- Home
- Entertainment
- ఆ దర్శకుడి దగ్గర కోట్ల ఆస్తులు కొన్న చిరంజీవి.. మోహన్ బాబు కోపం వల్ల ఇంత జరిగిందా ?
ఆ దర్శకుడి దగ్గర కోట్ల ఆస్తులు కొన్న చిరంజీవి.. మోహన్ బాబు కోపం వల్ల ఇంత జరిగిందా ?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో దర్శకులతో కలిసి పని చేశారు. చాలా మంది దర్శకులతో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ముందడుగు, సోగ్గాడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ బాపయ్య దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించారు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో దర్శకులతో కలిసి పని చేశారు. చాలా మంది దర్శకులతో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ముందడుగు, సోగ్గాడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ బాపయ్య దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
ఇంటి గుట్టు చిత్రానికి సంబంధించి ఆసక్తికర సంఘటన జరిగింది అని బాపయ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాస్తవానికి ఆ చిత్రంలో హీరో మోహన్ బాబు. షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఒకరోజు షూటింగ్ లో ఈ చిత్రంలో నటిస్తున్న కైకాల సత్యనారాయణకు జ్వరం వచ్చింది. కాబట్టి ఆయన సన్నివేశాలని త్వరగా పూర్తి చేసి పంపించి వేయాలి అని దర్శకుడు అనుకున్నారు. కైకాల సన్నివేశాలు చిత్రికరణ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు షూటింగ్ కి వచ్చారు. పరిస్థితి వివరించి వెయిట్ చేయమని చెప్పారట.
Mohan Babu
ఆలస్యం అవుతుండడంతో నన్నే ఎదురుచూడమని చెబుతారా అని మోహన్ బాబు దర్శకుడితో గొడవ పెట్టుకుని వెళ్లిపోయారట. దీనితో ఈ చిత్రం నుంచి మోహన్ బాబుని తొలగించి అప్పుడే ఎదుగుతున్న చిరంజీవిని తీసుకున్నారు. ఆ విధంగా ఇంటిగుట్టు చిత్రం చిరంజీవి చేతుల్లోకి వచ్చింది. ఈ చిత్రంలో నళిని, సుహాసిని హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చట్టంతో పోరాటం అనే చిత్రం కూడా వచ్చింది. ఆ విధంగా చిరంజీవి, బాపయ్య మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
తర్వాత రోజుల్లో బాపయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారట. రాఘవేంద్ర రావుతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారట. బాపయ్య దగ్గర చిరంజీవి కోట్ల విలువ చేసే ఫ్లాట్స్ కొనడం జరిగింది. చిరంజీవి మాత్రమే కాదు విజయశాంతి కూడా ఆయన దగ్గర ఆస్తులు కొన్నారట.