సమంత-శోభిత కాంబోలో మిస్ అయిన మూవీ, చైతూకి ఆమె పరిచయమైంది అక్కడేనా?
నాగ చైతన్య-సమంత-శోభిత కాంబోలో ఒక మూవీ రావాల్సిందట. కొంత షూటింగ్ కూడా జరిగాక శోభిత తప్పుకున్నారట. అప్పుడే శోభితతో నాగ చైతన్యకు పరిచయం ఏర్పడి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే... నాగ చైతన్యకు రెండో చిత్రం. జోష్ మూవీతో నాగ చైతన్య సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు.
Samantha
సమంత-నాగ చైతన్య చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికి కొన్నాళ్ల ముందు వీరు రిలేషన్ లో ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 2017లో సమంత-నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. పెళ్ళికి తర్వాత కూడా సమంత-నాగ చైతన్య సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.
Samantha and Sobhita Dhulipala
సమంత, నాగ చైతన్య జంటగా నటించిన ఏమాయ చేసావే, మజిలీ, మనం భారీ విజయాలు నమోదు చేశాయి. మహానటి, ఓ బేబీ చిత్రాల్లో నాగ చైతన్య గెస్ట్ రోల్స్ చేశారు. వివాహం అనంతరం ఈ జంట నటించిన చిత్రాల్లో మజిలీ ఒకటి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన మజిలీ చిత్రంలో సమంత, నాగ చైతన్య పోటీపడి నటించారు. ఇద్దరి పాత్రల్లో బాగా డెప్త్ ఉంటుంది.
కాగా మజిలీ మూవీలో దివ్యాన్ష కౌశిక్ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఆమె పాత్రకు కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది. కాగా ఈ పాత్రకు మొదట ఎంపికైన నటి శోభిత ధూళిపాళ్ల అట. శోభిత షూటింగ్ లో కూడా పాల్గొందట. ఆమెపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. అనుకోని కారణాల వలన శోభిత ఈ ప్రాజెక్ట్ కి దూరమైందట. ఆ క్రమంలో దివ్యాన్షా కౌశిక్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. మజిలీ మూవీ షూటింగ్ సెట్స్ లోనే మొదటిసారి నాగ చైతన్య, శోభితలకు పరిచయం ఏర్పడిందట.
Samantha and Sobhita Dhulipala
ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. మరోవైపు సమంతతో నాగ చైతన్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2021లో సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు సందేశంలో తెలియజేశారు. సమంతతో విడిపోయిన నాగ చైతన్య తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యాడు. రెండేళ్లకు పైగా ఆమెతో రిలేషన్ నడిపారు.
మొదట్లో ఎఫైర్ రూమర్స్ ని శోభిత, నాగ చైతన్య ఖండించారు. 2024 ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరుపుకుని సడన్ గా షాక్ ఇచ్చారు. నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలియజేశారు. శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న నాలుగు నెలలకు పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య నాగ చైతన్య-శోభితల వివాహం జరిగింది. కాగా సమంత మాత్రం సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది.