చిరంజీవి కల కలగానే మిగిలిన వేళ.. ఇలాగైనా సంతృప్తి, ఆ రెండు చిత్రాలు..
దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించడం ఏ హీరోకైనా ఓ కల. అలాంటి అద్భుత అవకాశం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు దక్కింది. రాంచరణ్, శంకర్ క్రేజీ కాంబోలో నేడు చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించడం ఏ హీరోకైనా ఓ కల. అలాంటి అద్భుత అవకాశం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు దక్కింది. రాంచరణ్, శంకర్ క్రేజీ కాంబోలో నేడు చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి రాబోతున్న 50వ చిత్రం ఇది. తెలుగు వెండితెరపై దశాబ్దాల పాటు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం వహించిన చిరంజీవికి కూడా దక్కని ఛాన్స్ రాంచరణ్ కు దక్కింది. దీని వెనుక ఉన్న అసలు సంగతి ఏంటో తెలుసుకోవాల్సిందే.
సందేశాన్ని, కమర్షియల్ అంశాలని సమానంగా శంకర్ హ్యాండిల్ చేసినట్లు మరే దర్శకుడు చేయలేరు. శంకర్ దర్శకుడిగా మారే సమయానికి చిరంజీవి సౌత్ లో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. దీనితో శంకర్ తన తొలి చిత్రం జెంటిల్ మాన్ కథని మొదట నేరేట్ చేసింది చిరంజీవికే.
కానీ అప్పుడు చిరంజీవి శంకర్ కథని రిజెక్ట్ చేశారు. కట్ చేస్తే శంకర్ ఆ చిత్రాన్ని అర్జున్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఒకే ఒక్కడు చిత్రానికి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.
ఇక అప్పటి నుంచి చిరంజీవికి శంకర్ పై బలమైన నమ్మకం ఏర్పడింది. పలు వేదికలపై చిరు స్వయంగా మాట్లాడుతూ.. శంకర్ తెలుగువారితో కూడా సినిమా చేయాలి అని అన్నారు. తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో శంకర్ దర్శకత్వంలో నటించాలనే ఆయన కల కలగానే మిగిలిపోయింది.
కానీ చిరంజీవికి ఓ సంతృప్తి మాత్రం ఉంటుంది. తాను శంకర్ దర్శకత్వంలో నటించకపోయినా తన తనయుడు రాంచరణ్ కి ఆ అవకాశం దక్కింది అని చిరు తప్పకుండా సంతోషపడతారు.
గతంలో తాను రెండుసార్లు తెలుగులో సినిమా చేయలేకపోయానని శంకర్ 'ఐ' ఆడియో వేడుకలో అన్నారు. కమల్ హాసన్ ఇండియన్ 2 పక్కన పెట్టి మరీ శంకర్ ఈ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు, అవినీతికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
నేడు గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, జక్కన్న రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి కీలక పాత్రలో మెరవనుంది.