వచ్చింద కాబట్టి ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఈసినిమాలో చిరంజీవి చెల్లెలుగా మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు సమాచారం. మీరా జాస్మిన్ హీరోయిన్ గా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రవితేజ,లాంటి స్టార్స్ సరసన సందడి చేసింది మీరా జాస్మిన్.

Related Articles

Related image1
కృష్ణ ను హీరోగా సెలెక్ట్ చేసిన మరో హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ చెప్పిన రహస్యం.
Related image2
మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్, చిరంజీవి బర్త్ డే కోసం అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నాడంటే?
35
Image Credit : our own

చిరంజీవి, రజినీకాంత్ చెల్లెలుగా మహానటి

ఇక ఓ పక్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరో పక్క చెల్లెలు పాత్రలో అదరగొట్టింది మహానటి కీర్తి సురేష్. ఆమె కూడా చిరంజీవికి చెల్లెలుగా నటించి మెప్పించింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా ఆమె నటించింది. అయితే కీర్తి సురేష్ చిరుకి సొంత చెల్లెలిగా నటించలేదు. తన వల్ల అనాధగా మారిన కీర్తిని చెల్లెలిగా స్వీకరించి జాగ్రత్తగా చూసుకుంటాడు మెగాస్టార్. ఇక కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలుగా కూడా నటించింది. ‘పెద్దన్న’ చిత్రంలో రజనీకాంత్ కు చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి సురేష్.

45
Image Credit : facebook / Savitri fans

ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ సావిత్రి

ఇప్పుడే కాదు పాత కాలంలో కూడా మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లు స్టార్ హీరోల సరసన చెల్లెలుగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు గా వెలుగు వెలిగిన ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెల్లుగా కూడా నటించి మెప్పించారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి గుర్తుగా నిలిచిన రక్తసంబంధం’ సినిమాలో ఎన్టీఆర్- సావిత్రి అన్నా చెల్లెల్లుగా నటించి మెప్పించారు. ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చెల్లెలి పాత్రని పోషించడం.. అదీ స్టార్ హీరోకి చెల్లెలుగా నటించడం ఆమె రిస్క్ అనుకోలేదు, చాలా సినిమాల్లో వీళ్ళు జోడీగా నటించినా ఈ సినిమాలో సావిత్రి చెల్లెలుగా నటించింది. అయినా సరే ఆడియన్స్ యాక్సప్ట్ చేశారు. ఈసినిమాను ఇండస్ట్రీ హిట్ చేశారు.

55
Image Credit : our own

అన్నా చెల్లెలుగా నటించిన కృష్ణ , విజయనిర్మల

విచిత్రం ఏంటంటే.. వెండితెరపై హీరో హీరయిన్లుగా, నిజ జీవితంలో భార్య భర్తలుగా ఉన్న కృష్ణ విజయ్ నిర్మల కూడా అన్నా చెల్లెలుగా నటించారంటే మీరు నమ్ముతారా? కాని ఇది నిజం. వీరిద్దరు ఏకంగా రెండు సినిమాల్లో అన్నా చెల్లెలుగా నటించి మెప్పించారు. 1967 లో కృష్ణ, విజయ నిర్మల మంచి మిత్రులు అనే చిత్రంలో అన్నా చెల్లెలుగా నటించారు. ఆ తర్వాత 1969లో వచ్చిన ముహూర్త బలం సినిమాలో మరోసారి అన్నా చెల్లెలుగా నటించారు. మరో చిత్రం ఏంటంటే.. అదే ఏడాది వీళ్లిద్దరు పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లో భార్య భర్తలు అయ్యారు. ఇలా చాలామంది హీరోలకు హీరోయిన్లు చెల్లెలుగా నటించారు. అయితే ఈలిస్ట్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవవి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన కెరీర్ లో ఎక్కవమంది హీరోయిన్లు చెల్లెల్లుగా నటించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
నందమూరి తారక రామారావు
కృష్ణ ఘట్టమనేని
సావిత్రి (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
కృష్ణ ను హీరోగా సెలెక్ట్ చేసిన మరో హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ చెప్పిన రహస్యం.
Recommended image2
మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్, చిరంజీవి బర్త్ డే కోసం అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved