MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Peddi: పెద్ది ఐటెం సాంగ్ కోసం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. థియేటర్లు ఊగిపోతాయ్, ఆమె పర్సనల్ లైఫ్ పై రూమర్స్ ?

Peddi: పెద్ది ఐటెం సాంగ్ కోసం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. థియేటర్లు ఊగిపోతాయ్, ఆమె పర్సనల్ లైఫ్ పై రూమర్స్ ?

రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన రైరై రా రా.. చికిరి సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 22 2026, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా
Image Credit : Instagram/peddimovie

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రముఖ నటి మృణాల్ ఎంపిక ?
Image Credit : Instagram/peddimovie

ప్రముఖ నటి మృణాల్ ఎంపిక ?

ఈ సినిమాలో ప్రత్యేక డ్యాన్స్ నంబర్ ఒకటి ఉండనుందని చిత్ర వర్గాల సమాచారం. తాజా చర్చల ప్రకారం, ఆ స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ నటి మృణాల్ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నర్తించనున్నట్లు సమాచారం. అదే పాటలో జాన్వీ కపూర్ కూడా భాగమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

35
స్పెషల్ సాంగ్
Image Credit : Asianet News

స్పెషల్ సాంగ్

అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్పెషల్ సాంగ్ రూపకల్పన ఎలా ఉండబోతోందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఈ ట్రాక్‌ను ఎలా రూపకల్పన చేశారన్నదానిపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పాట చిత్రీకరణ, నృత్య రూపకల్పనపై కూడా ఆసక్తి పెరుగుతోంది.

45
మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లు
Image Credit : X

మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లు

ఇటీవల మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నటుడు ధనుష్ తో సన్నిహితంగా ఉన్నారన్న రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం ఇవి కేవలం ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి.

55
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై
Image Credit : X

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’లో ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, నటుడు దివ్యేందు శర్మ, అలాగే బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న భాషలకు చెందిన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో, త్వరలోనే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు వేగం అందుకునే అవకాశం ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Related Stories
Recommended image1
విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు నిహారిక ఫస్ట్ ఎవరికి చెప్పిందో తెలుసా ? విన్న వెంటనే ఆయన రియాక్షన్ ఇదే
Recommended image2
నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలి అంటూ చిరంజీవి సినిమాపై కుట్ర.. ఆ మూవీ ఏంటి ? అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved