హౌస్ లో మోనాల్ రొమాన్స్ ఖరీదు... పది సినిమాల రెమ్యూనరేషన్ కి సరిపడా!
First Published Dec 19, 2020, 10:10 PM IST
కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత తేలిక విషయం కాదు. నటించాలి, పోరాడాలి, నిర్వాహకుల ఆదేశాలు ఫాలో అవ్వాలి, నిద్ర, ఆకలి అదుపు చేసుకోగలగాలి. రొటీన్ లైఫ్ కి భిన్నంగా కుటుంబాన్ని వదిలి, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకాలి. మరి ఇంత కఠినమైన బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి అందరూ ఆసక్తి చూపడానికి కారణం... గుర్తింపు. అంతకు మించి అందే పారితోషికం.

కాగా ఈ సీజన్ లో పాల్గొన్న మోనాల్ కి డబ్బులు బాగా ముట్టినట్లు తెలుస్తుంది. టైటిల్ మరియు ప్రైజ్ మనీకి మించి... రెమ్యూనరేషన్ రూపంలో పది సినిమాలకు సరిపడా సంపాదించారట. 14వారాలు హౌస్ లో ఉన్న మోనాల్ గట్టిగా రాబట్టారని సమాచారం అందుతుంది.

మోనాల్ ఎక్కువ కాలం హౌస్ లో ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ప్రతి చిన్న విషయానికి ఏడవడం, నిలకడలేని మనస్థత్వం, భాష రాకపోవడం వంటి మైనస్ పాయింట్స్ మోనాల్ లో ఉండగా, రెండు మూడు వారాలే ఎక్కువ అనుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?