‘పుష్ప’లో వీఎఫ్ఎక్స్ మాయా.. లారీ ఛేసింగ్ సీన్ లో లారీనే లేదుగా.. వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పుష్ఫ : ది రైజ్’. ఈ చిత్రంలోని లోకేషన్స్ అన్నీ అద్భుతంగా కనిపించాయి. అయితే వాటన్నింటినీ వీఎఫ్ఎక్స్ ద్వారా చూపించారు. ఒకసారి ఏది రియల్.. ఏదీ వీఎఫ్ఎక్స్.. ఎక్కడెక్కడ గ్రాఫిక్ వర్క్ ఉందో తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప : దిరైజ్’. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఏపీలోని చిత్తూరులో గల శేషాచలం అడవుల్లో సినిమాను చిత్రీకరించారు. అయితే ఈ సినిమా మేకింగ్ లో భాగంగా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ను కూడా ఉపయోగించారు.
‘పుష్ప : ది రైజ్’ చిత్రం ఫస్ట్ ఆఫ్ లోని లారీ చేసింగ్ సీన్ ప్రేక్షకులందరినీ కట్టిపడేంది. అల్లు అర్జున్ యాక్షన్ కు ఫిదా అయ్యారు. అయితే అసలు విషయం తెలిస్తే ఇంకా షాక్ అవుతున్నారు. అసలు ఈ సీన్ లో లారీనే లేకుండా చిత్రీకరించారు. ఓ ట్రాలీపై లారీ ముందు భాగం డోర్ వరకు సెట్ ను నిర్మించారు. ఆ తర్వాత కావాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించి. మిగిలిన దాన్ని వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) రూపంలో చూపించారు. ఎక్కడా ఇంత తేడా రాకుండా గ్రాఫిక్ వర్క్ ను అద్భుతంగా పూర్తి చేశారు.
ఈ చిత్రంలో ఆకట్టుకునే మరో సన్నివేశం పుష్ప రాజ్ గోడౌన్ లోని ఎర్రచందనం సరుకును పక్కనే పారుతున్న నదిలోకి పంపించేది. ఈ సన్నివేశంలోనూ గ్రాఫిక్ వర్క్ వండర్ అనిపిస్తోంది. కథ ప్రకారం అడవుల్లో సాగుతున్న ఈ సన్నివేశాన్ని సిటీలోనే చిత్రీకరించినా.. విజువల్ ఎఫెక్ట్స్ తో బ్యాక్ గ్రౌండ్ ను మార్చేశారు.
మరో సీన్ లో పోలీసులకు ఎర్రచందనం దుంగల జాడ తెల్వడంతో.. అల్లు అర్జున్ స్పాట్ వద్ద నిల్చోని సరుకును తప్పించే ఆలోచనలో ఉంటారు. వీఎఫ్ఎక్స్ కు ముందు బ్యాక్ గ్రాండ్ లో ఎలాంటి చెట్లు, అడవి ప్రాంతం కనిపించడం లేదు. ఈ సీన్ లోనూ మేకర్స్ వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించడంతో దట్టమైన అటవీని బ్యాక్ గ్రౌండ్ లో చూడవచ్చు.
అలాగే ఇదే సీన్ తర్వాత అల్లు అర్జున్ దుంగలను తప్పించే క్రమంలో గాల్లోకి ఎగిరే సీన్ లోనూ గ్రాఫిక్ వర్క్ కనిపిస్తోంది. ఫొటోలను పోల్చి చూస్తే రీల్ కు.. రియల్ కు ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతోంది. మొత్తంగా ఇక్కడా నేచురల్ గానే అనిపించేలా టెక్నీషియన్స్ శ్రద్ధవహించారు.
ఇక ఈ చిత్రంలో సంగీత ప్రియులకు ఎంతగానో నచ్చిన సాంగ్ ‘శ్రీవల్లి’. సాంగ్ తో పాటు.. కొరియోగ్రఫీ కూడా అదిరిపోయింది. అల్లు అర్జున్ కొండపై వేసి సిగ్నేచర్ స్టేప్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ చిత్రీకరణలోనూ బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్ర యూనిట్ వీఎఫ్ఎక్స్ కు వెళ్లక తప్పలేదు. ఖాళీ కొండపై చిత్రీకరించిన రఫ్ వీడియోకు.. విజువల్ ఎఫెక్ట్ తోవడంతో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఆ తేడాను మీరే గమనించవచ్చు.