MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టు పట్టిన తేజు, ఎమోషనల్ అయిన చిరంజీవి.. కోలుకోకముందే రిపబ్లిక్ రిలీజ్ కు కారణం ఇదే

పట్టు పట్టిన తేజు, ఎమోషనల్ అయిన చిరంజీవి.. కోలుకోకముందే రిపబ్లిక్ రిలీజ్ కు కారణం ఇదే

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) ఈ నెల 10న బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తేజు హెల్మెట్ ధరించి ఉండడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డాడు. 

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 22 2021, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెల 10న బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తేజు హెల్మెట్ ధరించి ఉండడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అయినప్పటికీ శరీరంపై గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన తేజు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అపోలో ఆసుపత్రిలో తేజుకి చికిత్స కొనసాగుతోంది. 

28

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తేజు ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. అయితే రిపబ్లిక్ చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేయాలనేది సాయిధరమ్ తేజ్ కోరిక అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 

38

నేడు చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సందర్భంగా చిరంజీవి రిపబ్లిక్ చిత్రం గురించి, సాయిధరమ్ తేజ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో తేజు నటించిన సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం ఎమోషల్ గా, గుండె బరువెక్కినట్లుగా అనిపిస్తోంది. 

48

అందరి ఆశీస్సులు, భగవంతుడి దీవెనలతో తేజు ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతోంది అని చిరంజీవి అన్నారు. ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో రౌడీయిజాన్ని అరికట్టే యువ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఓటర్లు ఎలాంటి రాజకీయ వ్యవస్థని ఎన్నికోవాలి అని తెలియజెప్పే చిత్రం ఇది. 

58

ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు దేవకట్టా హానెస్టీ కనిపిస్తోంది. తేజు ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించాలి. దర్శకుడు, నిర్మాతలు, సాయిధరమ్ తేజ్ ప్రయత్నం విజయవంతం కావాలి. 

68

ఈ చిత్రం అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. తేజు ఇంకా కోలుకోకముందే రిలీజ్ కు ఎందుకు తొందర అని అనుకునేవాళ్లు ఉండవచ్చు. కానీ ఈ చిత్ర రిలీజ్ డేట్ ని పట్టుబట్టి ఫిక్స్ చేసింది సాయిధరమ్ తేజ్. అక్టోబర్ 2న గాంధీ జయంతి. దానికి ఒక్కరోజు ముందు మన చిత్రం విడుదల కావాలి. ఆ టైంలో రిలీజ్ కావాల్సిన పర్ఫెక్ట్ మూవీ ఇది అని సాయిధరమ్ తేజ్ కోరుకున్నాడు. కానీ ఇంతలో దురదృష్ట సంఘటన జరిగింది. 

78

తేజు కోరిక మేరకు అక్టోబర్ 1న రిపబ్లిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. వారి నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా అని చిరంజీవి అన్నారు. ప్రతి ఒక్కరూ రిపబ్లిక్ మూవీని థియేటర్స్ లో చూడాలని కోరారు. 

88

కొద్దిసేపటి క్రితమే విడుదలైన రిపబ్లిక్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు నటన హైలైట్ కాబోతోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై దేవ కట్టా సంధించిన అస్త్రమే ఈ రిపబ్లిక్. జెబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్ లాంచ్ లో తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved