- Home
- Entertainment
- Mirai day 12 Collection: `మిరాయ్` 12 రోజుల కలెక్షన్లు, నాన్ స్టాప్ దూకుడు.. పవన్ కళ్యాణ్ కోసం త్యాగం
Mirai day 12 Collection: `మిరాయ్` 12 రోజుల కలెక్షన్లు, నాన్ స్టాప్ దూకుడు.. పవన్ కళ్యాణ్ కోసం త్యాగం
Mirai day 12 Collections: తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన `మిరాయ్` మూవీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. మరి ఈ సినిమా 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందనేది తెలుసుకుందాం.

`మిరాయ్` బాక్సాఫీసు వద్ద రచ్చ
తేజ సజ్జా హీరోగా నటించిన `మిరాయ్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ చిత్రం రెండో వారంలోనూ మంచి వసూళ్లని రాబడుతోంది. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పడిపోయాయి. కానీ ప్రతి రోజు రెండు కోట్లకుపైగానే గ్రాస్ వస్తుండటం విశేషం. ఈసినిమాకి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే భారీగా వసూలు చేస్తుందని భావించారు. ఈజీగా రెండు వందల కోట్లు దాటేస్తుందని భావించారు. కానీ ఆ విషయంలో డిజప్పాయింట్ చేసింది.
`మిరాయ్` 12 రోజులు వసూళ్లు
సినిమా విడుదలై 12 రోజులవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.140కోట్లు వసూలు చేసిందట. ఈ విషయాన్ని చిత్రం బృందం వెల్లడించింది. బాక్సాఫీసు వద్ద `మిరాయ్` రచ్చ అంటూ వెల్లడించింది. ఈ లెక్కన ఈ మూవీకి ఓవరాల్‌గా మరో పది కోట్లు వసూలు చేస్తే ఎక్కువ. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇక ఈ రోజుతో `మిరాయ్` కలెక్షన్లు భారీగా పడిపోతాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి నుంచే `ఓజీ` సందడి స్టార్ట్ అవుతుంది.
`ఓజీ` కోసం `మిరాయ్` థియేటర్లు
`ఓజీ` మూవీకి పాజిటివ్ టాక్ వస్తే `మిరాయ్` కలెక్షన్లకి ఎండ్ కార్డ్ పడబోతుందని చెప్పొచ్చు. అయితే `ఓజీ` సినిమా కోసం, పవన్ కళ్యాణ్ కోసం `మిరాయ్` థియేటర్లు ఖాళీ చేస్తున్నారు. ఈ మూవీ థియేటర్లని పవన్ కళ్యాణ్ మూవీకి త్యాగం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌పై గౌరవంతో తన సినిమా థియేటర్లని ఓజీకి కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. గురువారం మొత్తం థియేటర్లని `ఓజీ` మూవీకి కేటాయించనున్నారు. శుక్రవారం నుంచి మళ్లీ `మిరాయ్` సినిమాకి కేటాయిస్తారు. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
డబుల్ ప్రాఫిట్‌లోకి `మిరాయ్`
`మిరాయ్` మూవీ ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. ఈ సినిమాకి బిజినెస్ చాలా తక్కువ. కేవలం రూ.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.70కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. ఈ మూవీ ఇప్పుడు డబుల్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ దాటి, డబుల్ ప్రాఫిట్ వసూలు చేసింది. అంటే రూ.30కోట్లకుపైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించిందని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ రావడంతో విశ్వప్రసాద్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
`మిరాయ్` కథ ఇదే
`మిరాయ్` కథేంటంటే.. అశోకుడు కళింగ యుద్ధం అనంతరం రియలైజ్ అయి, తాను దేవతల నుంచి పొందిన శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షప్తం చేస్తారు. వాటిని ఆయా యోధులకు అప్పగిస్తారు. ఆ యోధులు తరతరాలుగా ఆ గ్రంథాలను కాపాడుతూ వస్తుంటారు. ఆ గ్రంథాలపై అసురుడైన మహబీర్(మంచు మనోజ్) కన్నుపడుతుంది. ఒక్కో గ్రంథం దక్కించుకుంటూ వస్తాడు. అమరత్వం కలిగిన చివరి గ్రంథం కోసం అన్వేషిస్తుంటాడు. ఆయన్ని అడ్డుకోవడానికి హీరో వేద(తేజ సజ్జా) ఏం చేశాడు? వేద ఎలా పోరాడాడు? తన శక్తిని ఎలా పొందడనేది ఈ మూవీ కథ. అంతిమంగా ధర్మానికి ఆపద వస్తే దేవుడే ప్రత్యక్షమవుతాడని, అధర్మాన్ని నాశనం చేస్తాడని చెప్పే కథ ఇది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతూ అలరించింది. అయితే సెకండాఫ్‌లో కాస్త డల్ కావడంతో ఆ ఇంపాక్ట్ సినిమాపై పడింది. `హనుమాన్` తరహలో సెకండాఫ్, క్లైమాక్స్ వర్కౌట్ అయితే మూవీ పెద్ద రేంజ్ హిట్ అయ్యేది. ఈ చిత్రంలో తేజ సజ్జాతోపాటు మంచు మనోజ్ విలన్‌గా చేశారు. రితికా నాయక్, శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు, కిశోర్ తిరుమల, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈచిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.