వైరల్: రెడ్ బికినీలో మిల్కీ బ్యూటీ
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ట్యాగ్ అందుకున్నా సక్సెస్‌ల విషయంలో మాత్రం చాలా వెనుకబడింది హాట్ బ్యూటీ తమన్నా. బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా తమన్న కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. గ్లామర్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగు, తమిళ సినిమాల్లో ఒకే సారి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా రెండు భాషల్లోనూ టాప్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది.
తెలుగులో నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది ఈ బ్యూటీ.
బాహుబలి సినిమాతో తమన్నా పోషించిన అవంతిక పాత్ర ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది.
హోమ్లీగా కనిపిస్తునే గ్లామర్ డోస్ చూపిస్తున్నా తమన్నాకు అవకాశాలు మాత్రం రావటం లేదు.
గత ఏడాది తమన్నా కెరీర్ బాగానే సాగింది. 2019లో తమిళ్‌లో మూడు సినిమాల్లో నటించింది తమన్నా. హిందీలోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ.
తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న తమన్నా `ఆహా` కోసం సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తోంది. అంతేకాదు ఇందుల్లో ఒక్కో ఎపిసోడ్‌కు గాను 10 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ బ్యూటీ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎఫ్ 2 సినిమాలో హాట్ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ లాక్ డౌన్ సమయంలో తెగ వైరల్ అవుతున్నాయి.