వెంకీ కుడుములకు ఆచార్య సెగ, ఆలోచనలో పడ్డ మెగాస్టార్, ఏం చేయబోతున్నారు..?
రెండు సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ గా మారిన వెంకీకుడుములకు ఆచార్య సెగ తగిలేట్టు కనిపిస్తోంది. చిరంజీవితో సినిమా ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసిన వెంకీకి.. సడెన్ గా నిరాశ తప్పేట్టు కనిపించడంలేదు.

మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలో పడ్డారు. ఆచార్య కొట్టిన దెబ్బకు ఉలిక్కి పడ్డారు మెగా హీరోలు. దాంతో ఎక్కడ పొరపాటు జరిగిందోచూసకుని రిపిట్ అవ్వకూడదకుంటున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ డైరెక్టర్ వెంకీ కుడుములపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆచార్య సినిమాపై చిరంజీవి ఎంతో నమ్మకం పెట్టుకుంటే దాని ఫలితం నిరాశ పరిచింది. దాంతో ఆయన ఆ తరువాత చేయనున్న సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అన్ని స్క్రిప్టులను అన్ని వైపులా నుంచి చెక్ చేసుకోవాలని డైరెక్టర్స్ అందరికీ మరీ మరీ చెప్పారట.
దాంతో ఎవరి ప్రాజెక్టుపై వాళ్లు ప్రత్యేకమైన దృష్టిని పెట్టినట్టుగా తెలుస్తోంది. . ఈ వరుసలో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ షూటింగ్ అయిపోవడంతో.. మరోసారి మార్పులు చేర్పులపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం.
Chiranjeevi was humiliated by this 'discrimination' in Delhi 33 years ago, now the actor has revealed the old incident
ఇక ఆ తరువాత బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య షూటింగ్ కూడా షురూ అవుతోంది. అటు మెహార్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక మెగాస్టార్ వార్నింగ్ తో ఈ దర్వకులంతా అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. అయితే వీరితో పాటు మెగాస్టార్ తో సినిమా చేయడానికి ఆ తరువాత లైన్లో వెంకీ కుడుముల ఉన్నాడు.
వెంకీ పూర్తి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడు. అయితే లైన్ చెప్పినప్పుడు ఓకే చెప్పిన చిరూ, స్క్రిప్ట్ విషయంలో సంతృప్తికరంగా లేనట్టు సమాచారం. చిరంజీవి స్టయిల్ ను పట్టుకోవడం వెంకీ కుడుములకు కష్టమవుతోందని టాక్. కొరటాల విషయంలోను అక్కడే తేడా కొట్టిందట. దాంతో వెంకీ కుడుముల విషయంలో చిరు ఆలోచనలో పడ్డట్టు సమాచారం.
అయితే వెంకీ మాత్రం ఎలాగైనా చిరంజీవిని కథతో మెప్పించి.. తనతో సినిమా చేయగలను అని నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు. గ్రిప్ ఏమాత్రం జారిపోకుండా జాగ్రత్త పడుతున్నాడట. మరి వెంకీ కుడుముల మెగాస్టార్ ను మెప్పించగలుగుతాడేమో చూడాలి.