MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి

నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఒక హీరోయిన్ తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 11 2025, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవితో భానుప్రియ చిత్రాలు
Image Credit : Instagram/Chiranjeevi

చిరంజీవితో భానుప్రియ చిత్రాలు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. విజయశాంతి, రాధా, రాధిక, శ్రీదేవి లాంటి హీరోయిన్లతో చిరంజీవి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. భానుప్రియ తో కూడా చిరంజీవి కొన్ని చిత్రాల్లో నటించారు. ఖైదీ నెంబర్ 786, జేబు దొంగ, త్రినేత్రుడు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి భానుప్రియ గురించి చెప్పిన విషయాలు అందరిని షాక్ గురిచేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆమెతో డ్యాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అయిన చిరు
Image Credit : Asianet News

ఆమెతో డ్యాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అయిన చిరు

చిరంజీవి మాట్లాడుతూ రాధా, రాధిక లాంటి హీరోయిన్లతో నేను నటించినప్పుడు అభిమానులు మా కాంబినేషన్స్ ని మళ్ళీ మళ్ళీ కోరుకునేవారు. ఎందుకంటే మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే భానుప్రియ తో మాత్రం నటించేటప్పుడు చిరంజీవి ప్రారంభంలో ఇబ్బంది పడ్డారట. ముఖ్యంగా ఆమెతో కలిసి సాంగ్స్ లో డాన్స్ చేసేటప్పుడు చిరంజీవి చాలా సౌకర్యానికి గురైనట్లు తెలిపారు.

Related Articles

Related image1
అట్లీ తెరకెక్కించిన చిత్రాల వసూళ్లు ఇవే, ఐదవ చిత్రంతోనే పాన్ ఇండియా క్రేజ్
Related image2
రవి మోహన్, కెనీషా రిలేషన్..ఆమె గర్భవతి అంటూ రూమర్స్ ? కర్మ వదిలిపెట్టదు, ఘాటు రియాక్షన్ వైరల్
35
అద్భుతమైన క్లాసిక్ డ్యాన్సర్
Image Credit : Instagram/Chiranjeevi

అద్భుతమైన క్లాసిక్ డ్యాన్సర్

ఇండియాలో అద్భుతమైన క్లాసిక్ డాన్సర్స్ లో భానుప్రియ ఒకరు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంతటి అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ మన తెలుగమ్మాయి కావడం మనకి గర్వకారణం. ఆమెతో కలసి నటించేటప్పుడు ఆ విషయంలో నేను ఎంతో గర్వించే వాడిని. కానీ భానుప్రియ నాతో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా డాన్సర్ నే కదా అని ఫీలింగ్ తో ఉండేది. నన్ను మించి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో పోటీపడేది.

45
నీ కన్నా గొప్ప డ్యాన్సర్ ని కాదు
Image Credit : Asianet News

నీ కన్నా గొప్ప డ్యాన్సర్ ని కాదు

మేమిద్దరం డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె మా ఇద్దరికీ డాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నట్లు ఫీలయ్యేది. కానీ వాస్తవానికి మేమిద్దరం సినిమాలో నటిస్తున్నాం.  అది డాన్స్ కాంపిటీషన్ కాదు. ఆమె పోటీతత్వం వల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్సయ్యేది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయితే సినిమాకి నష్టం. అందుకే ఒకసారి భానుప్రియ దగ్గరికి వెళ్లి దీని గురించి మాట్లాడాను. భాను.. నీకన్నా గొప్ప డాన్సర్ ని కాదు నేను. నువ్వు అద్భుతమైన డాన్సర్ వి. కానీ ఇక్కడ మనిద్దరి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరగడం లేదు.

55
చిరంజీవి వార్నింగ్ తో వెనక్కి తగ్గినా భానుప్రియ
Image Credit : Asianet News

చిరంజీవి వార్నింగ్ తో వెనక్కి తగ్గినా భానుప్రియ

నీకు నాతో పోటీపడి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల సాంగ్ లో కెమిస్ట్రీ మెకానికల్ గా అనిపిస్తోంది. ఈ సాంగ్ ని చూస్తున్న ఆడియన్స్ కి డ్యాన్స్ కాంపిటీషన్ అనిపించకూడదు. మన జంట ఆడియన్స్ కి చూడముచ్చటగా అనిపించాలి అని సుతిమెత్తగా చురకలంటించారు. అప్పటి నుంచి భానుప్రియ చిరంజీవితో పాటకి తగ్గట్టుగా డాన్స్ చేయడం ప్రారంభించింది అని చిరంజీవి గుర్తు చేశారు. ఖైదీ నెంబర్ 789 చిత్రంలో గువ్వా గోరింకతో అనే పాట.. క్లాసిక్ సాంగ్ గా ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
అట్లీ తెరకెక్కించిన చిత్రాల వసూళ్లు ఇవే, ఐదవ చిత్రంతోనే పాన్ ఇండియా క్రేజ్
Recommended image2
రవి మోహన్, కెనీషా రిలేషన్..ఆమె గర్భవతి అంటూ రూమర్స్ ? కర్మ వదిలిపెట్టదు, ఘాటు రియాక్షన్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved