ఆ తెలుగు డైరక్టర్ ఆఫర్ ఇస్తా..రెండు నెలలు తనతో గడపమన్నాడు : మితా వశిష్ట్
అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతిని తెలుగు సినిమాలో నేనూ చూశాను.
Mita Vashisht
లైంగిక వేధింపులు.. ఇది వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇది. ఇది ఫలానా ఊరు, ఫలానా దేశం అనే తేడా లేకుండా ఈ సమస్య పరిమితులు లేకుండా విస్తరించింది. ఆ మధ్యన తోటి ఉద్యోగులు, పై అధికారులు మహిళలను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ మీ టూ అనే పెద్ద ఉద్యమమే నడిచింది. ఇందులో సినీ పరిశ్రమ కూడా భాగమైన తర్వాత చాలా మంది మహిళలు సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యలను బయట పెట్టారు.
Mita Vashisht
ఇంతకాలం గుట్టుగా ఉంటూ వచ్చిన సమస్యలు బయట పడటంతో ఒక్కసారి సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లోనూ ఉంది. కానీ మీడియా కారణమో, మరేదైనా కారణమో ఏమో కానీ.. సినీ పరిశ్రమపైనే ఫోకస్ ఎక్కువైందనేది నిజం. అనేకమంది ఆర్టిస్టు లు, హీరోయిన్స్ అందరూ సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న సమస్యలపై గొంతు విప్పి మాట్లాడుతున్నారు.
Mita Vashisht
‘‘టాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతిని తెలుగు సినిమాలో నేనూ చూశాను. చాలా మంది మహిళలు కాస్టింగ్ కౌచ్ సమస్యతో బాధపడుతున్నవారే. అయితే నిజాయతీగా, నిక్కచ్చిగా మాట్లాడటంతో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా మందికి ఎదురు కాలేదు. సినిమా పరిశ్రమలోనే కాదు. అన్నిచోట్ల మహిళలకు ఇలాంటి ఇబ్బందులున్నాయి’’ అని అనుష్క వంటి తెలుగు హీరోయిన్స్ సైతం గతంలో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటి మితా వశిష్ట్ కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Mita Vashisht
మితా వశిష్ట్ మాట్లాడుతూ “నా మొదటి రెండు చిత్రాలైన సిద్ధేశ్వరి (1989) మరియు కస్బా (1990)లో నేను పూర్తి నగ్న సన్నివేశాలు చేశాను. దర్శకుడి నిజాయితీతో పాటు సినిమా విషయంలోనూ నేను పని చేస్తాను. నాకు ప్రధాన పాత్రలు వచ్చినప్పుడు నేను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి కొన్ని షాకింగ్ సంఘటనలతో ముడిపడి ఉన్నాయి.
Mita Vashisht
ఆమె ఒక షాకింగ్ సంఘటనను వివరిస్తూ ఓ తెలుగు దర్శకుడుపై కామెంట్స్ చేసింది. “తెలుగు నుండి ఒక దర్శకుడు నన్ను కాల్ చేసి చెన్నైలో కలిశాడు. ఆయన నాకు లీడ్ రోల్ ఆఫర్ చేశారు. ఆయన అవార్డ్ లు తెచ్చుకున్న దర్శకుడు. అతను నాకు పాత్రను ఆఫర్ చేశాడు. ఆ పాత్ర అద్బుతమైనది అని చెప్పారు. కానీ నేను అతనితో రెండు నెలలు కలిసి ఉండాలని కండీషన్ పెట్టారు. నాకు మొదటి అర్దం కాలేదు. ఆ తర్వాత నేను అతనితో చెప్పాను, 'బుల్‌షిట్, మీ పాత్రను మీ దగ్గరే ఉంచుకోండి'! నాకు సెకండ్ థాట్ కూడా లేదని చెప్పేసాను."
Mita Vashisht
ఆమె కంటిన్యూ చేస్తూ..., “ఆ డైరక్టర్ ఇంగ్లీషు కొంచెం ఇబ్బందిగా ఉంది. దాంతో రెండు నెలలు ఉండాలనగానే నాకు ఇక్కడ భాష రాదు కాబట్టి... అతను భాష నేర్చుకోవడానికి నేను రెండు నెలలు ఉండవలసి ఉంటుందని నేను అనుకున్నాను. అదే అడిగాను. వెంటనే అతను , 'అలాంటిదేమీ , కాదు, మీరు నాతో గడపాలి, జీవించాలి' అని క్లారిటీ ఇచ్చాడు.
Mita Vashisht
మితా వశిష్ట్ చెప్తూ.., “ఆ డైరక్టర్ ఆఫర్ చేసింది ఒక ప్రధాన పాత్ర కావచ్చు..నాకు పేరు రావచ్చు. అయినా నేను ఆ డైరక్టర్ ప్రపోజల్ ని ఇష్టపడకపోవడంతో నేను తప్పుకున్నాను. అతను తెలుగు ఇండస్ట్రీలో హాట్ షాట్ కావచ్చు, గొప్పవాడు కావచ్చు. అతని హీరోయిన్లు అవార్డులు గెలుచుకోవచ్చు. కానీ నేను పెద్దగా పట్టించుకోను. నాకు నటన కళ ఇష్టమే కానీ కొన్నింటికి లొంగలేము. నేను చాలా గొప్ప దర్శకులతో పనిచేసాను. వారితో ఎక్సపీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది, అది కూడా పరస్పర గౌరవాలతో, నా రూల్స్ ప్రకారం వాళ్లకు కావాల్సిన విధంగా ముందుకు వెళ్తాం ” అంది.
Mita Vashisht
''ప్రముఖ నిర్మాతలు, దర్శకులుతో కలిసి పనిచేయడం వల్ల నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నాననేది నిజం. అయితే నేను తొలిరోజులను మిస్ అవుతున్నాను. అయితే ఇంట్రస్టింగ్ విషయం విషయం ఏమిటంటే నేను ఏ జానర్‌కైనా సరిపోతాను. తాల్ (1999) వంటి చిత్రంలో నేను భాగమయ్యానని చెప్పుకోవటానికి గర్వపడతాను . ఇప్పటికీ జనాలు మరిచిపోని పాత్ర అది. కొంతమంది నటీనటులు ప్రతి జోనర్‌కి సరిపోలేరు. వారు ఒక జానర్ తో సౌకర్యవంతంగా ఉంటారు. నేను అలాంటిదాన్ని అయితే కాదు అయితే నాకు కెమెరా ముందు ఉండటమంటే చాలా ఇష్టం. ."