MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్, అల్లు అర్జున్ ను చూస్తే కడుపు మండిపోతోంది.. వారివల్లే అలాంటి దుస్థితి.. చిరు షాకింగ్ కామెంట్స్!

రామ్ చరణ్, అల్లు అర్జున్ ను చూస్తే కడుపు మండిపోతోంది.. వారివల్లే అలాంటి దుస్థితి.. చిరు షాకింగ్ కామెంట్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిద్దరిని చూస్తే  కడుపు మండిపోతోందని అంటూ ఆవేదన వ్యక్తం చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవికి కలిగిన ఇబ్బందిని బహిర్గతంగా వివరించారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 29 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) దిక్సూచిగా మారారు. 40 ఏండ్లకు పైగా తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి యంగ్ హీరోలకు కూడా బాటలు వేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త టాలెంట్ కు కూడా చిరంజీవి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటికీ అన్నయ్య పట్ల సినీ ప్రియులకు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు, నటీనటులకు ఎంతో అభిమానం ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఆయన కీర్తి నేటికీ పెరుగుతూనే ఉంది. అలాంటి చిరుకి తన ఇంట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ తో అర్థం అవుతోంది. 
 

36

మెగాస్టార్ కొద్ది రోజులు ఆయా ఈవెంట్లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

46

అల్లు అర్జున్, రామ్ చరణ్ వల్ల తనకు ఇంట్లో గుర్తింపు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతరం పిల్లలు ఆ తరం నటీనటుల గొప్పను గుర్తించడం లేదని కాస్తా ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ గా ఎదిగినప్పటికీ తన ఇంట్లోని పిల్లలే చిరు స్థాయిని గుర్తించడం లేదని బాధపడ్డారు. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’, అల్లు అర్జున్ ‘పుష్ఫ’ లాంటి చిత్రాల్లో నటించడంతో ఈతరం పిల్లలు వారినే గొప్ప నటులుగా గుర్తిస్తున్నారని చెప్పారు. 
 

56

దీంతో తమ ఇంట్లోని పిల్లలకు చిరు తన సూపర్ హిట్ సినిమాల గురించి తానే చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. దీంతో  రియలైజ్ అయి ‘గాడ్ ఫాదర్’ సినిమాను తన ఇంట్లో ఉన్న ఎనిమిదేళ్లు, తొమ్మిదేళ్లు, ఐదేళ్ల పిల్లలు నాలుగైదు సార్లు చూశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్రెండ్ మారుతుండటంతో అలనాడు నటీనటులు ఎదుర్కొన్న సవాళ్లు కనుమరుగై పోతోందని అన్నారు. 

66

ఇలాంటి పరిస్థితుల్లో ‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకం రావడం భావితరాలకు ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆశించారు. లేదంటే తెలుగు దిగ్గజాలను మరిచిపోయేలా పరిస్థితి వస్తుందని, స్టార్లుగా ఎదిగినా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిందేనని సరదాగా కామెంట్ చేశారు.  

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved