- Home
- Entertainment
- కొన్ని కొన్ని నా చేతుల్లో లేకుండా పోతాయి..'ఆచార్య'పై సెటైర్లు వేస్తూ చిరంజీవి షాకింగ్ కామెంట్స్
కొన్ని కొన్ని నా చేతుల్లో లేకుండా పోతాయి..'ఆచార్య'పై సెటైర్లు వేస్తూ చిరంజీవి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకమైన రోల్ లో నటిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తుండడం విశేషం.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'. చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్య కీలకమైన రోల్ లో నటిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 11న పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. తెలుగులో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ చేస్తుండడం విశేషం.
నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో నాగ చైతన్య, అమీర్ ఖాన్, చిరంజీవి పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ముగ్గురూ ఓపిగ్గా సమాధానం ఇస్తూ.. లాల్ సింగ్ చడ్డా విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తన సినిమాల గురించి మాట్లాడుతూ పరోక్షంగా 'ఆచార్య' గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అమీర్ ఖాన్ చేసే పాత్రలు తాను చేయడానికి సాహసించను అని చిరంజీవి అన్నారు. అలాంటి పాత్రలు అమీర్ ఖాన్ కి మాత్రమే సాధ్యం అని అన్నారు. నా వరకు వస్తే నేను చేసే సినిమాలు జన రంజకంగా ఉండాలి. అమీర్ ఖాన్ ప్రయోగాలు, సాహసాలు చేసి ప్రేక్షకులని మెప్పించి ఒప్పించగలరు అని అన్నారు. కానీ నేను మాత్రం ప్రేక్షకులు వినోదాన్ని కోరుకునే సినిమాలు మాత్రమే చేస్తాను అని అన్నారు.
కానీ కొన్ని కొన్ని సార్లు నా ప్రమేయం లేకుండా, నా చేతుల్లో లేకుండా పోతుంది., వాటి గురించి మాట్లాడను అని నవ్వుతూ అన్నారు. ఆచార్య పరాజయం గురించే చిరంజీవి ఈ కామెంట్స్ పరోక్షంగా చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో పెద్ద వివాదమే జరిగింది. ఈ వివిధంలో దర్శకుడు కొరటాల శివ కూడా సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అలాగే అమీర్ ఖాన్ చేస్తున్న సినిమాలు, బాలీవుడ్ లో వస్తున్న విభిన్న పాత్రలు, ఆ రకమైన వర్క్ షాప్స్ చేసి.. టైం తీసుకుని టాలీవుడ్ హీరోలు చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా చిరంజీవి స్పందించారు. అలాగే చేయాలి అని చిరంజీవి అన్నారు. దర్శకుడు కథని టెక్నీషియన్స్, నటీనటులకు అందరికి అర్థం అయ్యేలా వివరించాలి.
ముందుగానే వర్క్ షాప్స్ చేయాలి. కొందరు నటులు కథ తెలియకుండా సెట్స్ కి వచ్చి అప్పటి కప్పుడు డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ పెర్ఫామెన్స్ కి ఛాన్స్ ఉండదు. అందుకే దర్శకుడు అందరికి ముందుగా కథ చెప్పి కీలకమైన డైలాగులు ప్రాక్టీస్ చేయించాలి అని చిరంజీవి అన్నారు.