మనోజ్ నుండి ప్రాణహాని ఉంది, కమిషనర్ కి మోహన్ బాబు ఫిర్యాదు, మరోవైపు కొడుకు కూడా!
మంచు కుటుంబంలో చెలరేగిన మంటలు ఆరే సూచనలు కనిపించడం లేదు. సెటిల్మెంట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. మోహన్ బాబు ఏకంగా కొడుకు మనోజ్ నుండి ప్రాణహాని ఉందని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మనోజ్ సైతం కేసు పెట్టాడు.
Mohan Babu, Manoj and Vishnu
జుల్ పల్లిలో గల మోహన్ బాబు ఫార్మ్ హౌస్ లో పెద్ద హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మనోజ్ ని మోహన్ బాబు తన మనుషులతో కొట్టించాడని సమాచారం. ఫహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. గాయాలతో ఉన్న మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. మీడియాతో ఆయన మాట్లాడలేదు.
Manchu Manoj
సోమవారం జుల్ పల్లి ఫార్మ్ హౌస్ కి మనోజ్ తన తల్లితో పాటు వెళ్ళాడు. పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో మనోజ్ ఒక 30 మంది బౌన్సర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచు విష్ణు ఒక 40 మందికి బౌన్సర్స్ ని నియమించుకుంటున్నాడు. మనోజ్ వెంట గన్ మెన్ కూడా ఉన్నాడట. విష్ణు సైతం విదేశాల నుండి వస్తున్నాడని, మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య సెటిల్మెంట్ జరగనుందని కథనాలు వెలువడ్డాయి.
Manchu Manoj
సయోధ్య కుదిరినట్లు లేదు. మనోజ్ ఫహడ్ షరీఫ్ సీఐ గురువారెడ్డిని కలిశాడు. తనతో పాటు మౌనికకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు, విష్ణు పేర్లు ఆయన ఫిర్యాదులో చేర్చలేదు. పది మంది దుండగులు మా ఇంటిపై దాడి చేశారు. కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయారు. వారిని నిలువరించే క్రమంలో నాకు గాయాలు అయ్యాయని, మనోజ్ కంప్లైంట్ చేశాడు.
మరోవైపు మోహన్ బాబు సైతం తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. రాచకొండ కమిషనర్ కి ఆయన ఫిర్యాదు చేశారు. కంప్లైట్ లో మనోజ్, మౌనికల పేర్లు చేర్చారు. కొడుకు కోడలు వలన అపాయం ఉందని, మోహన్ బాబు కేసు పెట్టారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలో విబేధాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి సైతం ఇవాళ హైదరాబాద్ వచ్చారు.సమస్యను ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు.
ఆస్తి తగాదాలే ఈ గొడవలకు కారణం అని సమాచారం. మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణుకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చారడని మనోజ్ ఆరోపణ. అలాగే శ్రీ విద్యా నికేతన్ తో పాటు మంచు కుటుంబానికి ఉన్న విద్యా సంస్థల మీద ఆధిపత్యం మంచు విష్ణుదే. తిరుపతిలో గల విద్యాసంస్థలు ఆ కుటుంబానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది.
విష్ణుని హీరోగా నిలబెట్టేందుకు మోహన్ బాబు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మనోజ్ తో సినిమాలు చేయడం లేదు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళు అవుతుంది. మెజారిటీ ఆస్తులు పంపకం అలానే ఉందట. వాటిపై ప్రయోజనాలు విష్ణు అనుభవిస్తున్నారట. లక్ష్మి, మనోజ్ ఈ విషయంలో మోహన్ బాబు పై అసహనంతో ఉన్నారట.