గూస్ బంప్స్ తెప్పించే సర్ప్రైజ్.. రాంచరణ్, సుకుమార్ మూవీ మొదలైందా ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రెండవ చిత్రం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది అనే రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రెండవ చిత్రం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది అనే రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అదేంటి సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 కార్యక్రమాలతో.. రాంచరణ్ శంకర్ చిత్రంతో బిజీగా ఉన్నారు కదా.. మరి ఈ రూమర్స్ ఏంటి అనే సందేహం రావచ్చు.
వివరాల్లోకి వెళితే.. నిజంగానే రాంచరణ్, సుకుమార్ కాంబోలో రెండవ చిత్ర షూటింగ్ ప్రారంభం అయినట్లు స్వయంగా క్రేజీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రివీల్ చేశారు. సుకుమార్, చరణ్ కాంబోలో ఇప్పటికే రంగస్థలం లాంటి బ్లాస్టింగ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ బన్నీతో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప చేపట్టారు. రాంచరణ్ కి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో మరోసారి నటించాల్సి ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాబు సిరిల్ మాట్లాడుతూ.. సుకుమార్, రాంచరణ్ మూవీ ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. అంతే కాదు ఆ సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా వచ్చింది అంటూ బాంబు పేల్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాంచరణ్ కండలు తిరిగే దేహం పెంచారు. పర్ఫెక్ట్ గా నాకు సినిమాకి కూడా అదే బాడీ కావాలి అని సుకుమార్ అన్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ముందే అదే బాడీతో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ పూర్తి చేశారు.
7 నుంచి 10 నిమిషాల పాటు ఉండే ఈ సీన్ అద్భుతంగా వచ్చింది అని సాబు సిరిల్ రివీల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే సుకుమార్ రాంచరణ్ మూవీ ప్లానింగ్ మొదలైందనేది స్పష్టం.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి పరోక్షంగా ఈ విషయం గురించి చెప్పారు. సుకుమార్, రాంచరణ్ మూవీ ఓపెనింగ్ సీన్ గురించి నాకు తెలుసు. చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లలో కూర్చునే విధంగా ఉంటుంది అని రాజమౌళి కొన్ని నెలల క్రితమే తెలిపారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ మూవీ తర్వాత రాంచరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడో క్లారిటీ లేదు. ఈ లోపు సుక్కు పుష్ప 2 పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వీరిద్దరి కాంబోలో మూవీ షురూ అవుతుంది.