- Home
- Entertainment
- Karthika Deepam: హోటల్ లో పనిచేస్తున్న డాక్టర్ బాబును చూసిన వంటలక్క.. కార్తీక్ కాలర్ పట్టుకొని?
Karthika Deepam: హోటల్ లో పనిచేస్తున్న డాక్టర్ బాబును చూసిన వంటలక్క.. కార్తీక్ కాలర్ పట్టుకొని?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ లో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.

పిల్లల దగ్గరకు రుద్రాణి (Rudrani) మనుషులు రావడంతో వాళ్లు నాన్న గురించి అడిగారని దీపకు చెబుతారు. దీప పిల్లలకు ఏం భయపడకండి అని ధైర్యం ఇస్తుంది. ఇక దీప (Deepa) ఆలోచనలో పడుతుంది. మరోవైపు మోనిత తన అందాన్ని చూసి మురిసి పోతుంది.
అంతలోనే డాక్టర్ భారతి రావడంతో తనతో కాసేపు మాట్లాడుతుంది. ఇక గతంలో కార్తీక్ (Karthik) చేసిన ఆపరేషన్ గురించి మోనిత పదే పదే అడగటంతో భారతికి డౌట్ వస్తుంది. అందులో నీ పని ఏమైనా ఉందా అని అనేసరికి మోనిత (Monitha) నేను ఎందుకు అలా చేస్తానని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
హోటల్ లో అప్పారావు (Apparao) సినిమాకి వెళ్లడానికి కాసేపు కార్తీక్ ను అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ ఓనర్ కి నేను ఏదో ఒకటి చెబుతాను వెళ్ళు అని పంపిస్తాడు. దీప (Deepa) దారిన నడుచుకుంటూ వస్తూ రుద్రాణికి డబ్బులు ఎలా ఇచ్చానో అని బాబు తో మాట్లాడుతూ ఉంటుంది.
ఇక బాబు ని నువ్వు డాక్టర్ అయితే చూడాలని ఉంది అని.. బాబు గురించి కలలు కంటూ ఊహించుకుంటూ ఉంది. అంతలోనే ఎదురుగా అప్పారావు (Apparao) రావడంతో దీపను (Deepa) పలకరిస్తాడు. సినిమాకు వెళ్తున్నానని అందుకే బయటకి వచ్చాను అక్క అని అంటాడు.
హోటల్ చూసుకోవడానికి తన జూనియర్ ఉన్నాడని కార్తీక్ (Karthik) గురించి చెబుతూ ఉంటాడు. ఇక దీప ఎవరు అతడు అని అడగటం తో పేరు చెప్పలేక పోతాడు. ఇక ఫోటో చూపిస్తూ ఉండగా దీప వద్దులే అని అంటుంది. మోనిత (Monitha) పని మీద బయటకి వెళ్లడంతో అక్కడ ఆదిత్య కనిపిస్తాడు.
ఇక ఆదిత్య తో (Adithya) కాసేపు మాటల యుద్ధం చేస్తుంది. ఆదిత్య మాత్రం విరుచుకుపడుతూ ఉంటాడు. అయినా కూడా మోనిత తన మాటలతో బాగా రెచ్చి పోతూ ఉంటే ఆదిత్య క్లాస్ పీకి అక్కడినుంచి వెళ్తాడు. కానీ ఆదిత్య ఫోన్ మర్చిపోవడం తో ఆ ఫోను ముక్కలు చేస్తుంది మోనిత (Monitha).
హోటల్ లో కార్తీక్ (Karthik) పార్సల్ ఇవ్వడానికి బయటికి వెళ్తుండగా యజమాని తాను వెళ్తానని చెప్పి వెళ్తాడు. అంతలోనే దీప రావటంతో యజమాని తో కాసేపు మాట్లాడుతుంది. ఇక లోపలికి వచ్చి టేబుల్ శుభ్రం చేస్తున్న కార్తీక్ ను చూసి ఏవండీ అంటూ దీప ఎమోషనల్ అవుతుంది. దీపను (Deepa) చూసి కార్తీక్ షాక్ అవుతాడు.