- Home
- Entertainment
- హైపర్ ఆది జాతకంలో దోషం.. వృద్ధురాలిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్..
హైపర్ ఆది జాతకంలో దోషం.. వృద్ధురాలిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్..
`జబర్దస్త్` కమెడియన్ హైపర్ ఆది.. నలభై దాటినా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం జాతకంలో దోషం ఉందట. దీంతో ఓ సాహసానికి సిద్ధమయ్యాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
photo credit-sridevi drama company promo
`జబర్దస్త్` కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. పాపులర్‌ని చేసింది. అలా హైపర్ ఆది కూడా పాపులర్ అయ్యాడు. స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. నటుడిగానే కాదు, రాజకీయ నాయకుడిగానూ మారాడు. పవన్ కళ్యాణ్ జనసేనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు.
photo credit-sridevi drama company promo
ఇదిలా ఉంటే హైపర్ ఆదికి నలభై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరి మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా అనే డౌట్లు వస్తున్నాయి. అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తేలిపోయింది. ఆయన జాతకంలో దోషం ఉందట. ఆ దోషం పోవాలంటే ఓ ఉపాయం చెప్పాడు జ్యోతిష్యుడు.
photo credit-sridevi drama company promo
ఆ ఉపాయం ఏంటంటే ముందుగా వృద్ధురాలిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ముసలావిడని పెళ్లి చేసుకున్న తర్వాతనే మళ్లీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని జ్యోతిష్యుడు చెప్పడంతో కంగుతిన్న హైపర్ ఆది ఎట్టకేలకు పెళ్లికి సిద్దమయ్యాడు. ఆయన కోసం పెళ్లి చూపులు జరిగాయి. వృద్ధురాళ్లు ముగ్గురు నలుగురు వచ్చారు. మొదట వచ్చిన ఆమె బాగానే ఉంది, కానీ ఆమెని తిరస్కరించాడు హైపర్ ఆది. హనీమూన్ ఎక్కడికి వెళదామంటే బేగం పేట ఆసుపత్రికి వెళ్దామంటూ ఎటకారంగా కామెంట్లు చేశారు.
photo credit-sridevi drama company promo
ఆ తర్వాత మరో వృద్ధురాలిని తీసుకొచ్చారు. ఆమె రావడం రావడంతో పాటందుకుంది. హైపర్ ఆది జాతకం మొత్తం చెప్పేసింది. ఆయన ఎలా ఉంటాడో పాట రూపంలో చెప్పి అమ్మా నాకు ఈయన వద్దు అంటూ తెగేసి చెప్పేసింది. దీంతో ఆదికి, పక్కన ఉన్న రష్మికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
photo credit-sridevi drama company promo
ఆ తర్వాత మరో బ్యాచ్ దిగింది. ఇందులో ముగ్గురు లేడీస్ వచ్చారు. `కోట బొమ్మాళి` సినిమాలోని `లింగిడి లింగిడి` పాటకు అదిరిపోయే డాన్సులు వేశారు. అయితే వారి డాన్సులకు ఫిదా అయిన హైపర్ ఆది.. అందులో ఒక వృద్ధురాలికి కనెక్ట్ అయ్యాడు ఆమెని చేసుకునేందుకు ఓకే చెప్పాడు. తీరా చూస్తే ఆమె ఆమె కాదు, ఆయన. దీంతో ఆదికే కాదు, అందరికి ఫ్యూజులు ఔట్ అయ్యాయి.
photo credit-sridevi drama company promo
ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలోని మ్యాటర్. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో రష్మి, ఇంద్రజలపై ఆది వేసిన పంచ్‌లు అదిరిపోయింది. హైలైట్‌గా నిలిచింది. కానీ అది వారికి అర్థం కాకపోవడం మరో హైలైట్. ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ఈ షోకి రష్మి గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, ఇంద్రజ జడ్జ్ గా ఉన్నారు.