MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: అచ్చం వంటలక్కలానే కార్తీక్ ని వెతుకుతున్న మోనిత... సౌర్యని ఇంటికి రప్పించేందుకు హిమ ప్లాన్!

Karthika Deepam: అచ్చం వంటలక్కలానే కార్తీక్ ని వెతుకుతున్న మోనిత... సౌర్యని ఇంటికి రప్పించేందుకు హిమ ప్లాన్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 24వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Aug 24 2022, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప ఒక ప్రదేశానికి వెళ్లి కార్తీక్ ఫోటో పట్టుకొని పిల్లలందరినీ, పెద్దలందరినీ అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరూ కార్తీక్ ని చూడరు. ఎందుకు దేవుడా దగ్గర చేసి దూరం చేస్తున్నావు అని దీప బాధపడుతూ ఉండగా ఇంతట్లో ఎవరో వచ్చి కార్తీక్ ఫోటోని దీపకి చూపించి ఈయన తెలుసా అని అంటారు. ఇంతట్లో దీప ఎవరు అని చూస్తే అది మౌనిత. అప్పుడు మౌనిత కూడా దీప ని చూసి నువ్వా అని అంటుంది. అప్పుడు దీపకి, తన భార్య వచ్చి తీసుకువెళ్లిపోయింది అని నర్స్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది.
 

26

అప్పుడు మౌనిక మెడ పట్టుకొని నువ్వే కదా డాక్టర్ బాబు ని తీసుకువెళ్లిపోయావు హాస్పటల్ నుంచి అని అంటుంది.అప్పుడు మొనిత, దీప నువ్వు ఇంకా బతికే ఉన్నావా అంటే నా కార్తీక్ కూడా బతికే ఉన్నాడా? నువ్వు అన్న మాటలకు కార్తీక్ బతికి ఉన్నాడనే కదా అర్థం అని అనగా నువ్వు నటించింది చాలు నిజం చెప్పు డాక్టర్ బాబు ఎక్కడున్నారు అని దీప అడుగుతుంది. నిజంగానే కార్తీక్ బతికుంటే ఈ ఫోటో పట్టుకొని నడిరోడ్డు మీద ఎందుకు తిరుగుతాను చెప్పు దీప.కార్తీక్ దొరకకపోయేసరికి నాకు జీవితం ఒంటరి అయిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది మౌనిత.
 

36

 ఆ తర్వాత సీన్లో హిమ ఏడుస్తూ అమ్మ నాన్నల్ని తిరిగి తేలేము. కనీసం సౌర్య ని అయినా తిరిగి తేవచ్చు కదా నానమ్మ అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య, తను రావడం లేదు అంటే నన్నేం చేయమంటావు శౌర్య అంటే నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మాకు శౌర్య అంటే ఇష్టమే కానీ అది మొండికేసింది. రానంటే రానంటుంది అని అనగా ఆనందరావు,ఇప్పుడు శౌర్య ఎక్కడుందో తెలిసింది కదా వెళ్లి తీసుకొద్దాము అని అంటాడు. దానికి సౌందర్య ఇప్పటికీ సౌర్య అక్కడే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇంటికి రావాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఉన్నది కదా.
 

46

 మనం అమెరికా వెళ్ళినప్పుడు వచ్చినట్లయితే ఫోన్ చేసేది కదా అంటే శౌర్య రాలేనట్టే కదా అని సౌందర్య అంటుంది. అప్పుడు ఆనందరావు వెళ్లి వెతుకుదాం పోనీ ప్రయత్నం చేద్దాము అని అనగా అక్కడికి వెళ్తాము,తర్వాత ప్రమాదం జరిగిన దగ్గరికి వెళ్దాం అంటారు. అక్కడికి వెళ్లి గతమంతా గుర్తుతెచ్చుకొని మీకు ఆరోగ్యం పాడుచేసుకుంటార?అని అనగా ఎప్పుడైతే నా కొడుకు కోడలు దూరమయ్యారు అప్పుడే నా గుండు రాయిపోయింది అని అంటాడు అనందరావు.
 

56

ఆ తర్వాత సీన్ లో కార్తీక్, శివ కార్లో వెళ్తూ మధ్యలో దిగుతారు. అప్పుడు కార్తీక్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగగా మిమ్మల్ని ఎలా ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చాను అలాగే ఇంటికి వెళ్లి మేడంకి అప్పగించాలి సార్ అని శివ అంటాడు. అప్పుడు కార్తీక్ ఎందుకయ్యా నన్ను ఇంత పంజరంలో చిలకల ఉంచుతున్నారు. ఇల్లు కారు, ఇల్లు కారు అని, కార్లో వాకింగ్ చేయడం ఏంటి అయ్యా నాకు అర్థం కాదు అయినా అది నాకు భార్య కాదు అని అంటాడు.అప్పుడు శివ ఆశ్చర్యపోతాడు భార్య కాకపోవడం ఏంటి సార్ అని అడుగుతాడు.
 

66

 మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇంత లా చూసుకుంటారా కొంచమైనా స్వతంత్రం ఇవ్వాలి కదా అయ్యా అంటాడు కార్తీక్. ఆ తర్వాత సీన్లో సౌందర్య, దీప కార్తిక్ లో ఫోటో వద్దకు వెళ్లి మీరు వదిలేసి వెళ్ళిపోయారు తిరిగి రారు. కనీసం సౌర్యనైనా తిరిగి తెచ్చుకుందాం అంటే అది మొండికేస్తుంది. మా దగ్గర ఉన్న ఏకైక ఆనందం అది మాత్రమే అది వస్తే నైనా ఇంట్లో కొంచెం సంతోషం వస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas vs Salman Khan: ఈద్ బరిలో సల్మాన్ ఖాన్, ప్రభాస్?.. 2027లో బాక్సాఫీస్ బద్దలే
Recommended image2
బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్లు 80 కోట్లు.. అత్యధిక లాభాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఇదే
Recommended image3
Ram Charan-Akhil: రామ్‌ చరణ్‌ కోసం వెనక్కి తగ్గిన అఖిల్‌ అక్కినేని.. `లెనిన్‌` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved