మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు ప్రైవేటు సైన్యం, తారాస్థాయికి చేరిన వివాదాలు
మంచు కుటుంబంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మంచు మనోజ్-మోహన్ బాబు భౌతిక దాడులకు దిగారన్న న్యూస్ కాకరేపుతుంది. కాగా దుబాయ్ నుండి రంగంలోకి దిగిన విష్ణు.. మనోజ్ ఇంటి చుట్టూ ప్రైవేట్ సైన్యాన్ని మోహరించాడట.
కొన్నేళ్లుగా మంచు ఫ్యామిలీలో సఖ్యత లేదు. మోహన్ బాబు, విష్ణులకు మనోజ్ దూరంగా ఉంటున్నారు. కొంత కాలం మనోజ్ హైదరాబాద్ లో లేడు. భూమా మౌనికతో పాటు ఏడాదిన్నర చెన్నైలో రహస్యంగా జీవించినట్లు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశానని అన్నారు. మౌనికతో మనోజ్ వివాహం కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదనే వాదన ఉంది.
మోహన్ బాబు పిల్లలు రెండు వర్గాలుగా విడిపోయారట. మనోజ్-లక్ష్మి ఒక వర్గం, మోహన్ బాబు-విష్ణు మరొక వర్గం అట. మనోజ్ పెళ్లి బాధ్యతను లక్ష్మి తీసుకుంది. ఆమె నివాసంలో వివాహం జరిగింది. ఏదో మొక్కుబడిగా చివరి నిమిషంలో మనోజ్ పెళ్లికి విష్ణు, మోహన్ బాబు హాజరయ్యారు. మౌనికతో వివాహం జరిగిన రోజుల వ్యవధిలో విష్ణు తమపై దాడి చేస్తున్న వీడియో మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తన మనుషులపై విష్ణు దాడికి పాల్పడుతున్నాడని మనోజ్ సదరు వీడియోలో అన్నారు. వెంటనే వీడియోను మనోజ్ డిలీట్ చేశాడు. విష్ణు-మనోజ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న వార్తలకు ఈ ఘటన బలం చేకూర్చింది. గొడవలు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశాడన్న న్యూస్ సంచలనంగా మారింది.
తండ్రి మోహన్ బాబు తన మనుషులతో కొట్టించాడని పహడ్ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారట. డయల్ 100 కి కాల్ చేసి మనోజ్ కంప్లైంట్ ఇచ్చారని ఫహడ్ షరీఫ్ పోలీసులు తెలియజేశారు. అలాగే గాయాలతో ఉన్న మనోజ్ నడవలేని స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడలేదు.
Manchu Vishnu
తాజాగా మరొక వార్త తెరపైకి వచ్చింది. జల్పల్లి లో గల మనోజ్ నివాసం చుట్టూ విష్ణు మనుషులు ఉన్నారట. ప్రైవేట్ బౌన్సర్లను విష్ణు పురమాయించాడట. విష్ణు బిజినెస్ పార్ట్నర్ అయిన విజయ్ అనే వ్యక్తి మనోజ్ ఇంటిలోని సీసీ కెమెరాలు, హార్ట్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నాడట. దుబాయ్ నుండి వస్తున్న విష్ణు మనోజ్ ని తన నివాసంలో కలవబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ కథనాలను విష్ణు టీమ్ ఖండిస్తోంది. ప్రస్తుతం విష్ణు అమెరికాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు. విష్ణు అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు నమ్మవద్దని... స్పష్టం చేశారు. శ్రీ విద్య నికేతన్ లో తన వాటాను మనోజ్ అడుగుతున్నారట. సెటిల్మెంట్ చేద్దామని మనోజ్ ని పిలిచిన మోహన్ బాబు, తన మనుషులతో దాడి చేయించాడు అని సమాచారం.
విష్ణు, మనోజ్ హీరోలుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సొంత బ్యానర్ లో సినిమాలు చేసుకుంటున్నారు. మనోజ్ తో సినిమాలు చేయడం లేదు మోహన్ బాబు. మనోజ్ ప్రకటించిన పాన్ ఇండియా చిత్రం అహం బ్రహ్మస్మి ఆగిపోయింది. విష్ణు మాత్రం వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప టైటిల్ తో దాదాపు రూ. 70-80 కోట్ల బడ్జెట్ తో విష్ణు హీరోగా పాన్ ఇండియా మూవీని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. తనకు మాత్రం మోహన్ బాబు పోత్సాహం ఇవ్వడం లేదనేది మనోజ్ ఆవేదన అట.