MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజాపై చిరంజీవి సంచలన కామెంట్స్.. అడ్డదారిలో అది కావాలంటే నన్ను, నా ఫ్యామిలీని తిట్టాలి

రోజాపై చిరంజీవి సంచలన కామెంట్స్.. అడ్డదారిలో అది కావాలంటే నన్ను, నా ఫ్యామిలీని తిట్టాలి

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది. ఒక వైపు బాలయ్య చిత్రం, మరో వైపు చిరంజీవి చిత్రం బాక్సాఫీస్ బరిలో ఉండడంతో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 11 2023, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది. ఒక వైపు బాలయ్య చిత్రం, మరో వైపు చిరంజీవి చిత్రం బాక్సాఫీస్ బరిలో ఉండడంతో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. రెండు చిత్రాల ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీనితో చిరంజీవి, బాలయ్య ఇద్దరూ ప్రచారం కోసం రంగంలోకి దిగారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్ర పరిశ్రమలో సేవ కార్యక్రమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. గతంలో కోవిడ్ సమయంలో కూడా చిరు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అయితే ఇటీవల ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సినిమాల్లో ప్రజల డబ్బుతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ ప్రజలకు చిన్న సాయం కూడా చేయలేదు. 

36

అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ తో రోజాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. తాజాగా చిరంజీవి రోజా వ్యాఖ్యలపై ఇంటర్వ్యూలో పరోక్షంగా స్పందించారు.  చిరంజీవి మాట్లాడుతూ.. నన్ను తిడితేనే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. 

46

నా పేరు వాడకపోతే వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నానా తో స్నేహంగా ఉన్నవారే ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి వీళ్లకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. 

 

56

నన్ను తిట్టినా పర్వాలేదు.. నాకు ప్రశాంతతే ముఖ్యం. అందుకే నేను తిరిగి మాట్లాడను. నా నుంచి ప్రశాంతతని ఎవరూ దూరం చేయలేరు' అంటూ చిరు రోజాకి పరోక్షంగా చురకలు అంటించారు. రోజా మంత్రి పదవి పొందాక చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ ధరల సమస్య ఏర్పడినప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. అప్పుడు చిరుని అంతా ప్రశంసించారు. 

66

అయితే ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరి నిమిషం వరకు వేదిక మార్పులు చేస్తూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాని గురించి కూడా చిరు స్పందించారు. అలాంటి సందర్భాల్లో కోపం రాదా అని ప్రశ్నించగా.. నేను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే దానివల్ల ఇతరులకు సమస్యగా మారుతుంది. అందుకే చాలా సందర్భాల్లో కోపం దరిచేరనీయను అని చిరు అన్నారు. ప్రీరిలీజ్ వేడుక వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో జరిగింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
59 ఏళ్ల నటి ఆవేదన.. ఎప్పుడూ అత్త, అమ్మ, అమ్మమ్మ పాత్రలేనా?
Recommended image2
Travel Movies: ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చుట్టేయండి.. ఈ 5 సినిమాలు చూస్తే చాలు!
Recommended image3
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved