- Home
- Entertainment
- Movie Reviews
- 3 Roses 2 OTT Review: 3 రోజెస్ సీజన్ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్ ఎలా ఉందంటే?
3 Roses 2 OTT Review: 3 రోజెస్ సీజన్ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన `3 రోజెస్` సీజన్ 2 వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే?

3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ
`3 రోజెస్` అనే బోల్డ్ వెబ్ సిరీస్ నాలుగేళ్ల క్రితం వచ్చి ఆకట్టుకుంటుంది. యువత దీన్ని బాగా చూశారు. ముగ్గురు అమ్మాయిలు చేసే బోల్డ్ వ్యవహారాలు కుర్రాళ్లకి బాగా నచ్చాయి. దీంతో ఈ సిరీస్ సీజన్ 2 కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఆహా ఓటీటీలో శనివారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సిరీస్‌లో ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పూత్, పూర్ణలు నటించగా, ఇప్పుడు ఈషా రెబ్బా మాత్రం కంటిన్యూ అయ్యారు. కొత్తగా రాశి సింగ్, కుషిత కల్లపు ఇందులో నటించారు. వీరితోపాటు హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయ సుల్తానా ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మించారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న `3 రోజెస్` సీజన్ 2 ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
3 రోజెస్ సీజన్ 2 సిరీస్ కథ ఇదే
రీతూ(ఈషా రెబ్బా), మేఘన(రాశీ సింగ్), సృష్టి(కుషిత కల్లపు) ముగ్గురు ముంబయిలో ఒకే రూమ్‌లో ఉంటారు. రీతూకి సమీర్‌తో బ్రేకప్ అవుతుంది. దీంతో ఆమె కెరీర్‌పై ఫోకస్ పెడుతుంది. వీరభోగ వసంత రాయలు(సత్య)తో మేఘన విడాకులు తీసుకుంటుంది. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్లకి తెలియకుండా మ్యానేజ్ చేస్తుంది. మాజీ భర్త ఇచ్చే భరణంతో లైఫ్‌ని లీడ్ చేస్తుంటుంది. ఇక కొరియన్ డ్రామాలు ఇష్టపడే సృష్టి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటుంది. కొత్త వాళ్లతో డేటింగ్‌కి చేయాలని ప్లాన్ చేస్తుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సృష్టిని కొందరు ట్రాప్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే రీతూ, మేఘన, సృష్టి ముగ్గురు ఓకే రూమ్‌లో ఉండటంతో మంచి ఫ్రెండ్స్ అవుతారు. కలిసి యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. కానీ వారికి ఒక్క యాడ్ కూడా రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. చివరగా వీరికి ప్రసాద్(హర్ష చెముడు) గోల్డ్ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ప్రసాద్ ఎంట్రీతో ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పేంటి? వీరిని ట్రాప్ చేయాలనుకున్న వారి నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు? అంతిమంగా ఇది ఎలాంటి ముగింపు తీసుకుందనేది సిరీస్ మిగిలిని కథ.
3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతలను చర్చించిన సిరీస్ ఇది. బంధాలు, బంధనాల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా బతికే ముగ్గురు అమ్మాయిల కథని ఇందులో చూపించారు. అయితే ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకపోతే, అలాంటి అమ్మాయిలను కొందరు ట్రాప్ చేయాలని, వాడుకోవాలని చూస్తుంటారు. ఎన్నో కుట్రలు పన్నుతారు. వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకుని, దాటుకుని నిలబడే ముగ్గురు అమ్మాయిల కథ. తమకు నచ్చినట్టు జీవితాన్ని లీడ్ చేయాలనుకునే అమ్మాయిల జర్నీ ఈ సిరీస్. నేటి ట్రెండ్‌ని అద్దంపట్టేలా తెరకెక్కించారు. ఇది ఆద్యంతం రొమాంటిక్‌గా ఉంటుంది. బోల్డ్ గా ఉంటుంది. అదే సమయంలో కామెడీగానూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే జెంజీ కల్చర్‌ని ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ముగ్గురు హీరోయిన్లు కూడా ఆద్యంతం గ్లామరస్‌గా కనిపిస్తారు. కుషిత కల్లపు పాత్రతో గ్లామర్ డోస్ పెంచి చూపించారు. అదే సమయంలో ఎంటర్‌టైన్ చేశారు. సత్య కామెడీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ ముగ్గురికి సత్య తోడు కావడంతో ఇక నవ్వులకు కొదవలేదు. ట్రెండీగా నడిపిస్తూనే కొన్ని హద్దులను చూపించిన సిరీస్ ఇది. ఏది ప్రేమ, ఏది వ్యామోహం, ఏది ఆకర్షణ, ఏది కుట్ర అనే విషయాలను అమ్మాయిలు తెలుసుకోవాలని చెప్పిన తీరు బాగుంది. మనో పాత్ర ద్వారా ఇచ్చే సందేశం బాగుంది. అటు వినోదాత్మకంగా, ఇటు యువతని ఆకట్టుకునేలా, మరోవైపు ఆలోచింప చేసేలా రూపొందించారు. అదే ఈ సిరీస్ సక్సెస్‌గా చెప్పొచ్చు. కథ పరంగా కొంత రొటీన్‌గానే ఉన్నా, దాన్ని నడిపించిన తీరు బాగుంది. వెబ్ సిరీస్‌లో గంటలు గంటలు ఉంటాయి. కానీ ఇది రెండు గంటలే కావడం విశేషం. దీంతో షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటూ ఆకట్టుకుంది. అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉన్నా సరదాగా ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పొచ్చు.
3 రోజెస్ సీజన్ 2లో ఎవరెవరు ఎలా చేశారంటే?
నటీనటులు
ఈషా రెబ్బా రీతూ పాత్రలో అదరగొట్టింది. వారితోపాటు రాశీ సింగ్, కుషిత కల్లపు కూడా చాలా బాగా నటించారు. నటన పరంగా మెప్పించారు. గ్లామర్‌తో కనువిందు చేశారు. అదే సమయంలో అమాయకత్వంతో అలరించారు. సత్య కామెడీ సిరీస్‌కి మెయిన్ హైలైట్‌గా చెప్పొచ్చు. అమ్మాయి పిచ్చి ఉన్న పాత్రలో ప్రభాస్ శ్రీను బాగా చేశాడు. యాప్ట్ గా అనిపించాడు. వైవా హర్ష నటన బాగుంది. పాత్ర తీరుతెన్నులు కూడా బాగున్నాయి. ఆర్టిస్ట్ లు పర్‌ఫెక్ట్ గా కుదిరారని చెప్పొచ్చు.
టెక్నీకల్‌గా చూస్తే,
ఈ సిరీస్‌కి అజయ్ అరసాడ సంగీతం ప్లస్ అయ్యింది. బీజీఎం చాలా బాగుంది. శక్తి అరవింద్ కెమెరా వర్క్ బాగుంది. హీరోయిన్లని బాగా చూపించారు. సిరీస్ కూడా ఆద్యంతం కలర్‌ఫుల్‌గా సాగింది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఎస్‌కేఎన్ నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇది టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
`3 రోజెస్` సీజన్ 2 కామెడీ పరంగా నవ్విస్తుంది, గ్లామర్ పరంగా కనువిందు చేస్తూ, అదే సమయంలో లైఫ్ విషయంలో ఆలోచింపచేస్తుంది. అనేక లెసన్స్ ని నేర్పిస్తుంది. బోల్డ్ గా ఉన్నా సరదాగా చూడదగ్గ సిరీస్.

