కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్: ప్రారంభంలోనే ఎందుకు ఆగిపోయింది?
రామ్ చరణ్ కెరీర్ ని మగథీర నెక్ట్స్ లెవిల్ కు తీసుకు వెళ్లింది. రాజమౌళి ఓ మ్యాజిక్ చేసారు.అప్పుడొచ్చిన కుర్ర హీరోల ని ఈ ఒక్క సినిమాతో దాటి పోయాడు చరణ్. అయితే ఆ తర్వాత ఏ సినిమా చెయ్యాలనేదే చిరంజీవి కు ఆలోచన పట్టుకుంది.
Megastar Chiranjeevi, Ram Charan ,K. Viswanath
రామ్ చరణ్ ఈ రోజున గ్లోబుల్ స్టార్ గా ఎదగారంటే దాని వెనుక తండ్రి చిరంజీవి ప్లానింగ్ ఉందనేది నిజం. కెరీర్ ప్రారంభం నుంచి ప్రతీ అడుగు ఆచి,తూచి వేస్తూ వచ్చారు చరణ్. తన కథలు తండ్రి ఓకే చేసిన తర్వాతే తను వినేవాడు మొదట్లో. ఎందుకంటే చిరంజీవికు ఉన్న కథా జడ్జిమెంట్ అలాంటిది.
అలాగే ఫలానా డైరక్టర్ తో చేస్తే నటుడుగా ఎలా ఎలివేట్ అవుతారు, ఏ డైరక్టర్ తో చేస్తే స్టార్ అవుతారనేది చిరంజీవి అనుభవంతో నేర్చుకున్న పాఠం. అవి కొడుకు కెరీర్ ప్లానింగ్ కు ఉపయోగపడ్డాయనటంలో సందేహం లేదు. అలా రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో తెలుగులో క్లాసిక్ డైరక్టర్ తో సినిమా ప్లాన్ చేసారు చిరంజీవి. అయితే అది ముందుకు వెళ్లలేదు. ఎవరా డైరక్టర్ , ఏమా కథ.
pawan kalyan, #Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
రామ్ చరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'మగధీర'. కెరీర్ ప్రారంభంలోనే అలాంటి సినిమా పడటంతో మాస్ లోకి పూర్తిగా వెళ్లిపోయారు చరణ్. 'చిరుత'గా రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మ్యాజిక్ చేసారు. కేవలం చిరంజీవి అభిమానుల దృష్టిలో మాత్రమే కాకుండా అందరూ కూడా చరణ్ నటన అదరగొట్టాడని మెచ్చుకున్నారు.
ఆ తర్వాత మగథీర నెక్ట్స్ లెవిల్ కు తీసుకు వెళ్లింది. రాజమౌళి ఓ మ్యాజిక్ చేసారు.అప్పుడొచ్చిన కుర్ర హీరోల ని ఈ ఒక్క సినిమాతో దాటి పోయాడు చరణ్. అయితే ఆ తర్వాత ఏ సినిమా చెయ్యాలనేదే చిరంజీవి కు ఆలోచన పట్టుకుంది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
మగధీరలో రామ్ చరణ్ అద్భుతంగా చేశాడనీ అయితే ఓ కొత్త ఇమేజ్ వచ్చిందని దానికి భిన్నంగా వెళ్లాలనుకున్నారు చిరంజీవి. అందుకోసం అల్లు అర్జున్ 'దేశముదురు' సూపర్ హిట్ తర్వాత 'పరుగు' చిత్రాన్ని తీసి అతని కెరీర్ బాలన్స్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ కనపడ్డాడు.
తన కొడుకు 'మగధీర' ఇచ్చే ఇమేజ్ కు భిన్నంగా వుండాలనే ఓ ప్రాజెక్ట్ చేపట్టారు. భాస్కర్ దర్శకత్వంలో రామ్చరణ్ నటుడిగా ఎలివేట్ అయ్యే అవకాశం వుంది కాబట్టి.. ఎంతమంది దర్శకులు పోటీ పడినా ఆ ఛాన్స్ భాస్కర్ కే దక్కిందనేది యదార్ధం. అలా ఆరెంజ్ వచ్చింది.
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar
అయితే... భాస్కర్ తర్వాత చరణ్ ను దర్శకత్వంచేసే ఛాన్స్ ఎవరికి లభిస్తుందేననే చర్చ వెంటనే మొదలు అయ్యింది. అంతకు ముందు వరకు శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడని బలంగా వినిపించింది. కానీ చిరంజీవి ఆలోచన వేరు.
ఇంతవరకు వచ్చిన 'చిరుత', 'మగధీర' సినిమాలు రెండూ మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొంటే..మూడు ,నాలుగు సినిమాలు మాత్రం అటు క్లాస్ ఆడియన్స్తోపాటు.. ఇటు మాస్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకొనే ఉద్దేశ్యంతో డైరక్టర్స్ ని వెతకాలనుకున్నారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
అప్పుడు చిరంజీవికి వచ్చిన ఆలోచన కె.విశ్వనాథ్. విశ్వనాథ్ గారు తన కెరీర్ లో స్వయంకృషి వంటి సూపర్ హిట్ ఇచ్చారు. రామ్ చరణ్ కు కూడా ఆయనంటే చాలా ఇష్టం, గౌరవం. ఓ సందర్భంలో విశ్వనాధ్ దర్శకత్వంలో చేయాలని రామ్ చరణ్ ఉవ్విళ్లూరుతున్నాడని స్వయంగా చిరంజీవే చెప్పాడు.
ఆ మేరకు చిరంజీవి స్వయంగా వెళ్లి తన కొడుకు కోసం మంచి సినిమా చేసి పెట్టమని విశ్వనాథ్ గారిని అడగటం జరిగిందిట. అయితే ట్రెండ్ మారిందని, తన తరహా కథలు ఇప్పుడు యంగ్ హీరోపై వర్కవుట్ కాదని, సున్నితంగా విశ్వనాథ్ గారు తిరస్కరించారట. లేకపోతే కె.విశ్వనాథ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా వచ్చి ఉండేది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
గేమ్ ఛేంజర్ తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో వినిపిస్తున్న పేరు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు అందించిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రమిది.
మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. శంకర్ గత చిత్రాల్లో ప్రధానమైన ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ సినిమాలు సామాజిక నేపథ్యం, అవినీతి కథాంశాలుగా తెరకెక్కాయి. తాజాగా వస్తోన్న గేమ్ ఛేంజర్ సైతం అదే తరహాలో రూపుదిద్దుకున్నట్లుగా అభిమానులు అంచనా వేస్తున్నారు.
Ram Charan
గేమ్ ఛేంజర్ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ప్రభుత్వ అధికారికి మధ్య జరిగే ఘర్షణగా తెలుస్తోంది. "కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే పెద్దగా దానికొచ్చే నష్టమేమీ లేదు..
కానీ అది లక్ష చీమలకు ఆహారం అనే డైలాగ్ తోపాటు "నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్" అనే మరో డైలాగ్ అవినీతి రాజకీయ నేతపై జరిపే పోరాటాన్ని గుర్తు తెస్తోందంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. "మన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నో సీన్లకు గేమ్ ఛేంజర్తో కనెక్ట్ అవుతారు" అని సినిమా నిర్మాత దిల్ రాజు సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించి ఆసక్తి పెంచారు.