God Father Review:'గాడ్ ఫాదర్' ప్రీమియర్ షో రివ్యూ.. చిరంజీవి మెగా గర్జన, లెక్కలు సరి చేసినట్లేనా..
మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బోలెడు అంచనాలు పెట్టుకున్న ఆచార్య నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరపడే సమయం వచ్చేసింది. గాడ్ ఫాదర్ ప్రీమియర్ షోలు ప్రపంచం మొత్తం మొదలయ్యాయి.
పొలిటికల్ మాస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం మలయాళీ సూపర్ హిట్ లూసిఫెర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ఆచార్య నుంచి మెగాస్టార్ బౌన్స్ బ్యాక్ అయ్యారా ? ప్రీమియర్స్ నుంచి గాడ్ ఫాదర్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 157 నిమిషాల నిడివితో చిత్రం ప్రారంభం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పూరి జగన్నాధ్ పాత్రతో చిత్రం ప్రారంభం అవుతుంది.
స్లో నేరేషన్ తో సినిమా బిగిన్ అవుతుంది. అద్భుతమైన ఎలివేషన్ సన్నివేశంతో చిరంజీవి ఎంట్రీ అదిరిపోయింది అని ఆడియన్స్ అంటున్నారు. మూవీ స్లోగా మొదలైనప్పటికీ ఆ తర్వాత పిక్ అప్ అయిన విధానం అదుర్స్ అని అంటున్నారు. దర్శకుడు మోహన్ రాజా కథ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండా టైట్ స్క్రీన్ ప్లేతో నడిపించారు.
పర్ఫెక్ట్ రోల్ పడడంతో చిరంజీవి అదరగొట్టేశారు. సత్యదేవ్ నటన, అతడి పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటూ భలే ఇంప్రెస్ చేస్తుంది. చిరంజీవి, సత్యదేవ్, తమన్, మోహన్ రాజా కలసి ఫస్ట్ క్లాస్ అవుట్ ఫుట్ అందించారు అని ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ లో మోహన్ రాజా మెగాస్టార్ ని అద్భుతంగా ఎలివేట్ చేశారు.తమన్ బిజియం అయితే సాలిడ్ గా ఉంది. జైలు ఫైట్ సన్నివేశంలో అయితే ఫ్యాన్స్ కి పూనకాలే అని నాటున్నారు.
ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంటర్వెల్ సన్నివేశంలోనే సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. ఒరిజినల్ కథని పాడు చేయకుండా మోహన్ రాజా చేసిన మార్పులు అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. నజభజజజరా సాంగ్ స్క్రీన్ పై చాలా బావుంది.
లూసిఫెర్ మలయాళీ చిత్రం.. ఆ కథని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, ఇక్కడ పొలిటికల్ పరిస్థితులని అర్థం చేసుకుని మోహన్ రాజా స్క్రిప్ట్ తయారు చేసిన విధానం మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు. సెకండ్ హాఫ్ ని ఎమోషన్స్, ఎలివేషన్స్ తో చక్కగా మిక్స్ చేశారు. సల్మాన్ ఖాన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ మోహన్ రాజా తెలివిగా ఉపయోగించుకున్నారు.
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పొలిటికల్ డైలాగులు ఆకట్టుకుంటాయి. బ్రహ్మ పాత్రలో చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. సత్యదేవ్, నయనతార తమ పాత్రలో జీవించేశారు. మెగాస్టార్ కిమేజ్ కి తగ్గట్లుగా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ తమన్ సూపర్బ్ బిజియం ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఓవరాల్ గా చిరంజీవి ఇమేజ్ కి అన్ని విధాలా సరిపడే చిత్రం గాడ్ ఫాదర్.
ఆచార్య సెట్ బ్యాక్ తర్వాత గాడ్ ఫాదర్ తో చిరంజీవి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు అని ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో కొన్ని డల్ సన్నివేశాలు మాత్రమే ఈ చిత్రంలో నెగిటివ్ పాయింట్స్ గా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం గా నిలిచే సత్తా గాడ్ ఫాదర్ కి ఉందని అంటున్నారు.