- Home
- Entertainment
- Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
Bulliraju: టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన బుల్లిరాజు, సడెన్ గా సంచలన నిర్ణయం..ఇలా అయితే కెరీర్ క్లోజ్
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బుల్లిరాజుగా గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కి టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. తాజాగా రేవంత్ తీసుకున్న సంచలన నిర్ణయం టాలీవుడ్ కి షాకిచ్చేలా ఉంది.

Chilad Artist Revanth
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. కాస్త గుర్తింపు వస్తే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా సినిమాల్లో హీరోగా కనిపించే చైల్డ్ ఆర్టిస్ట్ ల కంటే కామెడీ పండించే చైల్డ్ ఆర్టిస్ట్ లకే డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో బుల్లిరాజుగా గుర్తింపు పొందిన రేవంత్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో ఇలాంటి క్రేజ్ మాస్టర్ భరత్ కి ఉండేది.
సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజుగా అదరగొట్టిన రేవంత్
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ కొడుకుగా, బుల్లి రాజుగా రేవంత్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లిరాజు చెప్పిన డైలాగ్స్, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించాయి. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో అనిల్ రావిపూడే మరోసారి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు.
వరుస హిట్లతో విపరీతమైన డిమాండ్
ఆ మూవీలో కూడా బుల్లిరాజు రేవంత్ చెలరేగిపోయాడు. థియేటర్స్ లో అతడికి, చిరంజీవికి మధ్య వచ్చే సీన్లు హైలైట్ గా నిలిచాయి. అదే విధంగా అనగనగా ఒక రాజు చిత్రంతో కూడా బుల్లిరాజు హిట్ కొట్టాడు. దీనితో బుల్లిరాజు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తాజాగా బుల్లిరాజు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు వరుస హిట్లు, క్రేజ్ రావడంతో బుల్లిరాజు రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేశాడట.
టాలీవుడ్ కి షాక్, భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన బుల్లిరాజు
ఇప్పుడు బుల్లిరాజు కుటుంబ సభ్యులు ఒక రోజుకి 1.5 లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చిత్రాలకు వర్కింగ్ డేస్ ఎక్కువ ఉంటే.. రూ లక్షకి అంగీకారం చెబుతున్నారట. ఏది ఏమైనా బుల్లిరాజు ఒకరోజు రెమ్యునరేషన్ ఇప్పుడు లక్ష నుంచి లక్షన్నర మధ్యలో ఉంది.
ఇలా అయితే కెరీర్ ప్రమాదంలో పడొచ్చు
కొందరు స్టార్ కమెడియన్లకు కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ లేదు. బుల్లిరాజుకి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అతడి రెమ్యునరేషన్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు. బుల్లిరాజు ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరీ విపరీతంగా రెమ్యునరేషన్ పెంచేస్తే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మాస్టర్ భరత్ కి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఛాన్సులు బాగా తగ్గిపోయాయి అనే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

