నాగ చైతన్య 'తండేల్' కథలో కీ ట్విస్ట్ లీక్.. సాయి పల్లవితో అలా చేయిస్తారా, ఫ్యాన్స్ గుండెల్లో గునపం దిగినట్లే
తండేల్ కథ అవుట్ లైన్ ఏంటో తెలిసిపోయింది. దేశభక్తి, ప్రేమ ఈ చిత్రంలో బలంగా కనిపించబోతున్నాయి. కథలో కీ ట్విస్ట్ లీకైనట్లు చెబుతున్నారు. ఈ ట్విస్ట్ ఆసక్తికరంగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నారు. చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదలైన టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ లో చిక్కుకున్న సంఘటన గతంలో జరిగింది. శ్రీకాకుళంకి చెందిన జాలరులు గతంలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడ ఆర్మీకి చిక్కారు. కొంతకాలం తర్వాత విడుదలయ్యారు. అదే పాయింట్ తో చందుముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.టీజర్ లో కూడానా విషయాన్ని రివీల్ చేశారు.
దీనితో తండేల్ కథ అవుట్ లైన్ ఏంటో తెలిసిపోయింది. దేశభక్తి, ప్రేమ ఈ చిత్రంలో బలంగా కనిపించబోతున్నాయి. నాగ చైతన్యకి జోడిగా ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. కథ అవుట్ లైన్ తెలిసిపోవడంతో ఎవరికి వారు కంప్లీట్ స్టోరీ ఊహించేసుకుంటున్నారు. అయితే తండేల్ కథకి సంబంధించిన ఒక బలమైన ప్రచారం మాత్రం వైరల్ గా మారింది.
కథలో కీ ట్విస్ట్ లీకైనట్లు చెబుతున్నారు. ఈ ట్విస్ట్ ఆసక్తికరంగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తండేల్ కథ ట్రాజిడీ ఎండింగ్ తో ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో జరిగుతున్న ప్రచారం యొక్క సారాంశం. తండేల్ టీజర్ చివర్లో నాగ చైతన్య.. సాయి పల్లవిని ఉద్దేశిస్తూ బుజ్జితల్లే వచ్చేస్తున్నా కదే.. నవ్వవే అంటూ డైలాగులు చెబుతాడు.
అయితే ఇక్కడ లీకైనట్లు చెప్పబడుతున్న ట్విస్ట్ ఏంటంటే నాగ చైతన్య తిరిగి వచ్చేసరికి సాయి పల్లవి బ్రతికి ఉండదట. కథలో భాగంగా ఆమె చనిపోతుందని అంటున్నారు. కాస్త ఇదే తరహా ఎండింగ్ సీతా రామం చిత్రంలో ఉంటుంది. కాకపోతే అక్కడ హీరో మరణిస్తాడు. కానీ తండేల్ చిత్రానికి ఇంత హైప్ ఇచ్చి ట్రాజడీ ఎండింగ్ తో ముగిస్తే ఫ్యాన్స్ గుండెల్లో గునపం దిగినట్లే అని అంటున్నారు.
ఒకవేళ ఇదే కథతో చందుముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే వెంటనే మార్చాలని కూడా సలహాలు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రంలో సాయి పల్లవి, చైతు కెమిస్ట్రీ ఒక రేంజ్ ఓ ఉంటుంది. పోరాట సన్నివేశాలు కూడా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా చిత్రీకరిస్తున్నారట. ఇంత చేసి చివర్లో సాయి పల్లవి పాత్రని చంపేయడం అంటే మామూలు రిస్క్ కాదని అంటున్నారు. మరికొందరు చైతు ఫ్యాన్స్.. ఒక వేళ ఈ పుకారు నిజమైతే అంత పెద్ద ట్విస్ట్ ని ఈజీగా లీక్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటిది ఏమీ ఉండదని అంటున్నారు.