MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • MGR: భాగ్యరాజ్‌ హీరో కావడం వెనుక మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టోరీ.. విజయకాంత్‌ని పక్కన పెట్టిన ఎంజీఆర్‌

MGR: భాగ్యరాజ్‌ హీరో కావడం వెనుక మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టోరీ.. విజయకాంత్‌ని పక్కన పెట్టిన ఎంజీఆర్‌

ఎంజీఆర్‌ హీరోగా ఆగిపోయిన సినిమా కోసం విజయకాంత్‌ని హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ టీమ్‌కి ఎంజీఆర్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు. తన ఇమేజ్‌ ఎవరికీ ఇవ్వను అని చెప్పి విజయకాంత్‌ని పక్కన పెట్టారు. భాగ్యరాజ్‌కి బంపర్‌ ఆఫర్‌ వరించింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 09 2026, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భాగ్యరాజ్‌ లైఫ్‌ని మార్చేసిన ఎంజీఆర్
Image Credit : our own

భాగ్యరాజ్‌ లైఫ్‌ని మార్చేసిన ఎంజీఆర్

ఎంజీఆర్‌ ఒకప్పుడు తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణించిన విషయం తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్‌ అయ్యారు. సీఎంగా విశేష సేవలను అందించారు. అయితే తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ సినిమా విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మూవీ తాను హీరోగా నటించగా, అది మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాని విజయకాంత్‌తో చేయాలనుకున్నారు. కానీ ఎంజీఆర్‌ పెద్ద షాక్‌ ఇస్తూ, విజయకాంత్‌ని పక్కన పెట్టి భాగ్యరాజ్‌ని హీరోని చేశాడు. దెబ్బకి ఆయన జీవితమే మారిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సీఎంగా బిజీగా ఉన్న ఎంజీఆర్
Image Credit : Asianet News

సీఎంగా బిజీగా ఉన్న ఎంజీఆర్

అసలేం జరిగిందంటే.. ఎంజీఆర్‌ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన నటిస్తున్న ఓ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లింది. ఆ నష్టం నుంచి నిర్మాతను గట్టెక్కించడానికి ప్రముఖ దర్శకుడు కె. భాగ్యరాజ్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఆగిపోయిన ఆ చిత్రంలో యాక్షన్ హీరో విజయకాంత్‌ను పెట్టి పూర్తి చేద్దామని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదన చివరికి ఎంజీఆర్ వద్దకు చేరడంతో కథ మొత్తం మలుపు తిరిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా ఆగిపోవడం వల్ల నిర్మాతకు రూ.15 లక్షల నష్టం వచ్చిందని భాగ్యరాజ్ తెలుసుకున్నారు. అందుకే, అప్పటికే చిత్రీకరించిన ఎంజీఆర్ సన్నివేశాలకు అనుగుణంగా కొత్త కథ రాసిస్తానని, విజయకాంత్ లాంటి యాక్షన్ హీరోతో సినిమా పూర్తి చేయమని నిర్మాతకు సలహా ఇచ్చారు.

34
విజయకాంత్ కాదు.. నువ్వే హీరో!
Image Credit : facebook

విజయకాంత్ కాదు.. నువ్వే హీరో!

ఈ విషయం తెలుసుకున్న ఎంజీఆర్ వెంటనే భాగ్యరాజ్‌ను పిలిపించి మాట్లాడారు. నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతోనే విజయకాంత్ పేరును సూచించానని భాగ్యరాజ్ వివరించారు. దీనికి ఎంజీఆర్ స్పందిస్తూ, "విజయకాంత్ ఎందుకు, ఆ పాత్ర నువ్వే చేయలేవా? నా ఇమేజ్‌ను ఇంకెవరికీ ఇచ్చే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్పినట్లు భాగ్యరాజ్ ఓ పాత ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఒకవేళ నువ్వు హీరోగా చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని, లేదంటే దాన్ని పక్కన పడేసి, నిర్మాతకు రావాల్సిన డబ్బులు తానే ఇచ్చేస్తానని ఎంజీఆర్ చెప్పడంతో భాగ్యరాజ్ ఆశ్చర్యపోయారు. ఎంజీఆర్ అంత గట్టిగా చెప్పడంతో, ఆ సినిమాలో హీరోగా నటించడానికి భాగ్యరాజ్ అంగకరించక తప్పలేదు. అదీ సంగతి.

44
కథలో మార్పులు.. బ్లాక్‌బస్టర్ హిట్
Image Credit : facebook

కథలో మార్పులు.. బ్లాక్‌బస్టర్ హిట్

ఎంజీఆర్ ఆదేశాలతో భాగ్యరాజ్ హీరోగా ఆ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. అయితే, భాగ్యరాజ్ సిద్ధం చేసిన కొత్త కథపై ఎంజీఆర్‌కు మొదట ఓ సందేహం కలిగింది. అసలు కథ ప్రకారం తన సోదరికి ఒక్కడే బిడ్డ అని, కానీ కొత్త కథలో డ్యూయల్ రోల్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత భాగ్యరాజ్ పూర్తి కథను వివరించగా, ఎంజీఆర్ సంతృప్తి చెంది సినిమా షూటింగ్‌ను స్వయంగా ప్రారంభించారు. శ్రీధర్ దర్శకత్వంలో ఎంజీఆర్, నంబియార్, లత ప్రధాన పాత్రల్లో 1977లో మొదలై ఆగిపోయిన 'అణ్ణా నీ ఎన్ దైవమ్' అనే చిత్రమే ఇది. భాగ్యరాజ్ మార్పులతో వచ్చిన ఈ కొత్త చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఇతర భాషల్లోనూ రీమేక్ అయింది. ఈ మూవీతో భాగ్యరాజ్‌ లైఫే మారిపోయింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Related Stories
Recommended image1
Mohan babu: మోహన్‌ బాబు కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఇదే.. దెబ్బకి తన భార్య వారం రోజులు మాటలు బంద్‌
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved