MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎంజీఆర్‌ ని రెండు నెలలు వెయిట్‌ చేయించిన ఎస్పీ బాలు, ఎందుకో తెలుసా?

ఎంజీఆర్‌ ని రెండు నెలలు వెయిట్‌ చేయించిన ఎస్పీ బాలు, ఎందుకో తెలుసా?

లెజెండరీ సింగర్‌ ఎస్.పి.బాలసుబ్రమణ్యం తన సినిమాకి పాట పాడాలని ఎంజీఆర్ ఎందుకు రెండు నెలలు వేచి చూశారో తెలుసా? వామ్మో ఇంత పెద్ద కథ ఉందా?

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 23 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
MGR, SPB

MGR, SPB

గానగాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట పాడితో అన్ని మరిచిపోయి అలా ఉండిపోతాం. ఆయన గాత్రంలోని మాధుర్యం అంత గొప్పది.   ఆయన స్వరంతో మెరిసిన పాటలు కోకొల్లలు. అలాంటి సంగీత ధురంధరుడైన ఎస్.పి.బి., ఆయన తన స్వరంతో మొదటిసారిగా పాడిన తమిళ పాట ‘ఆయిరం నిలవే వా’. ఎం.జి.ఆర్ నటించిన ‘అడిమై పెణ్’ చిత్రం కోసం ఈ పాట పాడారు.

బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

25
SPB

SPB

ఈ పాట వెనుక ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది. ఒకరోజు ఎవిఎం స్టూడియోలో ఎంజీఆర్ తన సినిమా గురించి చర్చిస్తుండగా, పక్కనే ఉన్న సెట్‌లో ఒక తెలుగు సినిమా పాట కంపోజింగ్ జరుగుతోంది. అందులో ఎస్.పి.బి. పాడుతున్నారు. ఆయన స్వరం విని ముగ్ధుడైన ఎం.జి.ఆర్ ఎవరీయన ఇంత అద్భుతంగా పాడుతున్నారని అడిగారట.

35

వెంటనే ఎస్.పి.బి.ని పిలిపించి తన సినిమాలో తప్పకుండా పాడాలని కోరారు ఎంజీఆర్. తమిళంలో తన మొదటి పాటే ఎంజీఆర్‌కి అంటూ సంతోషపడిన ఎస్.పి.బి. అందుకు అంగీకారం తెలిపి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎస్.పి.బి.కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీంతో ఆయన ఆ పాట పాడలేకపోయారు.

45

పాట పాడలేకపోయానే అని ఎస్.పి.బి. బాధపడుతుంటే, ఎంజీఆర్ నుంచి సమాచారం వచ్చింది. నువ్వు బాధపడకు. ఈ పాట నువ్వే పాడాలి. నీ ఆరోగ్యం కుదుటపడే వరకు ఆగుతాం, ఆ తర్వాత రికార్డింగ్ పెట్టుకుందాం అని అన్నారట ఎంజీఆర్.

55

అలా ఎస్.పి.బి. తమిళంలో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన పాటే ఎంజీఆర్ ‘అడిమై పెణ్’ చిత్రంలోని ‘ఆయిరం నిలవే వా’. ఎస్.పి.బి. కోసం ఎంజీఆర్ దాదాపు రెండు నెలలు వేచి చూసి, ఆ తర్వాత రికార్డ్ చేయించిన ఈ పాట నేటికీ తమిళ సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌
Recommended image2
Kavalan Movie: రోజాని చూసి షాకైన విజయ్! ఆ ఒక్క విషయం నమ్మలేకపోయాడు.. ఫ్లాష్‌బ్యాక్ సీక్రెట్స్!
Recommended image3
Spirit Update: `స్పిరిట్‌`లో వివేక్‌ ఒబెరాయ్‌.. అంచనాలకు అందని సందీప్‌ రెడ్డి ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved