- Home
- Entertainment
- jr Ntr: అంబటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. బూతు ఆడియో లీక్.. నెట్టింట దుమారం
jr Ntr: అంబటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. బూతు ఆడియో లీక్.. నెట్టింట దుమారం
ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి వైసీపీ నేతలు, మంత్రి అంబటి రాంబాబు గురయ్యారు. తాజాగా చంద్రబాబు, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌పై మంత్రి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.

ఆంధ్రాలో రోజుకో అంశం వివాదం అవుతోంది. మొన్నటి వరకూ టిక్కెట్ రేట్లు గొడవలు, ఆ తర్వాత స్త్రీలపై అఘాయిత్యాలు.. ఇలా వరసగా ఏదో అంశం రోజూ హైలెట్ అవుతోంది. కాగా ప్రస్తుతం మరో అంశం తెరమీదకొచ్చింది. ఈ ఘటనతో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..
మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్(Jr Ntr)ను ఉద్దేశించి.. ఆయన జూనియర్ ఎన్టీఆర్ .. బోనియర్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయడంపై ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి నోటి దురుసుకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ కామెంట్స్ చేయడం వెనుక కారణమేమంటే. ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం గురించి మీడియాలో మాట్లాడుతూ.. . టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి రాంబాబు..ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, లోకేష్. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఎన్టీఆర్ ను అవమానించేలా అంబటి మాట్లాడారని, అందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేస్తూ ట్రెండింగ్ లో నిలిచేలా ట్రోల్స్, ట్వీట్స్ చేస్తున్నారు.
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబును కాంబాబు, సుకన్య అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గంటలో చెబుతావో.. అరగంటలో చెబుతావో నీ ఇష్టం.. క్షమాపణలు మాత్రం చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంబటి రాంబాబు ఓ మహిళతో అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్‌లో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది షేర్ చేయగా.. అంబటి వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ పై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ కారణంగానూ ఆయన అభిమానులు అంబటి రాంబాబు వాయిస్ ఉన్న వీడియోను ట్రోల్ చేస్తూ.. తమ అభిమానాన్ని వెళ్లగక్కుతున్నారు.అడ్డంగా వ్యభిచారంలో దొరికిన అంబటి రాంబాబు అంటూ హెడ్డింగులు పెట్టి ఆడియో టేప్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ వైరల్‌గా మారింది.
ఆ ఆడియో టేప్ లో మహిళతో మగ వ్యక్తి (మంత్రి అంబటి రాంబాబుగా చెప్పబడుతున్న) ఫోన్‌లో మాట్లాడుతూ.... మీరు ఎన్ని గంటల వరకు ఫ్రీ అని మహిళ అడిగితే.. నేను సాయంత్రం మీటింగ్‌కు వెళ్తున్నాను అబ్బా అని సదరు వ్యక్తి (అంబటిగా భావిస్తున్న గొంతు) అని అన్నాడు. మీటింగ్ ఎన్ని గంటలకు అని మహిళ అడిగితే.. మూడు, నాలుగు గంటలకు మీటింగ్. ఈ నైట్‌కు కావాలి అని సదరు వ్యక్తి అన్నాడు. దాంతో మీరు గుంటూరుకు రారా.. లేదు.. అక్కడైతే ఓకేనా అంటే.. అవును అని అన్నాడు.
నేను ఆ అమ్మాయిని పంపిస్తాను.. మీకు ఏం కావాలంటే అది చేయించుకోండి అంటే.. నీవు రావా అని అడిగాడు. లేదు అని మహిళ సమాధానం చెప్పారు. ఏం చేస్తారు.. ఎవరా అమ్మాయి అంటే.. ముస్లిం అమ్మాయి. మసాజ్ చేస్తారు అని మహిళ సమాధానం చెబితే.. బాగుంటుదా అని మగ గొంతు అడిగితే.. బాగుంటుది అని మహిళ సమాధానం చెప్పింది. అయితే మగ గొంతు అంబటిదా లేదా మార్ఫింగ్‌దా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
kgf 2
దీనికి తోడు గుంటూరు జిల్లా తెనాలిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైకాపా నేత మధ్య ఇటీవల భారీ గొడవ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులు తెనాలిలో ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నిస్తే.. వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా దీనికి తోడు కావడంతో అగ్ని ఆజ్యం పోసినట్లియింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
ఇక అంబటి రాంబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చోటుచేసుకొన్న వివాదంపై టీడీపీ నేతలు స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సతీమణిపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించారు. ప్రస్తుత వివాదంలో ఎన్టీఆర్‌కు టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు.