- Home
- Entertainment
- శృంగారం గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలంటూ మృణాల్ ఠాకూర్ బోల్డ్ స్టేట్‌మెంట్.. టీనేజర్లకి అవసరమని వ్యాఖ్య
శృంగారం గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలంటూ మృణాల్ ఠాకూర్ బోల్డ్ స్టేట్‌మెంట్.. టీనేజర్లకి అవసరమని వ్యాఖ్య
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది. ఆమె చేస్తున్న సినిమాలు, ఆమె కామెంట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. మృణాల్ యేనా ఇలా చేసిది, ఇలా మాట్లాడేది అని ఆశ్చర్యపోతున్నారు.

`సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తాజాగా `లస్ట్ స్టోరీస్ 2` ఓటీటీ ఫిల్మ్ లో నటించింది. ఇది గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. బోల్డ్ కంటెంట్ కావడంతో యువత ఎగబడి చేస్తున్నారట. పైగా తమన్నా, మృణాల్ వంటి క్రేజీ హీరోయిన్లు శృంగార సన్నివేశాల్లో నటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకే దీనిపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్లు మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె శృంగారం గురించి బోల్డ్ గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. సెక్స్ గురించి ఇంట్లో చర్చ జరగాలని, అందరి ముందు దీని గురించి మాట్లాడుకోవాలని, ప్రతి ఒక్కరు ఓపెన్ కావాలని తెలిసింది మృణాల్.
`లస్ట్ స్టోరీస్ 2`లో ఉన్న కంటెంట్‌ని ఉద్దేశించి ఆమె చెబుతూ, శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదని చెప్పింది. ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా చర్చించుకోవడం ఎంతో ముఖ్యమని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పింది. ఇంట్లో టీనేజ్ వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం చాలా అవసరం అని పేర్కొంది.
శృంగారం గురించి వాళ్లకి సరైన అవగాహన, సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం ఉందని, ఇలాంటి అంశాలు ఇంట్లో పిల్లలతో నిజాయితీగా వివరించే వ్యక్తి ఉన్నా కూడా వాల్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరని పేర్కొంది మృణాల్. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బోల్డ్ గా చెప్పినా, చాలా వరకు మృణాల్ మంచి విషయాన్నే చెప్పిందంటున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే `లస్ట్ స్టోరీస్ 2`లో మృణాల్ రొమాన్స్ సీన్లు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అంగద్ బేడీతో ఆమె కారులో లిప్ కిస్సులు, బెడ్ సీన్లు, మరో రొమాంటిక్ సీన్ సైతం వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వల్ల ఆ తర్వాత జీవితం బాగుంటుందని తెలియజేసే కథలో మృణాల్ నటించింది. పెళ్లి కి ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలని చెప్పే బామ్మ పాత్రలో నీనా గుప్తా నటించారు.
హీరోయిన్‌గా బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్. ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. నానితో `నాని 30`, విజయ్ దేవరకొండతో పరశురామ్ సినిమా చేస్తుంది. మరోవైపు హిందీలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఛాన్స్ దొరికినప్పుడు గ్లామర్ షోతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుందీ `సీతారామం` బ్యూటీ.