MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ మిరపకాయ్ మూవీ బ్యూటీ హరీష్ శంకర్ భార్యనా... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!

ఈ మిరపకాయ్ మూవీ బ్యూటీ హరీష్ శంకర్ భార్యనా... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!

డైరెక్టర్ హరీష్ శంకర్ భార్య నటి అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన మిరపకాయ్ మూవీలో ఆమె నటించారట. కాగా ఈ వార్తలపై హరీష్ శంకర్ స్వయంగా స్పందించాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 17 2024, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా నటించాడు. మిస్టర్ బచ్చన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే పూర్తి స్థాయిలో మూవీ మెప్పించలేదనే టాక్ వినిపిస్తోంది. అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ కొన్ని వివాదాలు సైతం రాజేసింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, సీన్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ విమర్శల పాలవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓ డైలాగ్ దర్శకుడు త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ హరీష్ శంకర్ రాశాడని అంటున్నారు. నేను మాటల మాంత్రికుడిని కాదు మేటర్ ఉన్న మాంత్రికుడిని... అని ఓ సన్నివేశంలో హీరో చెబుతాడు. మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ నిక్ నేమ్ గా పరిశ్రమలో ఉంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ ని త్రివిక్రమ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ని విమర్శించే స్థాయి నీకు లేదని ఎద్దేవా చేస్తున్నారు. 
 

36
Mr. Bachchan

Mr. Bachchan

అలాగే ఓ పాటలో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నడుము వద్ద పట్టుకోవడం ట్రోల్ మెటీరియల్ గా మారింది. రవితేజ వయసుకు  యంగ్ హీరోయిన్ తో అలాంటి పోజ్ అవసరమా అంటున్నారు. అలా చేయడం నాకు కూడా నచ్చలేదు. ఆ సాంగ్ ని స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఆయనకు అది ఫస్ట్ డే షూట్. మొదటిరోజే అది వద్దు ఇది వద్దు అంటే డిస్టర్బ్ అవుతారు. అందుకే నేను చెప్పలేకపోయాను... అని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.  

46
Snigdha

Snigdha

మిస్టర్ బచ్చన్ వసూళ్లు ఆశాజనకంగా లేవు. మూవీ డిజాస్టర్ అనే మాట వినిపిస్తోంది. మరోవైపు ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. రవితేజ హీరోగా 2011లో విడుదలైన మిరపకాయ్ చిత్రంలో నటించిన ఓ అమ్మాయి హరీష్ శంకర్ భార్య అట. మిరపకాయ్ మూవీలో హీరోయిన్ రిచా గంగోపాధ్య ఫ్రెండ్ పాత్ర చేసింది స్నిగ్ద. ఆమె కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది.  స్నిగ్ద వాయిస్ అట్రాక్టివ్ గా ఉంటుంది. మిరపకాయ్ అనంతరం స్నిగ్ద పెద్దగా చిత్రాలు చేసిన దాఖలాలు లేవు. 
 

56
Snigdha

Snigdha


ఈ స్నిగ్దనే హరీష్ శంకర్ భార్య అంటూ ప్రచారం అవుతుండగా... ఆయన వివరణ ఇచ్చాడు. మిరపకాయ్ మూవీలో నటించిన స్నిగ్ద నా భార్య కాదు. ఆమె సినిమాలు మానేసి విదేశాల్లో ఉంటుంది. ఆఫర్స్ వస్తున్నా చేయను అన్నది. నా భార్య పేరు కూడా స్నిగ్దనే అందుకే కొందరు పొరపాటు పడుతున్నారని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. 

66

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేసి విడుదల చేశాడు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలుకానుంది సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Pavala Syamala Struggles: పెళ్లైన మూడేళ్లకే భర్త మరణం, ఒంటరి చేసి పీడించిన సమాజం.. పావలా శ్యామల తెర వెనుక పోరాటం
Recommended image2
Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత
Recommended image3
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved