MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Balakrishna:దశాబ్దాల బాధని బాలకృష్ణకి మాత్రమే చెప్పిన హీరో, రజినీకాంత్ బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు

Balakrishna:దశాబ్దాల బాధని బాలకృష్ణకి మాత్రమే చెప్పిన హీరో, రజినీకాంత్ బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు

మోహన్ బాబు తనలో దాగున్న ఆవేదనని బాలకృష్ణకి మాత్రమే చెప్పారు. తాను చేసిన పెద్ద తప్పు విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తిట్టారు అని కూడా మోహన్ బాబు ప్రస్తావించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 01 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna
Image Credit : Asianet News

Nandamuri Balakrishna

సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు కోసం రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, స్వర్గీయ ఎన్టీఆర్ మధ్య కూడా ఎంతో మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు ఎన్టీఆర్ తో కలసి నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం అతడి కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ అనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోహన్ బాబుకి బాలయ్య ప్రశ్న
Image Credit : facebook.com/TheMohanBabu

మోహన్ బాబుకి బాలయ్య ప్రశ్న

ఎన్టీఆర్ పిలుపు మేరకు మోహన్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో జరిగిన ఒక సంఘటనని, తన బాధని మోహన్ బాబు బాలకృష్ణ ముందు మాత్రమే బయటపెట్టారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మోహన్ బాబుని ఇలా ప్రశ్నించారు. అన్నగారి పార్టీని వదిలేసి వేరే పార్టీలో ఎందుకు జాయిన్ కావలసి వచ్చింది అని బాలయ్య అడిగారు. మోహన్ బాబు సమాధానం ఇస్తూ మన కెరీర్ లో కానీ, ఫ్యామిలీ లైఫ్ లో కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది.

Related Articles

Related image1
Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
Related image2
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
35
ఎన్టీఆర్ కి ద్రోహం చేసినట్లే
Image Credit : Social Media

ఎన్టీఆర్ కి ద్రోహం చేసినట్లే

చంద్రబాబు మాట విని అన్నయ్యని కాదనుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా స్నేహితుడు రజినీకాంత్ చెన్నై నుంచి వచ్చి నన్ను తిట్టారు. ఏరా ఇలా చేయడం అన్నయ్యకి ద్రోహం చేసినట్లే కదరా అని అడిగాడు. రజినీకాంత్, నేను కలసి అన్నయకి క్షమాపణ చెప్పాలని వెళ్లాం. నేను క్షమాపణ చెప్పేలోపే.. ఏం బ్రదర్ మీరు కూడా ద్రోహం చేస్తారా అని అడిగారు. ఆ మాటతో నా మనసు ముక్కలైంది. అన్నయ్య ముందు ఏమీ మాట్లాడలేకపోయాను అని మోహన్ బాబు అన్నారు. ఆ విధంగా బాధపడుతూనే అన్నగారిని కలసి వెనక్కి వచ్చేశాం.

45
చంద్రబాబు తప్పు చేశారు
Image Credit : our own

చంద్రబాబు తప్పు చేశారు

ఆ తర్వాత చంద్రబాబు నా విషయంలో తప్పు చేశారు. క్రమశిక్షణ లేదని నన్ను పక్కన పెట్టేశారు అని మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు తిరిగి బాలయ్యని వివాదాస్పద ప్రశ్న అడిగారు. అన్నగారి తర్వాత పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావు అని అడిగారు.

55
పార్టీ పగ్గాలు అందుకే నేను తీసుకోలేదు
Image Credit : Asianet News

పార్టీ పగ్గాలు అందుకే నేను తీసుకోలేదు

బాలకృష్ణ సమాధానం ఇస్తూ.. ఆ టైంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇలా వారి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నాం. ఆ టైంలో నేను వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టడం కరెక్ట్ కాదు అని అనిపించినట్లు బాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు కూడా గ్రామస్థాయి నుంచి రాజకీయాలపై అవగాహన పెంచుకుని ఈ స్థాయికి ఎదిగారు అని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image2
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Recommended image3
Lokesh Kanagaraj: డైరెక్టర్ కాదు, హీరోగా అదరగొట్టాడు! లోకేశ్ 'డీసీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?
Related Stories
Recommended image1
Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
Recommended image2
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved